పవన్ కళ్యాణ్ సమంత ముద్దుపెట్టుకుంది, ఇది చూసిన డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా వారెవ్వా.. అంటూ సమంత ఇంప్రూవ్ మెంట్ ను మెచ్చుకున్నాడట. పోని ఇది సినిమాల్లో పెట్టుకునే ఉత్తుత్తి ముద్దు కాదట, సమంత నిజంగా పవన్ చెంపలను తన పెదాలతో ముద్దాడేసింది.
అయితే ఇది రియలో లైఫ్ లోనిది కాదు, సినిమా లోనిదే, అయినా నిజమైన ముద్దుపెట్టుకోవడమే హైలెట్ అయిందంటున్నారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సెకండ్ హాఫ్ లో సమంత పవన్ కళ్యాన్ చెంతకు చేని బావా అంటూ ముద్దుగా ముద్దాడే సీన్ ఉందట, నిజానికి సమంత పవన్ ను ముద్దు పెట్టుకోవడం అంటూ లేనప్పటికి సమంత పాత్రలో లీనమై నిజంగానే ముద్దుపెట్టుకుని అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తింది అంటున్నారు.
ఈసీన్ మొత్తం సినిమాకే హైలెట్ గా నిలిచిందట. కారణం ఈసీన్ సహజంగా, రియల్ గా ఉండడమే, చెప్పకపోయినా పాత్రను బట్టి, పరిస్తితికి అనుగునంగా సమంత నటిగా అంత పరిపక్వతను ప్రదర్శించడం సూపర్ అని త్రివిక్రమ్ తెగ పొగిడేసారంటున్నారు. ఏది ఏమైన సమంత మరో బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.







