ముంబయి : అండర్ వరల్డ్ ఇతివృత్తంగా పలు చిత్రాలను తీసిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఇకమీదట ఇలాంటి సినిమాల జోలికెళ్లబోనని చెప్పారు. వరుసగా ఇలాంటి చిత్రాలు తీసి విసుగు పుట్టిందో లేక మరే కారణమో కానీ వర్మ తన మనసు మార్చుకున్నారు. తాజాగా ఆయన తెరకెక్కించిన 'సత్య 2'నే గ్యాంగ్ స్టర్ కథాంశంపై తన చివరి సినిమా అని తెలిపారు. ఆ తర్వాత ఇలాంటి కథలను ఎన్నుకునే ఆలోచన లేదని తెలిపారు. 'సత్య 2' 'సత్య' సినిమాకిది సీక్వెల్.వర్మ గతంలో 'సర్కార్', 'కంపెనీ', 'సత్య' వంటి అండర్ వరల్డ్ నేపథ్యమున్నసినిమాలను తెరకెక్కించారు. ఇకనుంచి రోమాంటిక్ చిత్రాలను తీసే యోచనలో వర్మ ఉన్నారు. 'ప్రేమకథా చిత్రాలు తీయాలని భావిస్తున్నా. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన చిత్రాన్నిఈ ఏడాది చివర్లో ప్రారంభించే అవకాశముంది' అని వర్మ చెప్పారు.
No comments:
Post a Comment