
జగన్ జైలు నుంచి బయటకు రావడం, తదనంతర పరిణామాలు టిడిపి అధినేత చంద్రబాబును దిక్కుతోచని స్థితిలో పడేసింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం ఆయన ఇప్పటికి రాష్ట్ర విభజనపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. తెలంగాణలో పార్టీని వదులుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదు, అలా అని వదులుకోకపోతే సీమాంద్రలో పతనం ఖాయం. అందుకే చంద్రబాబుకు ఇప్పడు ఏంచేయాలో తోచడం లేదు అంటున్నారు.
నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో ప్రజలు, ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీని దగ్గరకు తీయని వారు ఇప్పుడు జగన్ రాగానే ఆయనకు మద్దతుగా నిలిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబులో దడుకు మొదలైంది. ఇదే కనుక జరిగితే సీమాంద్ర జగన్ మయం అయినట్టే. అలాంటప్పుడు ఆత్మగౌరవయాత్రతో దాదాపు వన్ సైడ్ అయినంత పని చేసి తెలంగాణలో అనవసరంగా దెబ్బతిన్నట్టే కదా.. అన్నది చంద్రబాబు ఆలోచనే కాదు, పార్టీ నేతలది కూడా.
అందుకే ఇప్పడు ఏంచేయాలి అన్నది చంద్రబాబు ముందున్న అసలుసిసలైన సవాల్. మరోవైపు చంద్రబాబు విభజనకు అనుకూలమన్న ఆరోపణలు మోపి హరిక్రిష్ణ బయటకు వెల్లినంత పనిచేసాడు. మరోవైపు తెలంగాణ నేతలు తమ అధినేత తెలుగువారందరి మనిషి అని, తెలుగువాళ్లు ఎక్కడ కష్టాల్లో ఉన్నా వారికి అండగా ఉంటాడని, ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదన్నదే ఆయన అభిప్రాయం తప్ప విభజనకు వ్యతిరేకం కాదంటున్నారు. అంతే కాదు అక్టోబరు ఒకటి నుంచి తెలంగాణ జిల్లాల్లో యాత్రలు చేసి ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు. ఇది సీమాంద్రలో టిడిపి ని పూర్తిగా దెబ్బతీస్తుంది కదా.. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో వైపు సీమాంద్రలో వైఎస్సార్ సిపి, తెలంగాణలో టిఆర్ఎస్ బలంగా తయారయ్యాక చంద్రబాబు కు సమైక్య రాష్టంగా ఉన్నప్పటికి, విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డప్పటికి అధికారం దక్కే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లినట్టే. అందుకే చంద్రబాబు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు అంటున్నారు.
No comments:
Post a Comment