హైదరాబాద్, అక్టోబర్ 4 : రాష్ట్ర విభజన నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని న్యాయవాది పీవీ క్రిష్ణయ్య దాఖలు చేశారు. పిటిషన్లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ప్రధాన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) తోపాటు అన్ని రాజకీయ పార్టీలను, తెలంగాణా పొలిటికల్ జేఏసీ, టీఎన్జీవోల సంఘం, ఏపీఎన్జీవోల సంఘం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావులను ప్రతివాదులుగా చేర్చారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని అనుసరించి రాష్ట్ర విభజనకు ముందుకు వెళ్లరాదని కోరారు. అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ సమావేశంలో టేబుల్ ఐటమ్ గా విభజన నోటను ఆమోదం చెల్లదని పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్టికల్ 3లోని పార్ట్ 3 రాజ్యాంగ మౌళిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని, 5వ రాజ్యాంగ సవరణ (1955)లో విభజన బిల్లుపై శాసనసభ అభిప్రాయానికి పంపినపుడు నిర్ణీత గడువు విధించారని, సవరణకు ముందు ఆర్టికల్ 3లో ఈ అంశం లేదని, ఈ రెండు అంశాలు రాజ్యాంగ మౌళిక సూత్రాలకు, ప్రియాంబుల్కు వ్యతిరేకంగా ఉన్నాయని వీటిని కొట్టి వేయాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్టికల్ 371(డి) కింద ప్రత్యేక ఏర్పాటు ్ల ఉన్నాయని, దీనిని ప్రకారమే రాష్ట్రంలో విద్యా, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు, స్థానిక రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఆర్టికల్ 371(డి) అమలులో ఉన్నంత కాలం రాష్ట్ర విభజన చేయరాదని, దీనిని సవరించే వరకు విభజన ప్రక్రియను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ప్రస్తుత రాష్ట్రపతి గతంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారని, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాష్ట్ర అంశాలపై ఆయనకు సబందం ఉందని, ప్రస్తుతం ఆయనే రాష్ట్ర పతిగా ఉన్నందున ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి ఆయన తుది నిర్ణయం తీసుకోరాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోలు ఎవరైనా సరే రాష్ట్ర విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ధర్నాలు, బంద్‌లు చేయకుండా నిరోధించాలని పిటిషన్లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
No comments:
Post a Comment