Thursday, 10 October 2013

చెట్టాపట్టాలేసుకున్నారు!


హీరోహీరోయిన్లు సినిమాల్లోకంటే బయట చెట్టాపట్టాలేసుకుని తిరిగితే..పెద్ద చిక్కే.. ఎంత ఫ్రెండ్‌ అని చెప్పినా.. వారిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వస్తూనేంటాయి. కానీ అవే నిజంచేస్తూన్న సంఘటనలు కొంతమందిలో కన్పిస్తుంది. సమంత, సిద్దార్థల సంగతి తెలియది కాదు. వీరిద్దరు ప్రేమజంటగా పేరుపొందేశారు. అప్పట్లో శ్రీకాళహస్తిలో పూజలు కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలమధ్య మంచి సంబంధాలూ ఉన్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఫుడ్‌ఫర్‌ చేంజ్‌ అనే సేవా కార్యక్రమానికి కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే సమంత.... నచ్చినవారితో మాట్లాడకపోతే ఏదోగా ఉంటుందని ట్విట్టర్‌లో పోస్ట్‌కూడా చేసింది. అది సిద్దార్త్‌ గురించే అన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు వీరిద్దరు సామాజిక సేవలో భాగంగా... కొద్దికాలం కలిసి బయట తిరుగుతారు. ఏదో ఒక పేరుతో బయటకు రావడం అనేది లాజిక్కుగా కన్పిస్తుంది సిద్దార్థ్‌ సన్నిహితులే వ్యాఖ్యానించడం విశేషం.

No comments:

Post a Comment