" 2014 వరకు తెలంగాణ రాష్ట్రం రాదన్న వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. విభజన నిర్ణయం అమలు కాకుండా ఉండేందుకు ఏం చేయాలి ? ఎలా ముందుకు వెళ్లాలి ? అన్న విషయంలో నా వద్ద చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇక ఇప్పుడు వీటిని అమలు చేస్తా. పార్టీలో ఉంటే వీటిని అమలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచనతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశాను...'' అని అన్నాడు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.కేవలం అరుణ్ కుమార్ మాత్రమే కాదు.. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఇదే మాట మాట్లాడుతున్నారు. వీళ్లు రాష్ట్ర విభజన జరుగుతుందని ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. తెలంగాణ నోట్ ను క్యాబినెట్ ఆమోదించినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ఏర్పడదు.. రాష్ట్రం విడిపోదు. దానికి ముందు ముందు చాలా జరగాల్సి ఉంది... అంటున్నారు వీళ్లు. అయితే వీళ్లను జోకర్లుగా అభివర్ణిస్తున్నారు సీమాంధ్ర ప్రజలు. విభజన విషయంలో వీరు సీమాంధ్ర ద్రోహులుగా నిలిచిన వీళ్లు ఇప్పుడు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు అని సమైక్యవాదులు మండిపడుతున్నారు. ఓవరాల్ గా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి.
No comments:
Post a Comment