Tuesday, 1 October 2013

ఆంద్రావాళ్లు ద్రోహులే... మరోసారి బాంబేసిన కేసిఆర్


ఎస్... ఆంద్రావాళ్లు ద్రోహులే, అందులో అనుమానం, డౌట్లు ఎవరికి అవసరం లేదు, ఆమాటకు వెనక్కి పోయేది లేదు అంటూ తాజాగా మీడియా సమావేశం పెట్టి మరీ బాంబేసాడు కేసిఆర్. ద్రోహులు కాకపోతే మరేంటి అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు లేఖ ఇవ్వడం, ఇప్పుడు మాటమార్చడం ద్రోహా కాదా, విజయమ్మ, జగన్ లు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడి ఇప్పుడు మాట మార్చడం ద్రోహం కాదా.. ఇది నారాయణ, దత్తాత్రేయలకు తెలియదా అన్నారు.

 చెల్లెలు షర్మిల హైదరాబాద్ ను పాకిస్తాన్ తో పోల్చింది, అదే హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకుంటా అని జగన్ అంటాడు, పాకిస్తాన్ తో జగన్ కు పనేంటి అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఏమన్నడు, మళ్లీ ఆయనేం చేసిండు, అది ద్రోహం కాదా.. ఓయు విద్యార్థులను తాలిబన్లతో పోల్చిండ్రు, తెలంగాణ వారు రాక్షసులు, రాక్షస ప్రవృత్తి వారిది అన్నారు, ఇక నన్ను, సోనియాను రాక్షసులకంటే హీనంగా, ఘోరంగా, పశుపవృత్తి కంటే దారుణంగా ప్రతిరోజు ఎన్నేసి మాటలంటున్నారు ఇవి పేపర్లో, చానళ్లలో వస్తలేవా, అవి కనపడత లేవా అన్నాడు.

 అంతెందుకు ఖలిస్తాన్ వారి ఉసురు తాకి ఇందిరాగాంది చచ్చిపోయింది, తమిళుల ఉసురుతాకి రాజీవ్ గాంది చచ్చిపోయాడు, సీమాంద్రుల ఉసురు తాకి సోనియాగాంది చచ్చిపోతుంది అన్నారు, ఇదేంటి, ఇది ఘోరం కాదా, తానన్నది నేతలనే, ప్రజలను కాదు, ద్రోహం చేసిన వారినే నేనన్నాను అన్నాడు. మంత్రి అయి ఉండి టిజి వెంకటేష్ ఏమన్నాడు ప్రైవేటు సైన్యాన్ని తయారు చేస్తానన్నాడు, మరో మంత్రి ఆనం ఏమన్నాడు మానవబాంబులను తయారు చేస్తాను అన్నాడు వారి మాటలను మీడియా కూడా హైలెట్ చేయకుండా ఆపుతోంది, ఇది మానుకోవాలి, తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు, అంతే కాదు నారాయణ, దత్తాత్రేయ కంటే తెలుగు నాకే బాగా వచ్చు, నేను తెలుగులో లిట్రేచర్ చదువుకున్నాను అన్నారు. నేను రాజకీయ నాయకున్నే కాదు, ఒక ఉద్యమాన్ని కూడా నడుపుతున్నాను, నాప్రాంతం వారికి ఆత్మవిశ్వాసం కలిగించడానికి నేను మాట్లాడాల్సి వస్తుంది తప్పదు అంటూ కేసిఆర్ స్పష్టం చేసాడు.

No comments:

Post a Comment