Tuesday, 1 October 2013

డేంజర్ లో చంద్రబాబు : అమ్మకానికి టిడిపి ఎమ్మెల్యేలు


టిడిపి అధినేత పెద్ద డేంజర్ లో ఉన్నాడట, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు హోల్ సేల్ గా అమ్ముడు పోవడానికి రెడిగా ఉన్నారట. ఈ అమ్మకానికి డీలర్ బాద్యతలు కూడా జగన్ రెండు కన్నుల్లోని ఓ కన్నే తీసుకుందట, ఇదీ... ఇప్పడు రాష్ట్ర రాజకీయాల్లో సాగుతున్న గరంగరం చర్చ. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి సిద్దం, కాని రేటు విషయంలోనే ఇంకా ఫైనల్ కాలేదంటున్నారు.

అయితే ఈ డీల్ ఎప్పుడో మొదలయింది, అప్పట్లో ఎమ్మెల్యేల అవసరం కేసిఆర్, జగన్ లకు ఇద్దరికి ఉంది, అప్పడు ఈ ఇద్దరు ఆకర్ష్ పథకం పెట్టి టిడిపి ని ఖాలీ చేయాలని చూసారు. అప్పుడు చంద్రబాబు ఎంతగానో నమ్ముతున్న తెలంగాణ కన్ను రేవంత్ రెడ్డినే (డీలర్ గా అనుకోండి బ్రోకర్ గా అనుకోండి... రెండింటిలో ఏది సూట్ అయితే అది) మారి 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీని వీడి వారందరితో అయితే కేసిఆర్, లేకుంటే జగన్ అంటే ఎవరు ఎక్కువ ఆఫర్ ఇస్తే వారి గూట్లోకి వెల్లేందుకు బేరమాడాడని అప్పట్లో టిడిపి లో ఉండి ఇప్పుడు వైఎస్సార్ సిపిలో ఉన్న సీనియర్ నేత ఇటీవల వాఖ్యానించారు.

 అయితే రేవంత్ కు ఒక పార్టీ 15 కోట్లు ఆఫర్ కూడా ఇచ్చిందట, కాని ఆఎమ్మెల్యేలందరికి అంతో ఇంతో ఇచ్చి, తాను కొంత దక్కించుకోవాలంటే కనీసం 400 కోట్లు కావాలని పట్టుబట్టడంతో డీల్ ఫెయిలయిందని కూడా ఆ నేత వాఖ్యానించాడట. అయితే ఇప్పడు టిడిపి ఎమ్మెల్యేల అవసరం కేసిఆర్, జగన్ లకు తెలంగాణలో లేదు. పైగా టిడిపి తెలంగాణలో పతనం అవుతుండడంతో వారే బాబ్బాబు మమ్మల్ని చేర్చుకోండి వస్తాం అనే పరిస్తితులు టిడిపి వారికే ఏర్పడడంతో రేవంత్ రెడ్డి పరిస్తితి రెంటికి చెడ్డ రేవడిలా తయారు అయిందంటున్నారు. అయితే వారంతా ఇప్పుడు ఫ్రీ గానే టిడిపి ని వీడేందుకు తయారయ్యారట, ఇది నిజంగా చంద్రబాబుకు డేంజర్ న్యూసే కదా...

No comments:

Post a Comment