'నా హయాంలో రాష్ట్ర విభజన జరగదు...' అని అంటున్నాడట కిరణ్ కుమార్ రెడ్డి. తనతో సమావేశమైన మంత్రులతో కిరణ్ ఈ మాట చెప్పాడట. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాల గురించి చర్చించడానికి తాజాగా ముఖ్యమంత్రితో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. వీరితో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది.అయితే ముఖ్యమంత్రి మాటలకు రెండు పార్శ్వాలున్నాయి. 'నా హయాంలో విభజన జరగదు..' అని ముఖ్యమంత్రి అంటున్నాడంటే.. విభజన ప్రక్రియ పూర్తిగా ఆగిపోనైనా ఆగిపోవాలి.. లేదా విభజనకు ముందే ఆయన రాజీనామా చేయాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి జరిగితే ముఖ్యమంత్రి స్టేట్ మెంట్ నిజమయినట్టు అవుతుంది. మరి వీటిలో ఏది జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని అనుకుంటే చేయొచ్చు.. అని ఢిల్లీ నాయకులు ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. కిరణ్ కు పొగపెట్టే ప్రక్రియ ఇది అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక విభజన విషయంలో కూడా వెనుకడుగు వేయమని ఇప్పటికే కేంద్రం నుంచి అనేక ప్రకటనలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఏమో తాను ఇప్పటికీ సమైక్యవాదేనని అంటున్నాడు. విభజనపై పునరాలోచించుకోవాలని కిరణ్ ప్రెస్ మీట్ లు పెట్టి అధిష్టానానికి హెచ్చరికలు లాంటి సూచనలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. కిరణ్ మాటలు కాస్తంత నిస్తేజంగానే ఉన్నాయి. 'నా హయాంలో రాష్ట్ర విభజన జరగదు..'అంటున్న ఆయన విభజన తప్పదని అర్థం చేసుకున్న తరుణంలో పదవికి రాజీనామా చేసి వైదొలగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment