Friday, 27 September 2013

జగన్ రాంగ్ టైమింగ్ లో.. రాంగ్ ప్లేస్ కి....


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదల అవ్వడం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులకు ఊపునిచ్చే వ్యవహారమే. చాలా కాలంగా నిస్తేజంగా మారిపోయిన ఆ పార్టీలో,నిస్తబ్ధత ఆవరించిన వైఎస్సార్ కాంగ్రెస్ లో తిరిగి పునరుత్తేజం కలిగిస్తోంది జగన్ రాక. ఇంత వరకూ బాగానే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాల్లోనే ఉన్నారు. అయితే..జగన్ ఇప్పుడు బయటకు రావడం వల్ల కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తమది సమైక్యవాదం అంటున్న జగన్ రెడ్డి పార్టీ పట్ల.. ప్రత్యర్థులైతేనేమీ, శత్రువులైతేనేమీ.. ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. సమైక్యవాద పార్టీగా చెప్పుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర విభజననే కోరుకుంటోందని.. విభజన పూర్తి అయితే.. సమైక్యవాదం వినిపించిన పార్టీ గా ఓట్లు అడగటానికి అవకాశం ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోందని వీరు అంటున్నారు. ఇప్పుడు దీని పై వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది జగన్ మీద. రాష్ట్ర విభజన గురించి కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేయకమునుపే తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న హోప్స్ అంతంత మాత్రమే. అయితే.. ఇప్పుడు విభజన ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఎలాగూ అక్కడ కాంగ్రెస్ , టీఆర్ఎస్ లప్రభంజనం ఉండే అవకాశం ఉందని, లెక్కలేసుకుని.. జగన్ సమైక్యవాదాన్ని అందుకున్నాడనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్్ కాంగ్రెస్ సమైక్యవాదం ఉత్తుత్తుదే అనే అభిప్రాయాలున్నాయి. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సి ఉంటుంది. చేయలేకపోతే.. జగన్ పార్టీపై జనాల్లో నెగిటివ్ ఇమేజ్ వచ్చే అవకాశాలున్నాయి.

No comments:

Post a Comment