పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘హార్ట్ఎటాక్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే . ప్రస్తుతం స్పెయిన్లో చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం చాలా వేగవంతంగా షూటింగ్ జరుపుతున్నారు. నితిన్ చిత్రం విడుదల పై ట్వీట్ చేస్తూ…”నా ‘హార్ట్ఎటాక్’ చిత్రం పూర్తి ప్రేమ కధా చిత్రం. సంక్రాంతికి విడుదల అవుతుంది” అంటూ నితిన్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.ఈ చిత్రం లో నితిన్ కి జోడిగా ఆదా శర్మ హీరోయిన్ . పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్ అయిన ‘వైష్ణో అకాడమీ’ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అనుప్ రుబిన్స్ సంగీతం వహేస్తున్నాడు.
No comments:
Post a Comment