Saturday, 5 October 2013

పవన్ కు నో చెప్పిన టాప్ హీరో ..!



రాజకీయ ఉద్యమాలను సహితం ఎదిరించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటుతూ 2013 బ్లాక్ బస్టర్ గా రికార్డుకేక్కిన పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమానుకోలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఒక ప్రముఖ తమిళ నిర్మాత హీరో విజయ్ ను ఈ సినిమాను చూడమనికోరాడట. స్వతహాగా పవన్ అభిమాని అయిన హీరో విజయ్ ఈ సినిమాను చూసి పవన్ అద్భుత నటనకు ఫిదా అయిపోయాడట. ఈ సినిమాను చూసిన వెంటనే విజయ్ పవన్ కు ఫోన్ చేసి అభినందించడంమే కాకుండా ఆ ప్రముఖ నిర్మాతను పిలిపించి పవన్ అత్తారిల్లు సినిమా కోలీవుడ్ లో రీమేక్ చేయాలనే ఆలోచన పూర్తిగా మరిచిపోమనీ చెప్పాడట.

దానికి షాక్ అయిన ఆ కోలీవుడ్ నిర్మాత ‘అత్తారిల్లు’ నచ్చలేదా అని అడిగితే నచ్చకపోవడం కాదు ఆ సినిమాలోని పవన్ చేసిన పాత్రను మరెవ్వరూ ఆ విధంగా చేయలేరని ఆ స్థాయి ఉన్న హీరోలు దక్షణాది సినిమా రంగంలో ప్రస్తుతం ఎవ్వరూ లేరనీ అంటూ తాను కూడా ఆ పాత్రకు సరిపోననీ తమిళ ప్రజల చేత ఇళయ దళపతి గా పిలిపించుకునే హీరో విజయ్ అన్నాడట. గతంలో అనేక సూపర్ హిట్ తెలుగు సినిమాలు ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘తమ్ముడు’, ‘నువ్వు నాకు నచ్చావు’ లాంటి సినిమాలను కోలీవుడ్ లో రీమేక్ చేయించి సూపర్ హిట్లు అందుకున్న విజయ్ లాంటి కోలీవుడ్ సూపర్ స్టార్ కూడా ‘అత్తారింటి’ రీమేక్ కు నో చెప్పాడు అంటే పవన్ కళ్యాణ్ ‘ఆతరిల్లు’లో నటించిన నటన పవన్ అభిమానులకే కాదు టాప్ హీరోలకు కూడా ఎంతబాగా నచ్చిందో అర్ధం అవుతుంది..

హాస్పిట‌ల్‌లోనే ఎఫైర్ న‌డిపారు


సెల‌బ్రిటీల ఎఫైర్‌లు ఇంత ధారుణంగా తెగించాయా అంటే కాద‌లేని ప‌రిస్థితిలా మారింది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్‌సింగ్, డెంగ్యూతో బాధ‌ప‌డుతూ హాస్పిట‌ల్ బెడ్ ఎక్కాడు. ర‌ణ్‌వీర్‌సింగ్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ రామ్‌లీలా మూవీ వెస్ట్‌బెంగాళ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. షూటింగ్‌ మ‌ధ్యలోనే హీరో ర‌ణ్‌వీర్‌సింగ్ డెంగ్యూ భారిన ప‌డ్డాడు. వెంట‌నే చిత్ర యూనిట్ ర‌ణ్‌వీర్‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించింది. దాదాపు నాలుగు రోజులు హాస్పిట‌ల్‌లోనే ట్రీట్‌మెంట్ తీసుకొని, క్యూర్ అయ్యాడు. అయితే డాక్టర్లు మాత్రం ఇంకో ప‌దిహేను రోజుల వ‌ర‌కూ పూర్తి విశ్రాంతి కావాల‌ని హీరోకు సూచించారు.

 రామ్‌లీలా మూవీలో ర‌ణ్‌వీర్‌సింగ్ స‌ర‌స‌న హీరోయిన్ దీపికాప‌దుకొనె న‌టిస్తుంది. హీరో హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యాడ‌ని తెలుసుకొని, ప్రతి రోజు రాత్రిళ్ళ స‌మ‌యంలో హీరోను చూసుకోవడానికి హాస్పిట‌ల్‌కి వెళ్ళేద‌ట‌. ర‌ణ్‌వీర్‌సింగ్‌,దీపికాపుద‌కొనె ఇద్దరూ రాత్రి స‌మ‌యంలో చాలా సేపు క‌బుర్లు చెప్పుకుంటున్నార‌ని బాలీవుడ్ చెబుతుంది. ఒక్కోసారి రాత్రి ఎనిమిది గంట‌ల‌కు హాస్పిట‌ల్‌కి వెళ్ళిన దీపికా, ఉద‌యం ముడు,నాలుగు గంట‌ల వ‌ర‌కూ బ‌య‌ట‌కు వ‌చ్చేది కాదంట‌. జ‌స్ట్ ప‌ల‌క‌రించ‌టానికి అని వ‌చ్చిన దీపికా, అంత స‌మ‌యం వ‌ర‌కూ ఇద్దరూ ఏకాంతంగా ఏం మాట్లాడుకుంటారు అని బి-టౌన్‌లో బాహాటంగానే వినిపిస్తుంది. వీళ్ళు ఇదే సాకుతో హాస్పిట‌ల్‌లోనే రొమాన్స్ చేశార‌ని కూడ కొంద‌రు చెబుతున్నారు. ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందోలేదో తెలియ‌దు కాని, వీరిద్దరూ మాత్రం ప్రతి రోజు ప‌ర్సన‌ల్‌గా క‌లుసుకోవ‌డం మాత్రం జ‌రుగుతుంది.

తిరుమలపై దాడికి ప్లాన్..?


తిరుమల కొండపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఈ ఉగ్రవాదులు ప్లాన్ గీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీవారి గరుడోత్సవానికి చెన్నై నుంచి వచ్చే గొడుగుల్లో బాంబులు అమర్చేందుకు వీరు కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. ఆలయంలోని పూజారి సాయంతో బాంబు అమర్చేందుకు తీవ్రవాదులు పన్నాగం పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విధ్వంసం కోసం 6 నెలల క్రితమే పుత్తూరులో ఉగ్రవాదులు స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారం పేరుతో ఇక్కడికి చేరుకుని.. బాంబులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని తిరువళ్లూరులో పట్టుబడిన తీవ్రవాది నుంచి కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం.

విభజన పెద్ద మనుషులు వీళ్లే..!


ఒకవైపు రాష్ట్ర విభజన గురించి సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు చెలరేగుతున్నా.. విభజన విషయంలో కేంద్రప్రభుత్వం వడివడిగా ముందుకెళ్తోంది. తెలంగాణ వాదుల కోరికలను నెరవేర్చేదిశగా దూసుకెళ్తోంది. విభజన నోట్ కు క్యాబినెట్ ఓకే చెప్పాకా.. రాష్ట్రాన్ని విడదీయడానికి, ఆస్తుల, అప్పుల పంపకానికి ఒక కమిటీ రెడీ అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ విభజనకు వీరిని పెద్దమనుషులుగా చెప్పవచ్చు. ఈ కమిటీలో కాంగ్రెస్ నేతలు, కేంద్రమంత్రులున్నారు. నారాయణస్వామి, ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌, కమల్‌నాథ్‌, కపిల్‌ సిబాల్‌, చిదంబరం, పల్లంరాజు, వీరప్ప మెయిలీ, సుశీల్‌కుమార్‌ షిండే, జ్యోతిరాధిత్య సింధియా, ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షులు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

 ఈ కమిటీకి ఉన్నతస్థాయి అధికారాలు ఉంటాయి. ఇది తెలంగాణా రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సరిహద్దులను నిర్ణయిస్తుంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా కార్యకలాపాలను నిర్వహించుకునేవిధంగా చట్టపరమైన, పరిపాలనపరమైన చర్యలపై అధ్యయనం చేస్తుం ది. తెలంగాణా ఏర్పడగా మిగిలే ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానికి మారడానికి అవసరమైన చట్టపరమైన, ఆర్థిక, పరిపాలన పరమైన చర్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇరు రాష్ట్రాలకు ఉండే ఇతర ప్రత్యేక అవసరాలను కూడా పరిశీలించి, తగిన చర్యలను సిఫారసు చేస్తుందట ఈ కమిటీ.

శృతిహాస‌న్‌ని లైన్లో పెట్టిన ఘ‌నుడు


టాలీవుడ్ ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న హ‌రీష్‌శంక‌ర్‌కి ఏ హీరో అయినా కాల్షీట్లు ఇట్టే ఇచ్చేస్తాడు. ఎందుకంటే హ‌రీష్ చెప్పే స్టోరీల‌కు ఏ హీరో అయినా ఇంప్రెస్ అవ్వాల్సిందే. ఒక హీరోను ఏవిధంగా, ఏ యాంగిల్‌లో పొగ‌డాల‌లో అనేది హ‌రీష్ శంక‌ర్‌కు తెలిసినంత‌గా ఎవ‌రికి తెలియ‌క‌పోవ‌చ్చు అని టాలీవుడ్ అంటుంది. ఒక‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణే ఎవ‌రెస్ట్ శిఖ‌రం అన్న హ‌రీష్‌, రీసెంట్‌గా జ‌రిగిన రామ‌య్యవ‌స్తావ‌య్యా ఆడియో ఫంక్షన్‌లో ఎన్టీఆర్ లాంటి వాడు మ‌రొక‌రు ఉండ‌రు అంటూనే త‌న మాట‌ల చాతుర్యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. ఇదిలా ఉంటే హ‌రీష్‌శంక‌ర్‌కు ఓ క్రేజీ హీరోయిన్ బాగా క‌నెక్ట్ అయింద‌ని అంటున్నారు.

 గ‌బ్బర్‌సింగ్‌తో ఫాంలోకి వ‌చ్చిన శృతిహాస‌న్‌కి డైరెక్టర్ హ‌రీష్‌శంక‌ర్ అంటే విప‌రీత‌మైన అభిమానం అంట‌. హ‌రీష్ శంక‌ర్ ఏమ‌డిగా నో చెప్పలేని ప‌రిస్థితుల్లో శృతిహాస‌న్ ఉంది. రామ‌య్యవ‌స్తావ‌య్య మూవీలో శృతిహాస‌న్ మొద‌ట న‌టించ‌డానికి నో చెప్పి, త‌రువాత హ‌రీష్‌శంక‌ర్ న‌టించాల్సిందే అని డిమాండ్ చేయ‌డంతో కాద‌ల‌నేక‌పోయింద‌ట‌. అందుకే శృతిహాస‌న్ మీద టాలీవుడ్‌లో ఎటువంటి కామెంట్స్ వ‌చ్చినా, మొద‌టగా రెస్పాండ్ అయ్యే మొద‌టి వ్యక్తి హ‌రీష్ అంటున్నారు. రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీలో శృతిహాస‌న్ నెగిటివ్ రోల్ చేస్తుంద‌ని టాక్ వచ్చిన వెంట‌నే, దానికి సంబంధించిన క్లారిటి ఇస్తూ 'శృతిహాస‌న్ ఎటువంటి నెగిటివ్ రోల్స్ చేయ‌డంలేదు' అని ఆమెను వెన‌కేసుకొని వ‌చ్చాడు. అంతే కాకుండా హ‌రీష్ శంక‌ర్ అప్‌క‌మింగ్ ఫిల్మ్‌లో ఈసారి శృతిహాస‌న్ హీరోయిన్‌గా ఉంటుంద‌ని టాలీవుడ్ టాక్‌.

జూనియర్ ఎన్టీఆర్ జుట్టుపీక్కుంటున్నాడు


బాద్ షా ను నేనంటూ మీసం మెలేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇప్పుడు జుట్టుపీక్కుంటున్నాడు అన్న గుసగుసలు టాలీవుడ్ లో మొదలయ్యాయి. కారణం రాష్ట్రంలో రాజకీయాలు ఆయనకు మరింత ఇబ్బందికరంగా తయారయ్యాయి అంటున్నారు. తెలంగాణ నోట్ ను క్యాబినెట్ ఆమోదించడం, ఆయన తండ్రి హరిక్రిష్ణ మొహం చాటేయడం ఈ పరిస్థితులకు కారణం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నోట్ ఆమోదంతో సీమాంద్రలో అల్లర్లు బాగా ముదిరిపోయాయి, జై సమైక్యాంధ్ర అంటూ హరిక్రిష్ణ తన రాజీనామాతో తొడగొట్టడంతో ఆయన కొడుకు జూనియర్ పరిస్థితి తెలంగాణలో వాచిపోయింది. ఎన్టీఆర్ సినిమాలు ఆడనియ్యం అంటూ తెలంగాణ వాదులంతా కుండబద్దలు కొట్టి చెప్పారు. సరే కలెక్షన్లు ఎక్కువ వచ్చే సీమాంధ్రలో పరిస్థితి మెరుగయింది, ఓ చోట కాకున్నా మరో చోట తన సినిమాలు ఆడుతాయి అని సంబరపడ్డాడు జూనియర్.


అయితే హరిక్రిష్ణ తొడగొట్టి తన బావ చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించగానే వెనుకడుగువేసాడు. బావ కోసమే ఆయన ఆ పనిచేసాడు అన్న ప్రచారం సీమాంద్రలో జరిగింది, పోని చంద్రబాబు సీమాంద్రవైపుకు వన్ సైడ్ అయితే ఇబ్బంది ఉండేది కాదు, అలా కాక చంద్రబాబు అటూఇటూ కాకుండా వ్యవహరించడంతో ఆయనపై ఇప్పడు సీమాంద్ర అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. మరో వైపు సమైక్యాంద్ర అంటూ ప్రగల్బాలు పలికిన హరిక్రిష్ణ ఏకంగా కనపడకుండానే దాక్కోవడంతో ఆయన తీరుపై కూడా సీమాంద్రలో జనం గుర్రు మీదున్నారు. దీంతో ఈ నెల 10న వస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా పరిస్థితి ఏంటని జుట్టుపీక్కుంటున్నాడు అంటున్నారు టాలీవుడ్ లో.

ముగిసిన‌ పూత్తూరు ఉగ్రవాద ఆప‌రేష‌న్


పుత్తూరులో ఉగ్రవాదుల కోసం ఆక్టోపస్ రెస్క్యూ టీం సాగించిన వేట ముగిసింది.. ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను ఆక్టోపస్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. వీరిద్దరినీ మున్నా, బిలాల్ గా గుర్తించారు.

 ఎం జరిగింది ? పుత్తూరులోని ఓ ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారని తమిళనాడులో అరెస్టయిన ఓ ఉగ్రవాది అందించిన సమాచారంతో తమిళనాడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులు ఉన్న ఇంటిని గుర్తించిన పోలీసులు.. తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఇంటి వెనుక భాగం నుంచి దాడికి యత్నించారు. వారిని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో, సిఐ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరోవైపు పోలీసులు, ఉగ్రవాదుల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. కాల్పులు కొనసాగిస్తే.. తాము ఉన్న ఇంటిని బాంబులతో పేల్చేస్తామని టెర్రరిస్టులు హెచ్చరించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

 క్షణ క్షణం..

 ఉగ్రవాదులు తాము తలదాచుకున్న ఇంటిని సిలిండర్ తో పేల్చేస్తామని, ఇంకా నాలుగైదు ప్రాంతాల్లో బాబులు పెట్టామని చెప్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. స‌మాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ ప్రసాదరావు పరిస్థితిని సమీక్షించి, ఆక్టోపస్ టీంను రంగంలోకి దించారు. 'ఆక్టోపస్' ఆపరేషన్ రంగంలోకి దిగిన ఆక్టోపస్ టీం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. ఉగ్రవాదులున్న ఇంట్లోకి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అనంతరం.. ఇంటిలో ఉన్న ఒక మహిళతో పాటు ముగ్గురు పిల్లలలను సురక్షితంగా రక్షించి 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో ముగ్గురు ఎస్పీలు పరిస్థితిని సమీక్షిస్తూ ఆపరేషన్ పక్కాగా కొనసాగించారు. ఓవైపు కాల్పులు కొనసాగిస్తూనే.. మరోవైపు ఇంటి వెనక నుంచి గోడకు రంధ్రాలు చేసి, ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. గాయపడ్డ ఉగ్రవాదులు లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.

బొత్స రాజకీయం బద్దలయింది



పిసిసి అద్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్స రాజకీయం బద్దలయింది, ఇక ఆయనే కాదు, ఇన్నాళ్లు విజయనగరం జిల్లా రాజకీయాల్ని గుప్పిట్లో పెట్టుకున్న ఆయన బార్య, తమ్ముడు, బందువులు ఇలా అందరి బతుకులు బండబారినట్టే అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ నోట్ ను క్యాబినెట్ ను ఆమోదించాక కూడా ఆయన అధిష్టానం నిర్ణయాన్ని సమర్థిస్తున్నాని, వ్యక్తిగతంగా నేను బాధపడుతున్నానని పేర్కొనడంతో ఆయనతో పాటు ఆయన కుటుంబ రాజకీయాలను బద్దలు చేసాయన్న భావమే సర్వత్రా వ్యక్తమవుతోంది.

కారణం నిన్నటి నుంచి బొత్సపై ఆయన జిల్లా వాసులు జరుపుతున్న దాడులే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఆయన ఆస్థులను ధ్వంసం చేస్తున్నారు, ఇంత ఆగ్రహం ఉన్నప్పుడు సంయమనంతో ఉండాల్సిన బొత్స అదేమి చేయకుండా పైకి ఓ మాట మాట్లాడి లోపాయికారిగా తన అనుచరులను, పోలీసులను ఉసిగొల్పడంతో పరిస్థితి భయంకరంగా మారి ఇక జిల్లాలో ఆయన బతుకును భారం చేసిందన్న వాదన వినిపిస్తోంది.

ఆయన సత్య కేబుల్ ఆఫీసుపై దాడి సంఘటనలో ముగ్గురు విధ్యార్థులను బొత్స అనుచరులు బందించి దారుణంగా చితకబాదారట, వీరి పరిస్థితి ఇప్పుడు సీరియస్ గా ఉండడంతో విజయనగరంలో విద్యార్థులు తిరుగుబాటు చేసారు. దీంతో రెండవ రోజు కూడా ఆయన ఇంటిని చుట్టుముట్టారు. భారి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా పోలీసులపై సైతం రాళ్లతో దాడులు చేసే పరిస్థితి వచ్చింది. అంటే బొత్సపై ఎంతటి ఆగ్రహం జిల్లా వాసుల్లో నెలకొందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన రాజకీయ జీవితం ఇక ముగిసినట్టే అన్న భావం అందరిలో కలిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.