
ఒకవైపు ఇతర తెలంగాణ వాదులంతా హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ వారిదేనని, ఇక్కడ సర్వంతెలంగాణ ప్రాంతానికి చెందినదేనని అంటుంటే.. జైపాల్ రెడ్డి మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాడు. తెలంగాణ ప్రజలతో పాటు సీమాంధ్రులకు కూడా సమ్మతమైన వ్యక్తి అవ్వడానికి జైపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ఇన్ని రోజులూ ఢిల్లీ వదిలి రాని జైపాల్ రెడ్డి హఠాత్తుగా హైదరాబాద్ లో సెటిలవ్వడం వెనుక భారీ స్కెచ్ ఉందని పరిశీలకులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు అధిష్టానానికి ఎదురుతిరుగుతున్న నేపథ్యంలో.. విభజన విషయంలో తీవ్ర వ్యతిరేకత చూపుతున్న తరుణంలో.. అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రి సీటు నుంచి తొలగించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మరి కిరణ్ తప్పిస్తే.. ఆ సీటులో ఏ దామోదర వంటి వాడిని తెచ్చిపెట్టడానికి అవకాశం లేదు. అలాగని సత్తిబాబునో, ఆనం రామనారాయణ రెడ్డినోకూడా తెచ్చిపెట్టలేరు. ఇప్పటికే వీళ్ల అసల రూపాలు జనాలకు తెలిసిపోయాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం మదిలో జైపాల్ రెడ్డి మెదిలినట్టున్నాడు. ఈయన అసలు రూపం ఏమిటో ఏపీ జనాలకు, ప్రత్యేకించి సీమాంధ్రులకు అసలు తెలీదు. ఇటువంటి నేపథ్యంలో జైపాల్ రెడ్డి సానుభూతి వచనాలతో సీమాంధ్రులకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులోనూ ఈయనకు రెడ్డి సామాజికవర్గ నేపథ్యం కూడా ఉంది. కాబట్టి అధిష్టానం ఇక ఏక్షణమైనా కిరణ్ ను తప్పించి జైపాల్ రెడ్డిని సీఎంగా చేసే అవకాశాలున్నాయి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జైపాల్ ను సీఎం సీట్లో కూర్చోబెట్టి.. స్టీరింగ్ తాము చేతబట్టి.. విభజన ప్రక్రియను సాఫీగా పూర్తిచేయాలని భావిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం!
No comments:
Post a Comment