
ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తన గురించి తెలియని విషయాల గుట్టు విప్పాడు రమేష్. తన తండ్రి సింగరేణి కార్మికుడిగా ఉండేవారని, ఆయన నిత్యం మద్యం తాగి ఇంటికి తూలుతూ రావడం, కేకలు వేయడం వంటివి చిన్నప్పటి నుంచి తను చూడటంతో తాగుబోతుల ముఖ కవళికలు ఎలా ఉంటాయి అనే విషయంతో పాటు తాగుబోతుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తనకు చిన్నప్పటి నుంచి అనుభవం అయిందనీ అందుకే తాను తాగుబోతు పాత్రలను బాగాచేసి మెప్పించ గలుగుతున్నానని అన్నాడు. అంతకు ముందు తాను ఉత్సవాల సమయంలో చిన్నచిన్న ప్రదర్శనలు ఇచ్చేవాడినన్నారు.
2006 నుంచి కొన్నేళ్లపాటు సినిమాల్లో వేషాలకోసం కళ్లుకాయలు కాసేలాగా ఎదురుచూశానని, చివరకు ‘జగడం’ సినిమాలో చిన్నపాత్ర దొరికి తనకు ఆశను చిగురించిందనీ చెపుతూ, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మహాత్మా’ సినిమాతో మంచి గుర్తింపువచ్చిందని అన్నాడు. ఇప్పటివరకూ దాదాపు వంద సినిమాల దాకా చేసానని చెపుతూ తన జీవితంలో ఎదురైన చేదుసంఘటనలు తనను హాస్య నటుడిగా మార్చయనీ తన తండ్రిని చూసినతరువాత తనకు తాగుబోతులంటే భయమని అంటున్నాడు రమేష్. తగుబోతులంటే భయపడే రమేష్ తాగుబోతు పాత్రలో రాణించడం యాదృచ్ఛికo అనుకోవాలి...
No comments:
Post a Comment