న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: పెట్రోల్ ధర దిగొచ్చింది. లీటరుకు రూ.3.05 పైసల వంతున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే ఇది అమలులోకి వస్తుందని పేర్కొన్నాయి. దీనిపై పన్నులు కూడా కలిపితే తగ్గింపు సుమారు రూ.3.66గా ఉండొచ్చు. గడచిన ఐదు నెలల కాలంలో తొలిసారిగా ధర తగ్గగా, ఐదేళ్ల వ్యవధిలో ఈ తగ్గింపు అత్యధికం కావడం విశేషం. అయితే, డీజిల్‌పై మాత్రం నెలవారీ విధానం మేరకు 50 పైసలు పెంచుతున్నట్లు ప్రకటన వెలువడింది. అమెరికా డాలరులో రూపాయి మారకం విలువ పెరిగినందువల్లే పెట్రోల్ ధరను తగ్గించినట్లు సమాచారం. కాగా, రూపాయి విలువ తగ్గిందంటూ ఈ ఏడాది జూన్ నుంచి ఏడుసార్లు మొత్తం రూ.10.80 మేర పెంచగా, పన్నులు కలిపిన తర్వాత ప్రజలపై భారం రూ.13.06కు చేరింది.
ఇక డీజిల్‌పై జనవరి 17 నుంచి ఇప్పటిదాకా తొమ్మిదిసార్లు పెంచగా, మొత్తం పెంపు లీటరుకు రూ.5.39గా నమోదైంది. మరోవైపు 14.2 కిలోల సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్‌పై గరిష్ఠంగా రూ.71.50 మేర చమురు కంపెనీలు బాదేశాయి. దీనివల్ల వినియోగదారులు 9 సిలిండర్ల పరిమితికి మించి తీసుకునే ప్రతి సిలిండర్‌కు ఇకపై భారీగా చెల్లించుకోవాల్సిందే. అయినప్పటికీ డీజిల్, కిరోసిన్‌లపై లీటరుకు రూ.10.52, రూ.38.32 వంతున, వంటగ్యాస్‌పై రూ.532.50 మేర నష్టపోతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పేర్కొంది. ఈ మూడు ఉత్పత్తుల మీద ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు రూ.73,500 కోట్ల లోటు ఉంటుందని, అన్ని కంపెనీలకు కలిపి ఇది రూ.1,39,600 కోట్లని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, గ్యాస్ సిలండర్ ధరలు కూడా మరోసారి పెరిగాయి. దీంతో సిలిండ్ ధర 1024.50 నుంచి రూ. 1,111 లకు చెరుకుంది.
- See more at: http://www.andhrajyothy.com/node/5830#sthash.re5xtN1Y.dpuf
Tuesday, 1 October 2013
పెట్రోల్ ధర తగ్గింది

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment