Tuesday, 1 October 2013

మహేష్ బాబు ను టార్చర్ పెడుతున్న డైరెక్టర్


టాలివుడ్ టాప్ స్టార్ మహేష్ బాబును ఓ డైరెక్టర్ విపరీతమైన టార్చర్ పెడుతున్నాడట. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో పడ్డాడట ప్రిన్స్, నావల్ల కాదు, నన్ను వదిలేయ్ మొర్రో అంటూ మొత్తుకున్నా సరే, నువ్వే కావాలి అంటూ ఆ డైరెక్టర్ వెంటపడుతూ పెడుతున్న టార్చర్ అంతా ఇంతా కాదు.
ఆయన ఎవరో కాదు తమిళంలో పేరుమోసిన డైరెక్టర్ లింగు స్వామి. యాక్షన్, మాస్ ఎంటర్ టైనర్ సినిమాలు తీయడంలో దిట్ట. అంతే కాదు బిగ్ హిట్లను డబ్ చేయడంలోను ఫేమస్. ఆవారా డబ్ చేసింది ఆయనే.
అయితే డబ్బింగులతో కాకుండా ఫ్రెష్ స్టోరీతో టాలీవుడ్ లో బిగ్ హిట్టుతో అడుగు పెట్టాలనుకుంటున్నాడు లింగు స్వామి. అది కూడా మహేష్ బాబు తోనే తీయాలని ఆయన తాపత్రయం. మహేష్ బాబు కు తెలుగు డైరెక్టర్లు తప్ప ఇతర భాషల డైరెక్టర్లతో తీయడం ఇష్టం లేదు. అందుకే నో చెపుతున్నాడు, అయినా సరే వెంటపడుతుండడంతో ఏదో ఒక రోజు ప్రిన్స్ బెండ్ అవుతాడేమో అంటున్నారు.

No comments:

Post a Comment