Friday, 27 September 2013

జూనియర్ కు ట్విస్ట్ ఇస్తున్న నాగ్...!


గతవారం అంతా దసరా పండుగ వార్ అంతా జూనియర్, పవన్ ల మధ్యే ఉంటుంది అనుకున్నారు అంతా. కాని మొన్నటి నుంచి పైరసీ ట్విస్ట్ తో అత్తారింటికి దారేది తన దారి మార్చుకొని అక్టోబర్ కన్నా ముందుగానే ఈవారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ధియేటర్ లలో సందడి చెయ్యబోతోంది. దీనితో దసరా హడావుడి అంతా మన బుడ్డోడి దే అని యంగ్ టైగర్ అభిమానులు ఆనంద పడడమే కాకుండా మూడు సంవత్సరాల క్రితం బృందావనం తో కలిసివచ్చిన దసరా లా ఈ దసరా కూడా రామయ్యా వస్తావయ్యా కు పండుగ కిక్ ఇస్తుంది అనుకున్నారు అంతా. అయితే అనుకోకుండా ఒక అడుగు వెనుకకు వేసిన వెండితెర మన్మధుడు నాగార్జున వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకువస్తూ దసరా పోటీకి తాను కూడా రెడీ అంటూ సంకేతాలు ఇస్తూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భాయ్’ ఆడియో వేడుకను అక్టోబర్ 1వ తారీఖున నిర్వహించడమే కాకుండా మొదటిగా పవన్ అత్తారింటికి దారేది విడుదల అవుతుంది అనుకున్న అక్టోబర్ 9న కాని లేదంటే విజయదశమి పండుగ రోజైన అక్టోబర్ 14 న కాని ‘భాయ్’ ని విడుదల చెయ్యడానికి ప్లాన్ సిద్ధ౦ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పండుగ రేసు నుండి పవన్ సినిమా తప్పుకోవడంతో జూనియర్ తన రామయ్యా వస్తావయ్యా కు భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశపడుతున్నాడు. ఈ నేపధ్యంలో నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ తో జూనియర్ ఆశలకు నీళ్ళు జల్లినట్లే అనే వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపించడమే కాకుండా పవన్, జూనియర్ ల మధ్య జరుగుతుంది అనుకున్న పోటీ జూనియర్, నాగ్ ల మధ్య పోటీగా మారింది అంటూ ఫిల్మ్ నగర్ లో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఏదో ఒక పెద్ద హీరోతో పోటీ ఎన్టీఆర్ కు తప్పకపోవడం ఈసారి దసరా ట్విస్ట్ అని అనుకోవాలి.

టాలీవుడ్ ఫై ఇలియాన సంచలన వ్యాఖ్యlu


గోవా బ్యూటీ ఇలియానా తెలుగు సినిమా రంగం ఫై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలుగు సినిమారంగం లోని హీరోల పైనా దర్శకుల పైనా చాలా సెటైర్ లు వేసింది .ఇలీ బేబీ దృష్టిలో టాలీవుడ్ సినిమా రంగం లో కల్చర్ లేదట. అంతే కాదు ఇక్కడ హీరోయిన్లు అంతా దర్శకులు, హీరో లు వచ్చినప్పుడల్లా లేచి నుంచుని అతి గౌరవం ప్రదర్శించాలని చెప్పింది. తను పెరిగిన వాతావరణానికి టాలీవుడ్ వాతావరణానికి చాలా తేడా ఉందని అంటూ, తెలుగు సినిమా రంగం లో హీరోలతో తాను నటించే డప్పుడు తాను చాలా యాంత్రికం గా నటించానని అంటూ, తనను ఇష్టపడని చాలా మంది తెలుగు హీరో లు తన స్టార్ డం కోసం తన తో నటించి హిట్స్ కొట్టి తనను వదిలేసారని ఈ పొడుగు కాళ్ళ కరువు సుందరి చెప్పింది. ఇన్ని విషయాలు చెప్పిన ఇలియానా మాత్రం తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటీనటులకు, టెక్నీషియన్స్ కు మాత్రం చాలా గౌరవం ఇస్తారని కాని కొత్తవారిని మాత్రం చాలా ఘోరంగా చూస్తారని చెపుతూ తన స్వనుభావాన్ని అంతా ఏకరువు పెట్టింది. చాలా సినిమాలలో టాలీవుడ్ బిగ్ హీరోలు అందరితోనూ నటించి కోట్లాది రూపాయలు పారితోషికంగా తీసుకున్న ఈ గోవా బ్యూటీ కి ప్రస్తుతం టాలీవుడ్ పై అంత కోపం రావడానికి కల కారణం ఆమెకు ఇప్పుడు ఏ హీరో అవకాశాలు ఇవ్వకుండా పక్కకు పెట్టివేయడమే అనుకోవాలి. ప్రస్తుతం బాలీవుడ్ ను చిరునామా గా మార్చుకుందామని ప్రయత్నిస్తున్న ఇలియానా ప్లాన్ అక్కడ కూడా విఫలం కావడంతో అక్కసు తో మన ఇలీ బేబీ టాలీవుడ్ పై ఇలాంటి సెటైర్లు వేసింది అనుకోవాలి.

సంచలన తీర్పు : లీడర్ ను ఓటర్ ఛీకొట్టే అవకాsham


సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. నచ్చని లీడర్ పోటీలో ఉంటే ఆయనను ఛీకొట్టే అవకాశం కల్పించాలని శుక్రవారం తీర్పు వెలువరించింది. అంటే సదరు అభ్యర్థిని తిరస్కరించే అవకాశం కల్పిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో రిజక్ట్ బటన్ ఏర్పాటు చేయాలని ఈ తీర్పు సారాంశం. దీంతో ఓటర్లకు మంచి అవకాశమే కాకుండా దుర్మార్గులు, దుష్టులు పోటీచేసేందుకు కూడా భయపడతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాని ఇది ఎంతవరకు అమలవుతుందన్నది అసలు సమస్య. సుప్రీం చెప్పిందంతా చట్టం కాదు, చట్టం చేసే అధికారం పార్లమెంట్ కు మాత్రమే ఉంది. ఇప్పటికే రిమాండ్ ఖైదీలు, నిందితులు పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని సుప్రీం తీర్పు ఇస్తే ఏమయింది, వారికి పోటీ చేసే అవకాశంతో పాటు, చట్టసభలకు హాజరై అభిప్రాయాలు చెప్పే అవకాశాన్ని కూడా కల్పిస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ తాజాగా జారీ చేసాడు. అందుకే ఇది కూడా అంతే అని పెదవి విరుస్తున్నారు అంతటా.

జగన్ కు జబర్దస్థ్ వార్నింing

జగన్ బెయిల్ వ్యవహారం కాంగ్రెస్ లో కంపరం పుట్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీమాంద్రకు చెందిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని విబేదిస్తూ ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో సంచలనాల కేంద్రబిందువైన విజయవాడ ఎంపీ లగడపాటి, ఇతర ప్రముఖ నేతలు ఉండవల్లి, మంత్రి శైలజానాథ్ వంటి వారు తాజాగా జగన్-కాంగ్రెస్ డీల్ పై బహిరంగంగానే పరోక్ష హెచ్చరికలు జారీ చేసారు. లగడపాటి మాత్రం ఏకంగా తన రాజీనామా ఆమోదం పొందిన మరుక్షణం చీకటి ఒప్పందాల గుట్టు రట్టు చేస్తానని జబర్దస్థ్ హెచ్చరిక జారీచేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ హెచ్చరికలు అంతగా పట్టించుకోదు, కారణం ఇప్పటికే సీమాంద్రలో పార్టీ చచ్చిపోయిందన్న నిర్ణయానికి వచ్చింది, ఇంకా పార్టీకి వచ్చే ముప్పు ఏముంటుంది. కాని ఈ వ్యవహారం వల్ల జగన్ కే ప్రమాదం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం ఇప్పటికే జగన్ సోనియాతో డీల్ కుదుర్చుకోవడం వల్లే ఆయనకు బెయిల్ దొరికిందని కాంగ్రెస్ తో సహా అంటే ఒక్క జగన్ పార్టీ వారు తప్ప అందరు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక వైఎస్సార్ సిపి నేతలు కూడా ఎలక్ట్రానిక్ మీడియా చర్చల్లో, బయట మీడియా ముందు డైరెక్టుగా కాకున్నా ఇండైరెక్టుగా జగన్ – సోనియా ల డీల్ కరెక్టే అన్న విధంగా వాఖ్యలు చేస్తున్నారు. ఈతరుణంలో లగడపాటి వంటి వారు రాజీనామా ఆమోదమే తరువాయి ఆదారాలతో సహా చీకటి ఒప్పందాలను బయట పెడతానంటే దానికి మీడియా కూడా విశేష ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే ఇది జగన్ కు జబర్దస్థ్ హెచ్చరిక లాంటిదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

వర్మ అసలు రంగు ఇది....!

మోహన్ బాబు బాగా బుక్కయ్యాడు!




నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. ఊరు మంచిది కాకపోయినా ఫరవాలేదంటాడు కానీ, తన నోటిని మాత్రం అదుపు చేసుకోడు మోహన్ బాబు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అతడి ఘాటు విమర్శలకు పెద్ద పెద్ద వాళ్లు కూడా బలైపోతుంటారు. అయినా కూడా తన దారి తనదే అన్నట్టుగా ఉంటాడు మోహన్ బాబు. అయితే అతడు వందసార్లు అంటే, అతడిని అనే అవకాశం అవతలివాళ్లకు ఒక్కసారి కూడా రాకుండా పోతుందా చెప్పండి! ఇప్పుడు ఆ చాన్స్ దొరికింది అందరికీ.
వందేళ్ల సినిమా వేడుకకు వెళ్లొద్దంటూ టాలీవుడ్లో అందరి బుర్రలూ తినేశాడు డైలాగ్ కింగ్. రాష్ట్రంలో ఏమాత్రం శాంతి లేదు, ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు, ఇలాంటప్పుడు మనకెందుకు పండుగలు అంటూ పెద్ద లెక్చరే ఇచ్చాడు. వేడుకకు ఎవరూ వెళ్లకుండా బెటర్ అంటూ ఉపదేశాలు వల్లించాడు. కానీ ఎవ్వరూ అతడి మాట వినలేదు. నువ్వు రాకపోతే మానెయ్, మేం వెళ్తాం అంటూ వెళ్లిపోయారు. దాంతో పాపం అవమానంగా ఫీలయినా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు.
అయితే తన కొడుకు విష్ణు హీరోగా నిర్మిస్తోన్న దూసుకెళ్తా సినిమాని వచ్చే నెల పన్నెండో తేదీన విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించాడు మన యాంగ్రీ మ్యాన్. అంతే... అందరూ ఒక్కసారిగా పడీ పడీ నవ్వడం మొదలెట్టారు. రాష్ట్రమంతా కష్టాల్లో ఉంది అన్నాడు కదా, ఇప్పుడు తీరిపోయాయా కష్టాలు, వందేళ్ల వేడుకకు అడ్డొచ్చిన ప్రజల సమస్యలు తన కొడుకు సినిమాకి అడ్డు రావడం లేదా అంటూ సెటైర్లు వేయడం మొదలెట్టారు. అంతేమరి! తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చి సలహాలిస్తే లోకువయిపోతారు ఎవరైనా. ఆ విషయం మోహన్ బాబుకి తెలియలేదు. అయినా అంతగా లెక్చరిస్తే వందేళ్ల వేడుకకు అతడి కొడుకు, కూతురు వెళ్లి వచ్చారు. వాళ్లే అలా చేస్తే, ఇక బయటివాళ్లు ఆయనకు గౌరవం ఏం ఇస్తారు!

ప్రిన్స్ మహేష్ ఇంట్లో ఎవడు ?




టాలీవుడ్ ప్రిన్స్  హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి మంకీ క్యాప్ ధరించిన ఓ వ్యక్తి ప్రవేశించి దొంగతనానికి యత్నించాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ దొంగ తనం విఫలమైందిఅని తెలుస్తోంది.. ఆ సమయంలో మహేష్ ఇంట్లోనే ఉన్నారట, మహేష్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ప్రస్తుతం  పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 81లో హీరో మహేశ్‌బాబు నివాసం ఉంది. వివరాల్లోకి వెళితే బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మహేష్ బాబు ఇంటి ప్రహరీగోడ దూకిన అగంతకుడు సెక్యూరిటీ కళ్లుగప్పి ఇంటి వెనకాల కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు అని అంటున్నారు.
నేరుగా మహేష్ నిద్రిస్తున్న బెడ్‌రూమ్ వద్దకు చేరుకొని దొంగతనానికి యత్నించాడట. అలికిడి విన్న పని మనుషులు ఉలిక్కిపడి లేచారని అంటున్నారు ఎదురుగా మంకీ క్యాప్ ధరించిన వ్యక్తి నిలబడటంతో భయంతో అరిచారట. దీంతో సెక్యూరిటీగార్డ్‌లు అప్రమత్తం అవడంతో ఆ వ్యక్తిని వెంటనే ప్రధాన ద్వారం వద్దకు వచ్చి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ  అతడు అప్పటకే వెనక దారి నుంచి పరారయ్యాడు అని అంటున్నారు. విషయం తెలుసుకున్న మహేష్ బాబు బయటికి వచ్చి వివరాలు తెలుసుకుని, సెక్యూరిటీ గార్డ్‌ల ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతోంది.  ఇంట్లోకి చొరపడింది సెక్యూరిటీకి సంబంధించిన వ్యక్తులుగానే పోలీసులు అనుమానిస్తున్నారని తెలుస్తోంది.

Sonia adopted son jagan? says TDP




TDP today slammed  Jagan  as  'adopted son'of Congress president Sonia Gandhi  and that  he was playing a major +part in the conspiracuyenacted by the Congress party agaisnt the innocent and gullible people of  Seemandhra  and Telangana.

TDP spokesman Varla Ramaiah, Somireddy Chandrasekhar Reddy  and  Payyavula Keshav says that Seemandhra employees had forgone their Salaries worth Rs.13 crore and become victims of the game plan of Congress and YSRCP .' Both congress and YSRCP are two sides of the same coin and are supporting the bifurcation ', they said .

They said  YSRC leader  Jagan was a stark campaigner for bifurcation and Telagnana while  for public consuption he was playing around the Samaiklyandhra game. ' On directions of  Sonia Gandhi  the YSRC MLAs  are now keen to not resign as they are  biran washed to support  the resolution in exhange  Quid Pro Quo  for Jagan bail release, the TDP leaders said .

TDP leaders  said the  the congress high command anticipating trouble from CM Kiran was now  using the YSRC  for its ulterior  motives to get the Telagnana resolution passed  in the vent Kiran and Seemandhra leaders voted agaisnt it . 'It is nothing but sheer  opportunism of the Congress and the YSRC' they added.