సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అత్తారింటికి దారేది సూపర్ హిట్ టాక్ తరువాత మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. అంతేకాదు మళ్ళీ పవన్ పై సంచనల వ్యాఖ్యలు చేశాడు మన సెన్సేషనల్ డైరెక్టర్. తన దృష్టిలో పవన్ ఒక ఇడియట్ గా మారిపోతున్నాడు అని అంటూ ఈ మాటలను తాను పవన్ పై ఉన్న వెర్రి అభిమానంతో అంటున్నాను అంటూ కామెంట్ చేస్తున్నాడు. ఆయన మాటలలో ఈ పరిస్థితులలో కూడా పవన్ రాజకీయ పార్టీ పెట్టకపోతే భవిష్యత్ లో ఆయన ఒక ఇడియట్ గా మిగిలిపోతాడు అని అంటూ అత్తారింటికి దారేది కి వచ్చిన మెగా సక్సెస్ ఆ సినిమా గొప్పదనం వల్ల కాదని, పవన్ కళ్యాణ్ పట్ల తెలుగు ప్రజలకు ఉన్న వెర్రి అభిమానం ఆ సినిమాను అంత బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చిందని అంటున్నాడు వర్మ.
వర్మ అభిప్రాయంలో పవన్ అత్తారింటికి దారేది బాలీవుడ్ సినిమాలలో కాకుండా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతొందట. హాలీవుడ్ లోని ప్రముఖ సినిమా కంపెనీలు ఈ సినిమా అమెరికాలో సృష్టిస్తున్న సునామి ని చూసి ఆశ్చర్యపోతున్నాయి అట. అంతేకాదు రేషియో ప్రాతిపదికన తీసుకుంటే పవన్ అత్తారిల్లు షారుఖ్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ను ధాటిపోయి౦దని అంటున్నాడు ఈ విలక్షణ దర్శకుడు. అమెరికాలో ఈ సినిమా క్రేజ్ ను చూసిన చాలామంది తెలుగు అర్ధంకాని వాళ్ళు అత్తారింటికి దారేది అంటే అర్ధం ఏమిటి అని వర్మ ను అడుగుతున్నారట.
ఈ సినిమా గురించి ఇన్ని గొప్పతనాలు ఏకరువు పెట్టిన వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సునామి స్టార్ గా పిలవమంటూ పవన్ అభిమానులకు సలహా ఇస్తున్నాడు వర్మ. వర్మ పొగడ్తల దండకంతో సునామి స్టార్ గా పేరు మారబోతున్న పవర్ స్టార్ రాజకీయాల లోకి వస్తాడా..? రాడా..? అన్నది సమాధానం లేని ప్రశ్న అయితే, గబ్బర్ సింగ్-2 గా వస్తాడు అన్నది మాత్రం ఖచ్చితమైన సమాధానం.
Tuesday, 1 October 2013
పవన్ ను ఇడియట్ అని సంబోధిస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్...!

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment