








నయనతార-ఆర్య జంటగా నటించిన తమిళ చిత్రం ‘రాజా రాణి' చిత్రం సక్సెస్ కావడంతో నయనతార, ఇరత యూనిట్ సభ్యులంతా కలిసి సంతోషంగా సక్సెస్ పార్టీ చేసుకున్నారు. చాలా కాలం తర్వాత తాను తమిళంలో నటించిన తొలి సినిమా విజయవంతం కావడంతో నయనతార ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి నయనతార చిట్టిపొట్టి డ్రెస్సులో సెక్సీలుక్‌లో దర్శనం ఇచ్చింది. ఈ సందర్భంగా నయనతారతో కేక్ కట్ చేయించి సక్సెస్ పార్టీ ప్రారంభించారు. జీవా, శింబు, జయం రవి, ఆయన వైప్ ఆరతి, శ్యామ్, శంతను, ఉదయనిధి స్టాలిన్, శ్రీకాంత్ స్వరూప్ రెడ్డి, నిర్మాతలు సివి కుమార్, జ్ఞానవేల్ రాజా, లిసీ ప్రియదర్శన్ తదితరులు రావడంతో పార్టీ కలర్ ఫుల్‌గా మారింది. దర్శకుడు కార్తికా ఉదయనిధి, రమ్యా క్రిష్ణన్, కార్తీక, ఆండ్రియా, సోనియా అగర్వాల్ తదితరులు ‘రాజా రాణి' సినిమా యూనిట్ సభ్యులను అభినందించారు. చిత్ర దర్శకుడు అట్లీ కుమార్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్, డైరెక్టర్ ఆప్ ఫోటోగ్రఫీ జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్ రేబెన్, నిర్మాతలు ఏఆర్ మురుగదాస్, షన్ముగ సుందరమ్ తదితరులు సక్సెస్ పార్టీని ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. చిత్రానికి పని చేసిన టెక్నీషియన్స్‌కు గోల్డ్ చైన్ బహుమతిగా ఇచ్చారు.






