Thursday, 10 October 2013

జగన్ వ్యాన్ లో ఏం చేస్తాడు..?


ఐదు రోజులు దీక్ష చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి..తన చిత్రమైన మేనరిజమ్స్ ను ప్రదర్శించారు. దీక్ష చివరి రెండు రోజులైతేమరీనూ. కాసేపటికి ఓసారి దీక్షా స్థలికి దగ్గర్లో ఉన్న వ్యాన్ లోకివెళ్లటం అరగంట నుంచి గంట సేపు అందులో గడపటం తర్వాత బయటకు రావటం చేశారు.

 ఎందుకిలా అన్నది పార్టీ నేతల నుంచి.. మీడియా వర్గాలకు పాలుపోలేదు. ఏమైనాఆరోగ్యసమస్యలా అంటే.. అదీ లేదు. ఆహారం లేకపోవటం వల్ల కాస్తంత నీరసంతప్పించి మరెటువంటి ఇబ్బంది లేదు. జగన్నుచూసేందుకజనసమూహం వస్తుంటే.. ఆయన గారు మాత్రం బస్సులో ఉండటం అభిమానులకు.. నాయకులకు అసంతృప్తినికలిగించింది.

 దీక్ష ద్వారా వీలైనంత పొలిటికల్ మైలేజీ కోసం తపించాల్సిన అధినేత.. అలా షూటింగ్లో హీరోలు.. హీరోయిన్లు షాట్ కి..షాట్ కి వచ్చే కొద్దిపాటి గ్యాప్ లోనూ బస్సులోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. మరి.. జగన్ కు ఏ అవసరం వచ్చి అలా వెళ్లారా అన్న దానిపై కొంతమంది పార్టీ నేతలు ఉత్సాహం తట్టుకోలేక.. ఆ దిశగా దృష్టి సారించారు. విషయం అర్థమయ్యాక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.. ఏం ఫర్లేదు.. మరో వారం రోజులు దీక్ష గ్యారెంటీ అంటూ గుసగుసలాడుకోవటం కనిపించింది. బస్సులో ఏమైనా శక్తినిచ్చే రహస్యం ఉందా అంటూ పార్టీ నేతలతో కాస్త క్లోజ్ గా ఉండే రిపోర్టర్లు ప్రశ్నిస్తే.. ప్రతి విషయంలోనూ రంధ్రాన్వేషణ తప్పించి మరేం ఉందా? అంటూ అసహనం ప్రదర్శించారు. అప్పటికీ వదలకుండా.. అడగ్గా.. అడగ్గా.. ‘‘సార్ ఆసనాలు వేస్తున్నారు’’ అంటూ చెప్పారు.

 ఎందుకలా అంటే.. రోజుల తరబడి ఏమీ తీసుకోకుండా ఉంటే నీరసించిపోతారు కదా. అలా కాకుండా.. వీలైనంతగా హుషారు ఉండే ప్రయత్నం కోసమే ఈ తాపత్రయం అని చెబుతూ.. నా నోటి నుంచి ఇంకే చెప్పించొద్దు మహాప్రభూ అంటూ అక్కడి నుంచి మాయమయ్యారు. సరే.. ఆ అసనాలు ఏంటో తెలుసుకుందామని ఓ ఔత్సాహిక జర్నలిస్టు ఓ కన్ను వేస్తే.. రహస్యం అర్థమైంది. శక్తినిచ్చి.. మరింతకాలం దీక్ష చేసే సామర్థ్యానిచ్చే ప్లూయిడ్స్ ఇస్తున్నట్లు అర్థమై వాక్కయ్యాడు. అంటే.. జగనన్న చేసేది ఆమరణ నిరాహారదీక్ష కాదు.. రిలే నిరాహార దీక్షలన్న మాట అంటూ మరో రిపోర్టర్ కామెంట్ చేయబోతే.. ఇక్కడికి వచ్చింది వార్త కవర్ చేయటానికే అంటూ లాక్కెళ్లిపోవటం కనిపించింది.

No comments:

Post a Comment