ఎవరినోట తెలంగాణ మాట వస్తే అది నిజమని నమ్మాలని హైకోర్టు సైతం ఉద్యోగుల సమ్మె విషయంలో వాఖ్యానించిందో, అదే నోట తెలంగాణ మాట వచ్చేసింది. దీంతో ఇక తెలంగాణ ఏర్పాటు తప్పదన్న విషయం స్పష్టమైనట్టే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. విదేశీ పర్యటన ముగించుకుని ఇండియాకు వస్తూ ఆకాశంలో గాల్లో తేలుతూ విమానంలోనే నోరు విప్పి సమైక్యవాదుల ఆశలను గాల్లోనే కలిపేసారు ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్.ఇప్పడు కేంద్రం, తన ముందు ఉన్న అంశాల్లో తెలంగాణనే ప్రధానమన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను హోమంత్రి షిండే చూస్తున్నారని, అది ఎంత దాకా వచ్చిందో తెలియదని, వెల్లిన మరుక్షణం షిండేతో మాట్లాడి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎక్కడిదాకా వచ్చిందో కనుక్కుంటానని మీడియా కు చెప్పాడు ప్రధాని. దీంతో ఇది ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటన, ఇది కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అని వాదిస్తున్న వారికి షాకిచ్చినట్టే.
ఎందుకంటే ప్రధాని ఏకంగా ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆయన ప్రధాని హోదాలో విదేశాలకు వెల్లి అదే హోదాలో తిరిగి వస్తూ మాట్లాడిన మాటలివి. అంతే కాదు ఆయన అన్నది కూడా నాముందున్న వాటిలో తెలంగాణే ప్రదానమైనది అన్నారు. అంటే ప్రభుత్వ పరంగా ఆ ప్రక్రియ మొదలయినట్టే అంటున్నారు. అందుకే సమైక్య ఉద్యమం ఎంత చేసినా సరే అది గాలిలో కలిసినట్టేనన్న సంకేతాలు జారీ అయ్యాయన్న వాదన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.
No comments:
Post a Comment