Friday, 4 October 2013

మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రియా ఆనంద్ రొమాన్స్!


లీడర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ప్రియా ఆనంద్. పిల్ల బాగానే ఉంటుంది. చక్కగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది. దాంతో రామరామ కృష్ణకృష్ణ సినిమాలో రామ్ సరసన చోటు దక్కింది. కానీ టాలీవుడ్లో శాశ్వత స్థానం మాత్రం దక్కలేదు. అందుకే అదృష్టాన్ని వెతుక్కుంటూ బాలీవుడ్ వరకూ వెళ్లింది. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంతో మంచి మార్కులు సంపాదించి, అక్కడ కొన్ని అవకాశాలు కొట్టేసింది. మెల్లగా తమిళుల కంట్లో కూడా పడింది.

 పెదిర్ నిశ్చల్ సినిమాతో తమిళంలో హిట్ కొట్టింది ప్రియ. ఆమె నటన అక్కడి వాళ్లకు నచ్చడంతో వెంటనే వణక్కమ్ చెన్నై అనే చిత్రంలో చాన్స్ దొరికింది. దీనితో పాటు పెన్సిల్ అనే సినిమాలో కూడా బుక్కయ్యింది ప్రియ. ఇందులో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ హీరోగా నటించనున్నాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి చిత్రాల ద్వారా ప్రకాశ్ మనకు పరిచితుడే. మ్యుజీషియన్ గా ప్రూవ్ చేసుకున్న ఇతగాడు హీరోగా కూడా రాణించాలని ఆశపడుతున్నాడు. అందుకే పెన్సిల్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు.

అతడి సరసన ప్రియ అందాలు ఒలికించనుంది. ఓ మంచి మ్యూజిక్ కమ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో తన రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటోందని చెబుతోంది ప్రియ. అయితే ఈమెకి ఓ అసంతృప్తి మిగిలేవుంది. హిందీ వాళ్లకు మెచ్చారు. తమిళులు పిలిచి చాన్స్ ఇచ్చారు. కానీ తాను ఎంట్రీ ఇచ్చిన తెలుగు సీమ మాత్రం తనను పట్టించుకోవడం లేదని కాస్త ఫీలవుతోంది ప్రియ. మరి మనవాళ్లెవరైనా ఈ ముద్దుగుమ్మ బాధను తీర్చడానికి ముందుకొస్తారో లేదో!

No comments:

Post a Comment