టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజా రూటే సపరేటు. టాప్ హీరోయిన్ నుండి సపోర్టింగ్ రోల్స్ వరకూ రోజా ఏ పాత్ర చేసినా అది ఓ రేంజ్‌లో ఉంటుంది. సినిమాలకు స్వస్తి చెప్పి, పొలిటికల్ ఎంట్రి ఇచ్చిన రోజా అక్కడ కూడ తనదైన ట్రెండ్‌ను క్రియోట్ చేసుకుంది. తను ఏ పార్టిలో ఉన్నా, ఆపోజిషన్ పార్టీ లీడర్స్‌కు తన నోటితోనే దడ పుట్టిస్తుంది. ఏవరైనా రోజా జోలికి వెళ్ళాలంటేనే భయపడేలా చేస్తుంది.
ఇలాంటి పర్ససాలిటికి ఇప్పుడు భయం పట్టుకుంది.అది పార్టీ లీడర్స్ నుండి కాదు. ఫిల్మ్ ఆఫర్స్ గురించి కాదు. తన సొంత ప్యామిలీ నుండి రోజాకు ప్రాణభయం పట్టుకుంది. రోజా తమ్మడు ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడంట. తన ఇబ్బందులు తీరాలంటే డబ్బును అరేంజ్ చేయాలని రోజాపై తమ్ముడు ఒత్తిడి తెస్తున్నాడు. అంతే కాకుండా రోజా మేనేజర్ కూడ తమ్ముడితో కలిసి బెదిరింపులను మొదలుపెట్టారంట. ఈ విషయంపై రోజా పిర్యాదు చేసింది.
‘తన సోదరుడు ఏదో ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు, దానిలో నుంచి బయట పడటానికి తనని డబ్బు ఇవ్వమని వేదిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే తన గురించి తప్పుడు ప్రచారం చేస్తామని రామ్ ప్రసాద్ రెడ్డి, ప్రసాదరాజు బెదిరిస్తున్నారని’ దానికి సంబంధించిన వివరాలను చెప్పి పిర్యాదు చేయడంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎట్ ప్రెజెంట్ రోజా సినిమాల్లో కొన్ని కీలక పాత్రలు చేస్తూ,అలాగే టీవీ షో లతో బిజీ బిజీగా ఉంటోంది. ఇటువంటి సమయంలో తమ్ముడి నుండి వస్తున్న ఈ తరహా బెదిరింపులు తనని నిద్రపోనివ్వడం లేదంట.
No comments:
Post a Comment