Friday, 25 October 2013

నాగ్ చేయని సాహసం నరేష్ చేస్తాడా?


నాగార్జున కెరియర్ లో ఒక సూపర్ హిట్ గా మిగిలోపోయిన ‘హలో బ్రదర్’ సినిమాను తన కొడుకు నాగాచైతన్యను హీరోగా పెట్టి శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆఖరి నిముషంలో ఈ ప్రాజెక్ట్ ను కేన్సిల్ చేసాడు నాగార్జున. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం హీరో అల్లరి నరేష్ ఈ సినిమాను దర్శకుడు ఇ.వి.వి. సత్తేబాబు దర్శకత్వంలో రీమేక్ చేద్దామని అనుకుంటున్నాడట. ఈ సినిమాకు ‘జంప్ జలాని’ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారట. అల్లారోడి తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ నాగార్జున తో తీసిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్. నరేష్ మొట్టమొదటి సారిగా కవలలు గా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నాడని తెలుస్తోంది. నాగార్జున కెరియర్ లో మాస్టర్ పీస్ గా మిగిలిపోయిన ‘హలో బ్రదర్’ ను సుడిగాడు అల్లరి నరేష్ రీమేక్ చేయడం సాహసం అంటూ అప్పుడే వార్తలు వచ్చేస్తున్నాయి. ఎదిఎమైనా నాగార్జున తన కొడుకు చైతు విషయంలో చేయలేని సాహసం మన అల్లరోడికి కలిసివస్తుందో లేదో చూడాలి..

Thursday, 24 October 2013

Pawan son Akira Dance Infront of pawan.flv


వావ్... ‘అత్తారింటికి దారేది’లో అదిరిపోయే కొత్త సీన్లు


ఇప్పటికే ప్రేక్షకుల మదిని దోచి అదిరిపోయే హిట్టు, కలెక్షన్లను కొల్లగొట్టిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో అదిరిపోయే కొత్త సీన్లను కొత్తగా జత చేసి ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఫిల్మ్ మేకర్లు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంచి కుటుంభకథా చిత్రంగా మార్కులు కొట్టేసిన ఈ సినిమాలో ఈ కొత్త సీన్లు మరింత పేరు తెచ్చిపెడుతుందంటున్నారు. ఈ సినిమా ఎడిటింగ్ సంధర్భంగా తొలగించిన కొన్ని సీన్లను జత చేయనున్నారు.

ఇవి కడుపుబ్బ నవ్వించే కామెడి సీన్లు, చక్కటి ఎంజాయ్ మెంట్ ను కలిగించే ఎంటర్ టైన్ మెంట్ సీన్లు అంటున్నారు. దీంతో ఇప్పటికే కలెక్షన్లలో టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానం కొట్టేసి దానిని ఎవరు చేరుకోరు అన్న సిచువేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇక ఎవరికి అందనంత రికార్డు కొట్టడం ఖాయం అంటున్నాయి సినిమావర్గాలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘అత్తారింటికి దారేది’ లో పవన్ హీరోగా అదరగొట్టగా, సమంత, ప్రణీతలు పవన్ కు మరదళ్లుగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. దేవిశ్రీ తన సంగీతంలో అందరిని తన్మయులను చేసారు. ఇక కామెడి, ఎంటర్ టైన్ మెంట్ తో మరింత రంజింప చేయనుంది ‘అత్తారింటికి దారేది’.

చంద్రబాబు కళ్లు తెరిపించిన పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తాడో రాడో అన్న విషయం పక్కన బెడితే కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు కళ్లు తెరిపించాడు అన్న వాఖ్యలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. చంద్రబాబు తాజాగా మార్చుకున్న స్టాండ్ ప్రకారం సీమాంద్రకే ప్రాధాన్యం ఇస్తున్నాడన్నది అందరికి తెలిసిందే. అక్కడ విజయం సాధించాలంటే ఏం చేయాలి, ఎవరిని దగ్గరికి తీయాలి అన్న విషయాన్ని పవన్ కళ్యాన్ తేటతెల్లం చేసాడట. వెంటనే ఆ దిశగా చంద్రబాబు కూడా పావులు కదపడం మొదలు పెట్టాడు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ టిడిపిలో చేరుతున్నాడన్న వార్తల పుకార్లకే వచ్చిన స్పందన తెలుగుదేశం అధినేతకు విజయం కోసం ఏం చేయాలో చెప్పేసిందట. సీమాంద్రలో మెజారిటి సంఖ్యలో ఉన్న కాపులు ఎంత కీలకమే దీంతో తెలిసి వచ్చిందంటున్నారు.

అంతే కాదు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపు వర్గం ఓటర్లు టిడిపికి దూరం కావడం వల్లే టిడిపి ఓటమి పాలయిందని చంద్రబాబు తన సన్నిహితులతో అన్నట్టు సమాచారం. అందుకే కాపులను తమవైపుకు మలచుకోవడంలో భాగంగానే ఆయన పవన్ కళ్యాణ్, నాగబాబులపై కన్నేసి వారిని లాగేందుకు వ్యూహం పన్నాడని భావిస్తున్నారు. అంతే కాదు వారికి పార్టీలో పెద్ద పీట వేసి, వారిని ప్రసన్నం చేసుకునే పనికి చంద్రబాబు అప్పుడే ఉపక్రమించాడు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇందులో భాగంగానే ఆగమేఘాల మీద తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు వర్గం నేత మెట్ల సత్యనారాయణను పార్టీ ఉపాధ్యక్షుడిగా తాజా నియమించాడంటున్నారు విశ్లేషకులు. అంటే చంద్రబాబు తాను కోల్పోయిందేమిటో తెలసుకుని అది పొందేందుకు ముందుకు పోతున్నాడన్న మాట. ఎంత వరకు విజయం సాధిస్తాడో వేచిచూడాలి అంటున్నాయి రాజకీయవర్గాలు.

Wednesday, 23 October 2013

కమెడియన్ పై కోట్ల పెట్టుబడి!


ఒకప్పుడు కథ, అది తీయాల్సిన విధానం, లొకేషన్లను బట్టి సినిమా బడ్జెట్ ని డిసైడ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఖర్చు పెట్టడం అనేది స్టేటస్ సింబల్ అయిపోయింది. పవన్ సినిమా అయితే ఇంత, మహేశ్ సినిమా అయితే కనీసం ఇంతుండాలి అంటూ ఎవరికి వారే లెక్కలు చెప్పేస్తున్నారు. అవసరం లేకపోయినా కోట్లు కుమ్మరించేస్తున్నారు. హీరోల సంగతి అలా ఉంచితే... ఓ కమెడియన్ మీద పాతిక కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు ఓ నిర్మాత. మరి దానికేమంటారు! కోలీవుడ్లో వడివేలు బిజీ కమెడియన్ అని మనకు తెలిసిందే. మన అలీ, సునీల్ లాంటి వాళ్లు హీరోలయినట్టే... వడివేలు కూడా హీరో వేషాలు వేశాడు. అతడు నటించిన హింసించే రాజు 23వ పులికేశి చిత్రం అయితే మంచి వసూళ్లు రాబట్టింది. అతణ్ని హిట్ హీరోని చేసింది. అతడు హీరోగా రాణించగలడన్న నమ్మకంతోనే ఇప్పుడు ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ వడివేలు హీరోగా పాతిక కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా తీస్తోంది. జగజ్జాల భుజబల తెనాలి రామన్ అనే ఆ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలుగా, తెనాలి రాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు వడివేలు. 23వ పులికేశిలో కూడా రెండు పాత్రలు చేశాడు. పిరికివాడు, మూర్ఖుడు అయినా రాజుగా... నిజాయతీ గల సామాన్య యువకుడిగా అదరగొట్టాడు. అందుకే ఇందులో కూడా రెండు పాత్రలూ ఆయన్నే చేయమన్నాం, ఆయన స్థాయికి తగిన సినిమా ఇది అంటున్నాడు దర్శకుడు యువరాజ్.

వాళ్ళిద్దరి పెళ్లికి రామానాయుడు అడ్డు


మూవీ మొఘల్ డాక్టర్ డి. రామానాయుడు కి పెద్ద కష్టం వచ్చి పడింది. అయన మనుమడు అయిన రాణా హీరోయిన్ త్రిష తో పీకల్లోతు ప్రేమలో ఉండటం. త్రిష - రాణాల పెళ్లి విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రతిసారి పెళ్లి విషయం రూమర్స్ వచ్చినప్పుడల్లా ఆమె అదేం లేదు....మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని వీరికి పరిపాటి అయ్యింది. అసలువాళ్ళకి పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్నదో లేదో తెలియదు కాని.... కోలీవుడ్ టాలీవుడ్ పరిశ్రమ జనాలు మాత్రం వీరి పెళ్లికి సంబందించిన పుకార్లకు మాత్రం ఫుల్ స్టాప్ మాత్రం పెట్టడం లేదు. తాజాగా వస్తున్న పుకారు ప్రకారం త్రిష తన ఇంట్లో రాణా గురించి చెప్పినట్లు తెలుస్తుంది.

అయితే రాణాతో పెళ్ళికి వాళ్ళ తాత రామానాయుడు ఒప్పుకుంటారా అనే సందేహాన్ని త్రిష తల్లి వేలబుచ్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు. వీల్లిదరి పెళ్లి రామానాయుడు అడ్డుపడుతున్నడనే వార్త ఫిలింనగర్ చక్కర్లు కొడుతుంది. తనతో పెళ్లికి వాళ్ళ తాతని ఒప్పించే బాధ్యత రాణాదే అని త్రిష తల్లితో చెప్పినట్లు చెన్నై మీడియా కోడై కుస్తుంది. వీటన్నింటిని చూసి రామానాయుడు గారు ఏమంటారో చూడాలి మరి! ఏ తాత అయిన తన మనుమడికి గొప్పింటి సంభంధం చెయ్యాలని చూస్తారుగా...మరి రాణా తన తాత కి ఆ అవకాసం ఇస్తాడో లేదో చూడాలి.

సంక్రాంతి బరిలో నితిన్ ‘హార్ట్‌ఎటాక్‌’


పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘హార్ట్‌ఎటాక్‌’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే . ప్రస్తుతం స్పెయిన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం చాలా వేగవంతంగా షూటింగ్ జరుపుతున్నారు. నితిన్ చిత్రం విడుదల పై ట్వీట్ చేస్తూ…”నా ‘హార్ట్‌ఎటాక్‌’ చిత్రం పూర్తి ప్రేమ కధా చిత్రం. సంక్రాంతికి విడుదల అవుతుంది” అంటూ నితిన్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

 ఈ చిత్రం లో నితిన్ కి జోడిగా ఆదా శర్మ హీరోయిన్ . పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్ అయిన ‘వైష్ణో అకాడమీ’ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అనుప్ రుబిన్స్ సంగీతం వహేస్తున్నాడు.

డిసెంబర్ నుండి 'గబ్బర్ సింగ్-2'


‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర జయభేరి మోగించడంతో ఎక్కడ చూసినా పవన్‌కల్యాణ్ నామజపమే. ప్రస్తుతం ఆయనేం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషన్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఆయన ఇవేవీ పట్టించుకోకుండా ‘గబ్బర్ సింగ్-2' ని తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 2న ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుందని సమాచారం. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడం ఆలస్యం అవుతూ వచ్చింది.

 ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడందుకుంది. దర్శకుడు సంపత్‌నందితో పాటు ప్రతిభావంతులైన రచయితల బృందం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అహర్నిశలూ శ్రమిస్తున్నారు. పవన్‌కల్యాణ్ దగ్గరుండి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 2 నాటికి ఈ సినిమా సెట్స్‌కు వెళ్లాలనే కసితో పనిచేస్తున్నారట. బాలీవుడ్ ‘దబాంగ్’కి రీమేక్ ‘గబ్బర్‌సింగ్’. అయితే... ‘గబ్బర్‌సింగ్-2’ మాత్రం ‘దబాంగ్-2’కు రీమేక్ కాదు. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఇందులో పవర్‌స్టార్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు పనిచేసే కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.