ఎస్ నేనే ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అధిపతిని, అయినా సరే కాంగ్రెస్ ను తిట్టిపోస్తాను, తెలుగు సరిగా రాకపోయినా సరే వచ్చిన బాషలో శాపనార్ధాలు పెడతాను, దిగ్విజయ్ అయితేనేమి, ఆయనేమైనా కాంగ్రెస్ కు పర్మినెంటా, కమాన్ రండి తేల్చుకుందాం, ఎలా ముందుకు పోతారో చూస్తాను, ఆ దైర్యం కాంగ్రెస్ లో ఎవరికుందో చూసుకుంటాను అంటూ తొడగొట్టి సవాల్ విసిరారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.
ఇలా సవాల్ విసరడం ఈ మద్యకాలంలో ఎన్నోసార్లు చేసాడు, అయినా సరే కాంగ్రెస్ కు ఆమాటలు వినపడలేదు, పోని సిఎం ఇలా అంటున్నాడు అని మీడియా చెప్పినా కూడా అబ్బె బ్బే మాకు తెలియదే, సరే తెలుసుకుని తర్వాత చెబుతాం అంటున్నారు, కాదుకాదు సిఎం మరోసారి తొడగొట్టడానికి కొన్ని గంటలు ముందుకూడా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ చేసిన వాఖ్యలు ఇవే. అంతే కాదు సమైక్యరాష్ట్రానికి ఆయనే చివరిదాకా ముఖ్యమంత్రి అని డిక్లేర్ కూడా చేసాడు. అందుకే సిఎం చేసిన సవాల్ లో ఆయనదే విజయం, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి ఎవరు పీకలేరు అన్నది వాస్తవం అంటున్నారు రాజకీయ పరిశీలకులు కూడా.
కాంగ్రెస్ దాదాపు 125 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న భారతదేశపు అతిపెద్ద పార్టీ. ఇన్నేళ్ల చరిత్రలో పార్టీలోని హేమా హేమీలు కూడా పార్టీని, పార్టీలోని ముఖ్యనేతలను ఇలా తిట్టలేదు, పార్టీ నిర్ణయాలను ఇలా బహిరంగంగా వ్యతిరేకించలేదు, కనీసం ఆ దిశగా ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు, ఏ కొద్ది ధిక్కార స్వరం వినిపించినా సరే వారెంతటి వారైనా సరే పార్టీ నుంచి తొలగించారు.
Friday, 27 September 2013
తొలగించే దమ్ముందా... నేనే ముఖ్యమంత్రిని

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment