సీమాంద్ర కాంగ్రెస్ లో ఎంపీల ప్రకంపనలు మొదలయ్యాయి. ఏడుగురు ఎంపీలు ఈ నెల 24న పదవులకు రాజీనామా చేసి ఆమోదింప చేసుకుంటామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇది ముఖ్యమంత్రితో సహా సీమాంద్ర కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రుల్లో దడ పుట్టించిందంటున్నారు. ఎలాగైనా ఎన్నికలు వచ్చేదాకా పదవుల్లో ఉండాలనే కదా ఎవరెంత గోల పెట్టినా రాజీనామాలు చేయకుండా నెట్టుకు వస్తోంది.
ఇప్పుడు వీరు రాజీనామాలు చేస్తే సిఎం తో సహా సీమాంద్ర కేంద్ర,రాష్ట్రమంత్రులు రాజీనామాలు చేయకపోతే ఇక వారిని తిట్టడం మాట అటుంచి ఉన్న చోటికి వచ్చి రాళ్లతో కొట్టడం ఖాయం అన్న ఆందోళన వారిలో కలిగింది. అందుకే వారిని రాజీనామాలు చేయకుండా ఆపేందుకు ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఒకరిద్దరు కేంద్రమంత్రులు రంగంలోకి దిగారని వార్తలు వినిపిస్తున్నాయి.
కారణం ఇప్పడు కేంద్రం తెలంగాణ ఇచ్చేందుకు సిద్దమయింది, దానిని ఆపడం కుదరదని కూడా అందరికి తెలిసిపోయింది. అంతే కాదు ఇప్పుడు ఎవరు రాజీనామా చేసినా సరే వెంటనే ఆమోదించేందుకు కూడా అధిష్టానం సిద్దంగా ఉందట. కారణం ఇక కథ క్లయిమాక్స్ కు వచ్చింది కాబట్టి. అలా చేస్తే పరిస్థితి ఏంటి తెలంగాణ బిల్లును అసెంబ్లీలో, అటు పార్లమెంట్ లో అడ్డుకునే ప్రయత్నం చేసి సీమాంధ్రలో పోయిన పరువును తిరిగి కాపాడుకొనే అవకాశం కూడా కోల్పోతామన్న ఆందోలన కూడా వారిలో కలిగిందట. ఇంతకీ ఏంజరుగుతుందో చూడాలి మరి.
Friday, 27 September 2013
సీమాంద్ర కాంగ్రెస్ లో ఎంపీల ప్రకంపన

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment