Thursday, 10 October 2013

వర్మ పబ్లిసిటీ స్టంట్!


దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. తనకు నచ్చినట్లు సినిమాలు తీస్తుంటాను... చూసేవాళ్లు చూస్తారంటూ... స్టేట్‌మెంట్‌ ఇచ్చేవాడు. తర్వాత మళ్ళీ మామూలే... తాజాగా ఆయన సత్య`2 చిత్రాన్ని తీశాడు. ఇది అండర్‌వరల్డ్‌ నేపథ్యంలోనిదే... ఇకపై ఇలాంటి సినిమాల జోలికి వెళ్ళనని స్టేట్‌మెంట్‌ ఇస్తున్నాడు. అంటే.... ఇదేమైనా.... పబ్లిసిటీస్టంటా?అనే అనుమానం ఫిలింనగర్‌లో విన్పిస్తోంది. ఈ చిత్రంపై ఏ డిస్ట్రిబ్యూటర్‌ ఆసక్తిచూకపోవడం ప్రధానకారణం. వర్మ గతంలో సర్కార్‌, కంపెనీ సత్య వంటి చిత్రాలు తీశాడు. రక్తచరిత్ర తీశాడు. ఏ సినిమా తీసినా ఫార్మెట్‌ ఒక్కటే... సత్య`2లోకూడా అదే ఫార్మెట్‌ .. ఆర్టిస్టులు వేరు... ఈ సినిమా ఆడియో తర్వాత ఏమంత ఇంట్రస్ట్‌ ఇండస్ట్రీలోలేకపోయింది. ఈ చిత్రం తర్వాత మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సినిమా చేస్తానని ప్రకటించాడు.

No comments:

Post a Comment