Thursday, 24 October 2013

చంద్రబాబు కళ్లు తెరిపించిన పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తాడో రాడో అన్న విషయం పక్కన బెడితే కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు కళ్లు తెరిపించాడు అన్న వాఖ్యలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. చంద్రబాబు తాజాగా మార్చుకున్న స్టాండ్ ప్రకారం సీమాంద్రకే ప్రాధాన్యం ఇస్తున్నాడన్నది అందరికి తెలిసిందే. అక్కడ విజయం సాధించాలంటే ఏం చేయాలి, ఎవరిని దగ్గరికి తీయాలి అన్న విషయాన్ని పవన్ కళ్యాన్ తేటతెల్లం చేసాడట. వెంటనే ఆ దిశగా చంద్రబాబు కూడా పావులు కదపడం మొదలు పెట్టాడు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ టిడిపిలో చేరుతున్నాడన్న వార్తల పుకార్లకే వచ్చిన స్పందన తెలుగుదేశం అధినేతకు విజయం కోసం ఏం చేయాలో చెప్పేసిందట. సీమాంద్రలో మెజారిటి సంఖ్యలో ఉన్న కాపులు ఎంత కీలకమే దీంతో తెలిసి వచ్చిందంటున్నారు.

అంతే కాదు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపు వర్గం ఓటర్లు టిడిపికి దూరం కావడం వల్లే టిడిపి ఓటమి పాలయిందని చంద్రబాబు తన సన్నిహితులతో అన్నట్టు సమాచారం. అందుకే కాపులను తమవైపుకు మలచుకోవడంలో భాగంగానే ఆయన పవన్ కళ్యాణ్, నాగబాబులపై కన్నేసి వారిని లాగేందుకు వ్యూహం పన్నాడని భావిస్తున్నారు. అంతే కాదు వారికి పార్టీలో పెద్ద పీట వేసి, వారిని ప్రసన్నం చేసుకునే పనికి చంద్రబాబు అప్పుడే ఉపక్రమించాడు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇందులో భాగంగానే ఆగమేఘాల మీద తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు వర్గం నేత మెట్ల సత్యనారాయణను పార్టీ ఉపాధ్యక్షుడిగా తాజా నియమించాడంటున్నారు విశ్లేషకులు. అంటే చంద్రబాబు తాను కోల్పోయిందేమిటో తెలసుకుని అది పొందేందుకు ముందుకు పోతున్నాడన్న మాట. ఎంత వరకు విజయం సాధిస్తాడో వేచిచూడాలి అంటున్నాయి రాజకీయవర్గాలు.

No comments:

Post a Comment