Friday, 4 October 2013

పుత్తూరులో ఉగ్రవాదుల దాడి.. కానిస్టేబుల్ మృతి


చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులో అల్ ఉమా ఉగ్రవాదులు కలకలం రేపారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న విశ్వసనీయ సమాచారం అందడంతో తమిళనాడు, ఆంధ్రా పోలీసులు దాడి చేయగా.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మరణించారు. ఓ ఇన్ స్పెక్టర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భావిస్తున్న ఇంట్లో మరో నలుగురి వరకు అల్ ఉమా ఉగ్రవాదులున్నట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆక్టోపస్ బలగాలను అక్కడకు తరలించినట్లు డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. సుమారు 30 మంది ఆక్టోపస్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

 ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారనే సమాచారం అందడంతో గేటు పుత్తూరు మేదరవీధిలోని ఓ నివాసంలో తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు అక్కడకు చేరుకోగానే తొలుత అక్కడున్న అనుమానితులు ప్రతిఘటించారు. కొద్ది సేపటికే వాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మరణించగా, మరో ఇన్ స్పెక్టర్ గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

No comments:

Post a Comment