వైఎస్పార్ సిపిలో కాంగ్రెస్ విలీనం కాబోతోందన్నది రాష్ట్రరాజకీయాల్లో లేటెస్టు గా వినిపిస్తున్న గరంగరం వార్త. అదేంటి సోనియా తో జగన్ డీల్ అని అందరు ఆరోపిస్తున్న దానికి భిన్నంగా ఈ వార్త వినిపిస్తోంది, ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తే మాత్రం పప్పులో కాలేసినట్టే అంటున్నారు. కారణం ఇది అక్షరాల నిజం అంటున్నారు, కాని వర్షన్ లోకాస్తా తేడా ఉన్నదంతే.
కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ సిపిలో విలీనం కావడంలేదు కాని కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ నేతలు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్ గూటిలోకి వచ్చేస్తున్నారట. పార్టీ విలీనం కాకపోతే ఏంటి ఖాలీ అవుతోంది కదా.. అలాంటప్పుడు వైఎస్సార్ సిపిలో కాంగ్రెస్ విలీనం అవుతోంది అంటే తప్పేంటి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
టోటల్ గా జగన్ పార్టీలోకి వెల్లడం లేదు కాని, మెజార్టి సంఖ్యలో వైఎస్సార్ సిపిలోకి, జగన్ తో పొసగని కొందరు టిడిపి లోకి వెల్లాలన్న ఆలోచనలో ఉన్నారన్నది లేటెస్ట్ వార్త. ఈ మేరకు వైఎస్సార్ సిపి లోకి వెల్లే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే జాబితా కూడా మీడియాలో బయటకు వచ్చేసింది. రఘువీరారెడ్డి వంటి ప్రముఖ రాష్ట్ర మంత్రితో పాటు, అనంత వెంకట్రామిరెడ్డి వంటి ప్రముఖ ఎంపీల వరకు వైఎస్పార్ సిపి లోకి వెల్లేవారి జాబితాలో ఉన్నారట. ఇక తెలుగుదేశంలోకి వెల్లే వారి జాబితా ఖరారు కాలేదు కాని వెల్లే అవకాశం ఉన్నవారి పేర్లు మాత్రం లీకయ్యాయి. మొత్తం మీద రిజల్ట్ ఏంటంటే సీమాంద్రలో ఇక కాంగ్రెస్ పార్టీ ఉండడంలేదని, పూర్తిగా దుకాణం బంద్ చేసుకున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు.
Friday, 27 September 2013
వైఎస్సార్ సిపిలో కాంగ్రెస్ విలీnam

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment