
ఈ అత్తారింటికిదారేది మూవీను సాధారణ సిని ప్రేక్షకులతో పాటు, టాలీవుడ్ ఫిల్మ్ సెలబ్రిటిలు కూడ పోటీ పడిచూశారు. ఈ రోజు కోసం టాలీవుడ్‌లో దాదాపు షూటింగ్‌లను ఆపుకొని మరీ సినిమాను చూశారు. పవన్ అభిమానులు అయితే మూవీ కేక, చించేసిందిందంటున్నారు. మరి సాధారణ ప్రేక్షకులు అయితే మంచి ఎంటర్‌టైనర్ మూవీ అంటున్నారు. వీళ్ళందరూ కాకుండా ఫిల్మ్ సెలబ్రిటిలు మూవీను చూసిన తరువాత ఏ విధంగా మాట్లాడుకున్నారనేది ఇప్పుడు చూద్ధాం.
అక్కినేని నాగార్జున: అత్తారింటికి దారేది మూవీ గురించి సూపర్ సక్సెస్ రిపోర్ట్‌ను విన్నాను. ఆ మూవీ టీం మొత్తానికి నా కంగ్రాట్స్. నేను ఇప్పుడు మూవీ చూడటానికి వెళుతున్నాను.
సిద్ధార్ధ్: అత్తారింటికి దారేది సూపర్ సక్సెస్. సమంత యాక్టింగ్ చాలా బాగుంది. ఈ మూవీతో సమంతను గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా పిలవటం ఖాయం.
వరుణ్ తేజ్: కంగ్రాట్ పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ అండ్ అత్తారింటికి దారేది యూనిట్. ఈ మూవీ బ్లాక్ బస్టర్
రామ్: అత్తారింటికి దారేది ఎక్స్‌ట్రీమ్ హిట్.
దిల్‌రాజు: కంగ్రాట్స్ త్రివిక్రమ్ అండ్ పవన్. సూపర్ ప్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ.
కోన వెంకట్: ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్.. అన్ బిలీవ్‌బుల్. ఈ మూవీకు రేటింగ్స్‌తో పనిలేదు. సినిమా చింపేసింది.
హరీష్ శంకర్: (మూవీ చూడలేదు) వర్క్ బిజితో మూవీను చూడలేదు. కాని మూవీ కెవ్వు కేక
డైరెక్టర్ మారుతి: పవన్ రేంజ్‌లో సినిమా ఉంది. ఇది ఎక్స్‌ట్రీమ్ బ్లాక్‌బస్టర్ మూవీ. ఆల్ ద బెస్ట్ అత్తారింటికిదారేది యూనిట్
వీళ్ళే కాకుండా ఇంకా అప్‌కమింగ్ యంగ్ హీరోలంతా మూవీను చూసారు. ఇంకా చాలా మంది సెలబ్రిటిలు ఈవినింగ్ షోకు ఐమాక్స్‌లోనూ, సంద్యా ధియోటర్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నారు.
No comments:
Post a Comment