హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి ఈ రోజు 40వ వసంతంలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆయన పుట్టిరోజున సంతోషంగా లేరు. కారణం ప్రముఖ నటుడు శ్రీహరి మరణించడమే. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞత తెలిపిన రాజమౌళి తాను సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు. మగధీర చిత్రంలో శ్రీహరి ఎంతో గొప్పగా నటించారు. ఆయన ఇక లేరనే విషయం తెలుసుకుని షాకయ్యాను. ఆయన చాలా సున్నిత మనస్కులు. ఏదైనా సింపుల్ సెంటిమెంటు సీన్ చెప్పినా వెంటనే ఆయన కళ్ల వెంట నీళ్లు వస్తాయి. ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నానను. ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీర్చలేనిది అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
Thursday, 10 October 2013
శ్రీహరి ఏడ్చేస్తారు, నాకు సంతోషం లేదు: రాజమౌళి
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి ఈ రోజు 40వ వసంతంలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆయన పుట్టిరోజున సంతోషంగా లేరు. కారణం ప్రముఖ నటుడు శ్రీహరి మరణించడమే. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞత తెలిపిన రాజమౌళి తాను సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు. మగధీర చిత్రంలో శ్రీహరి ఎంతో గొప్పగా నటించారు. ఆయన ఇక లేరనే విషయం తెలుసుకుని షాకయ్యాను. ఆయన చాలా సున్నిత మనస్కులు. ఏదైనా సింపుల్ సెంటిమెంటు సీన్ చెప్పినా వెంటనే ఆయన కళ్ల వెంట నీళ్లు వస్తాయి. ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నానను. ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీర్చలేనిది అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment