Friday, 27 September 2013

ప్రిన్స్ మహేష్ ఇంట్లో ఎవడు ?




టాలీవుడ్ ప్రిన్స్  హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి మంకీ క్యాప్ ధరించిన ఓ వ్యక్తి ప్రవేశించి దొంగతనానికి యత్నించాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ దొంగ తనం విఫలమైందిఅని తెలుస్తోంది.. ఆ సమయంలో మహేష్ ఇంట్లోనే ఉన్నారట, మహేష్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ప్రస్తుతం  పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 81లో హీరో మహేశ్‌బాబు నివాసం ఉంది. వివరాల్లోకి వెళితే బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మహేష్ బాబు ఇంటి ప్రహరీగోడ దూకిన అగంతకుడు సెక్యూరిటీ కళ్లుగప్పి ఇంటి వెనకాల కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు అని అంటున్నారు.
నేరుగా మహేష్ నిద్రిస్తున్న బెడ్‌రూమ్ వద్దకు చేరుకొని దొంగతనానికి యత్నించాడట. అలికిడి విన్న పని మనుషులు ఉలిక్కిపడి లేచారని అంటున్నారు ఎదురుగా మంకీ క్యాప్ ధరించిన వ్యక్తి నిలబడటంతో భయంతో అరిచారట. దీంతో సెక్యూరిటీగార్డ్‌లు అప్రమత్తం అవడంతో ఆ వ్యక్తిని వెంటనే ప్రధాన ద్వారం వద్దకు వచ్చి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ  అతడు అప్పటకే వెనక దారి నుంచి పరారయ్యాడు అని అంటున్నారు. విషయం తెలుసుకున్న మహేష్ బాబు బయటికి వచ్చి వివరాలు తెలుసుకుని, సెక్యూరిటీ గార్డ్‌ల ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతోంది.  ఇంట్లోకి చొరపడింది సెక్యూరిటీకి సంబంధించిన వ్యక్తులుగానే పోలీసులు అనుమానిస్తున్నారని తెలుస్తోంది.

No comments:

Post a Comment