సిఎం మార్పు, లేదా రాష్ట్ర పతిపాలన విదించడం లో ఏదో ఒకటి జరుగుతుందన్న ఊహాగానాలు వెలుబడుతున్న నేపథ్యం కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ అంతర్గత మార్పులు అది నిజమే అన్న భావానికి బలం చేకూరుస్తున్నాయంటున్నారు. అక్టోబరు 3న కేంద్ర క్యాబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తుంది అని భావిస్తున్న నేపథ్యంలో అది అసెంబ్లీకి రాకముందే దానిని వ్యతిరేకిస్తున్న సిఎం కిరణ్ కు ఉద్వాసన, ఆయన స్థానంలో తెలంగాణ నోట్ ఆమోదానికి అనుకూలంగా వ్యవహరించే మరో నేత ముఖ్యమంత్రి రాడు కదా.. అన్నసందేహాలయితే క్లియర్ అవుతున్నాయంటున్నారు.
కారణం ఉన్నట్టుండి మంగళవారం కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారడం మొదలెట్టాయి.వారు కలిసి పోరాడకుండా విడిపొతూ ఉండడం కాంగ్రెస్ కు కలవరపెడుతున్న అంశం. కాంగ్రెస్ లో గ్రూపులు సహజం, కాని ప్రస్తుత పరిస్థితుల్లో అది ప్రమాదకరమే, అందరు కలిసి పోరాడాల్సిన సమయంలో ఇలా గ్రూపులుగా విడిపోతుండడం ప్రమాదకర సంకేతాలను జారీ చేస్తోంది. మంత్రి గంటా నివాసంలో మంగళవారం మంత్రి శైలజానాథ్, ఎంపీ లగడపాటి వంటి వారు సమావేశమయితే, మరో మంత్రి ఆనం ఇంట్లో కేంద్రమంత్రి చిరంజీవి, వట్టి వసంత్ కుమార్, పిసిసి చీఫ్ బొత్స వంటి వారు సమావేశమయి మంత్రాంగం మొదలుపెట్టారు. అంటే సిఎం కిరణ్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంలు గా రెండుగా చీలిపోతున్నారన్న మాట. సిఎం కిరణ్ ను ఇక తప్పిస్తారు, ఆయన పార్టీ పెడుతున్నారు అన్న వార్తలు ఊపందుకున్న తరుణంలో ఈ పరిణామాలు ఎవరు ఎవరికి చెక్ పెడతారో అన్న ఉత్కంఠను రేపుతున్నాయి. శైలజానాథ్, లగడపాటి వంటి వారు వేరుగా, సిఎం అంటేనే గిట్టని బొత్స, చిరంజీవి వంటి దిగ్గజాలు వేరుగా మంతనాలు మొదలుపెట్టారంటే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ లోనే కాదు ప్రభుత్వంలో కూడా పెనుమార్పులు చోటు చేసుకుంటాయన్న సంకేతాలు మాత్రం వెలుబడుతున్నాయి అంటున్నారు.
No comments:
Post a Comment