Friday, 27 September 2013

సంచలనం : రాష్ట్రపతి నిర్ణయంపై రాయేసిన రాహూల్


దేశ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది, అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని తనయుడు నో అన్నాడు, రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయంపై రాయితో బాదాడు రాహూల్. నేరచరితులు, నిందితులు, రిమాండ్ ఖైదీలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, చట్ట సభలకు హాజరు కావచ్చు అని రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ పై రాహూల్ గాంధీ నిప్పులు చెరిగారు. దీనిని చించి చెత్తబుట్టలో పారేయాలన్నారు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసారు, అది కూడా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అంటే అది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే అని ఎవరైనా అంటారు. అంటే నేరచరితులను కాంగ్రెస్ కాపాడేందుకు రాష్ట్రపతితో ఆపని చేయించింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా అన్నది అందరు ఊహించేదే. అందుకే రాహూల్ ఆ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించడం సంచలనం సృష్టిస్తోంది. నేరచరితులను రాజకీయ పార్టీలు ప్రోత్సహించడం సరికాదన్నారు. ఇది ఎవరికి మంచిది కాదన్నారు. దీనిని కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు ఓకే చేయడం దురదృష్టకరమని కూడా రాహూల్ చెప్పారు. ఓటరుకు తనకు నచ్చని అభ్యర్థిని తిరస్కరించే హక్కు కల్పించాలని సుప్రీం తీర్పు నిచ్చిన రోజే రాహూల్ ఈ విదంగా ప్రతిస్పందించడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.

No comments:

Post a Comment