Wednesday, 23 October 2013

డిసెంబర్ నుండి 'గబ్బర్ సింగ్-2'


‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర జయభేరి మోగించడంతో ఎక్కడ చూసినా పవన్‌కల్యాణ్ నామజపమే. ప్రస్తుతం ఆయనేం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషన్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఆయన ఇవేవీ పట్టించుకోకుండా ‘గబ్బర్ సింగ్-2' ని తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 2న ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుందని సమాచారం. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడం ఆలస్యం అవుతూ వచ్చింది.

 ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడందుకుంది. దర్శకుడు సంపత్‌నందితో పాటు ప్రతిభావంతులైన రచయితల బృందం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అహర్నిశలూ శ్రమిస్తున్నారు. పవన్‌కల్యాణ్ దగ్గరుండి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 2 నాటికి ఈ సినిమా సెట్స్‌కు వెళ్లాలనే కసితో పనిచేస్తున్నారట. బాలీవుడ్ ‘దబాంగ్’కి రీమేక్ ‘గబ్బర్‌సింగ్’. అయితే... ‘గబ్బర్‌సింగ్-2’ మాత్రం ‘దబాంగ్-2’కు రీమేక్ కాదు. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఇందులో పవర్‌స్టార్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు పనిచేసే కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment