Friday, 18 October 2013

అజిత్ సినిమాకు క్లీన్ యు స‌ర్టిఫికెట్ ..


త‌మిళ్ హీరో అజిత్ ఆరంభం సినిమాతో ఆడియెన్స్ ను అల‌రించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నాడ‌నే విష‌యం తెలిసిందే క‌దా…? అయితే ఈసినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ వ‌ర్క్ పూర్తి కావ‌డం అంటే సినిమా విడుద‌ల‌కు సిద్ద‌మైన‌ట్లే. అన్న‌ట్లుగానే ఈ నెల 31న త‌మిళ నాట విడుద‌ల చేయ‌డానికి డేట్ టెంట‌టీవ్ గా ఫిక్స్ చేశారు. అయితే విశేషం ఏమిటంటే.. తాజాగా అజిత్ చేసిన ఆరంభం సినిమా కు క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చారు . ఒక యాక్ష‌న్ హీరో సినిమాకు క్లీన్ యు స‌ర్టిఫికెట్ రావ‌డం అంటే..ఇది చిన్న పిల్ల‌ల‌తో చూడత‌గ్గ చిత్ర‌మ‌ని చెప్ప‌క‌నే చెబుతుంది.

 అయితే గ‌తంలో అజిత్ న‌టించిన అస‌ల్.. మంగ‌త్తా.. బిల్లా సినిమాల‌కు మాత్రం ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మంగ‌త్తాకు ఎ యు ఇవ్వ‌గా.. బిల్లా కు ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మ‌రి తాజాగా ఆరంభం మాత్రం క్లీన్ యు కొట్టి.. ట్యాక్స్ మిన‌హాయింపు కొట్టెసింది. ఈ చిత్రంలో అజిత్ కి జోడిగా న‌య‌న‌తార హీరోయిన్ గా చేస్తుండ‌గా.. ఆర్యా స‌ర‌స‌న తాప్సీ చేస్తుంది. చూడ‌బోతే ఇది మ‌న ఎన్టీఆర్ న‌టించిన బృందావ‌నం త‌ర‌హా సినిమా మాదిరి ఉందంటున్నారు టాలీవుడ్ ప‌రిశీల‌కులు. క్లీన్ యు వ‌చ్చిందంటే దాదాపు క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కావోచ్చు .అయితే తెలుగులో విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు ఏవి లేక‌పోవ‌డం విశేషం. బహుశా అక్క‌డ స‌క్సెస్ అయితే మాత్రం వెంట‌నే తెలుగు లో కూడా విడుద‌ల చేస్తారంటున్నారు కోలీవుడ్ వ‌ర్గాలు.

18 షరతులతో జగన్ సమైక్యాంధ్ర సభకు పర్మిషన్


హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన హైదరాబాదులో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలపెట్టిన సమైక్యాంధ్ర సభకు 18 షరతులతో అనుమతి లభించింది. రాష్ట్ర హైకోర్టు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ నెల 19వ తేదీన హైదరాబాదులో సమైక్యాంధ్ర సభను పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు నగర పోలీసులు కూడా దానికి అనుమతి ఇచ్చారు. ఈ నెల 16వ తేదీన హైకోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అయితే సమయం సరిపోదనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర సభను వాయిదా వేసుకుంది. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని వైయస్సార్ కాంగ్రెసు ఈ నెల 26వ తేదీన తలపెట్టిన సభకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ నుంచి అనుమతి లభించింది. షరతులను కచ్చితంగా పాటించాలని పోలీసులు వైయస్సార్ కాంగ్రెసును ఆదేశించారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఆ సభ జరగనుంది. సభను మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించి సాయంత్రం ఐదు గంటలకు పూర్తి చేయాలని పోలీసులు ఓ ప్రటనలో తెలిపారు.

 సమైక్యాంధ్ర సభ సందర్భంగా ఏవైనా విధ్వంసం, అవాంఛనీయ సంఘటనలు జరిగితే నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పద్ధతి ప్రకారం సభను నిర్వహించుకోవాలని చెప్పారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయబోమని, అవాంఛనీయ సంఘటనలకు ప్రేరేపించబోమని నిర్వాహకులు ముందస్తుగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సభకు వచ్చేవారిలో సంఘ వ్యతిరేక శక్తులు చేరే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. సభకు వచ్చేవారిని గుర్తించడానికి తగిన విధంగా వ్యవహరించాలని పోలీసులు నిర్వాహకులకు సూచించారు.

ప్రభాస్ బర్త్ డేకు...‘బాహుబలి’ మేకింగ్ వీడియో!


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి'. తన సినిమాలకు ప్రచారం కల్పించడానికి వెరైటీ మార్గాలను అన్వేషించే దర్శకుడు రాజమౌళి బాహుబలి విషయంలోనూ అదే ఫాలో అవుతున్నాడు. గతంలో విడుదలకు ముందే ‘ఈగ' మూవీ స్టోరీని లీక్ చేసిన రాజమౌళి ఈ సారి బాహుబలి చిత్రం మేకింగ్ వీడియోలను దఫదఫాలుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. ‘బాహుబలి' చిత్రం తొలి మేకింగ్ వీడియోను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ మేకింగ్ వీడియో ఒక నిమిషం నిడివితో ఉంటుందని సమాచారం. సినిమాపై అంచాలు పెంచే విధంగా ఈ మేకింగ్ వీడియో ఉంటుందని అంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో.....అప్పటి వరకు సినిమాపై ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గకుండా ఉండటానికే ఈ ప్లాన్ చేసాడట రాజమౌళి. మరి రాజమౌళి ప్లాన్ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.


 తన కెరీర్లో ఏ సినిమాకు పడనంత కష్టం ఈ సినిమా కోసం పడుతున్నాడు ప్రభాస్. యుద్ద విద్యలు, గుర్రం స్వారీలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. దీని తర్వాత తన దశ తిరుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో దాదాపు రూ. 2.5 కోట్ల ఖర్చుతో భారీ దర్బార్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు. ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

ఉద్యమాలకు భయపడే...: వేణు మాధవ్



హైదరాబాద్ :ఉద్యమాలతో నిర్మాతలు భయపడి సినిమాలను గతంలో మాదిరిగా తీసేందుకు ముందుకు రావడం లేదన్నారు. గతంలో తాను సంవత్సరానికి 50 సినిమాల్లో నటించేవాడినని, కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఉద్యమాల వలన సినీ పరిశ్రమలోని అందరికీ అవకాశాలు తగ్గిపోయాయని, ఇబ్బంది ఏర్పడిందని వేణుమాధవ్ చెప్పారు. నల్లగొండ జిల్లా కోదాడలో గురువారం జరిగిన జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడు పార సీతయ్య కుమారుడి వివాహానికి హాజరైన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మీడియాతో మాట్లాడారు. అలాగే సినీ పరిశ్రమలో తెలంగాణ, ఆంధ్ర వివక్ష లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తాను.. ఆంధ్ర నిర్మాతలు తీసిన సినిమాల్లోనే ఎక్కువగా నటించానన్నారు. సినిమా పరిశ్రమ తనకు పూర్తి సంతృప్తిని ఇచ్చిందన్నారు. ప్రపంచ సినీ పరిశ్రమలో ఎక్కువ మంది కమెడియన్లు తెలుగు పరిమ్రలోనే ఉన్నారని, ఇంకెంతమంది వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారన్నారు.


 సినిమాల్లో శృతిమించిన హస్యాన్ని తాను వ్యతిరేకిస్తానని, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు తాను నటించకుండా వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. మహిళలను అవమానపర్చకుండా, సకుటుంబంగా కూర్చుని చూసే సినిమాల్లోనే తాను నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అవకాశమొస్తే హీరోగా మరల నటిస్తానని ప్రకటించారు. శ్రీహరి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని, ఆ బాధతో దసరా పండగను చేసుకోలేదని ఆవేదనతో చెప్పారు. ప్రజలు కోరుకొంటే ప్రజాభీష్టాన్ని గౌరవించి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పార సీతయ్య, వేముల వెంకటేశ్వర్లు, మీరా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తనను పెంచి పోషించిన కోదాడ ప్రజల రుణాన్ని తీర్చుకొనేందుకు కోదాడలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు.

సమైక్య సభ సక్సెస్ కు జగన్ ఏర్పాట్లు ఇవే...!


..అది కూడా సమైక్య ఉద్యమానికి సంబంధించిన సభ కాబట్టి.. మరింత గ్రాండ్ గా ఉండాలి. జగన్ కు సీమాంధ్రలో ప్రస్తుతం రన్ ఇస్తున్న సబ్జెక్ట్ సమైక్యాంధ్ర మాత్రమే! సానుభూతి, కడప విజయాలు, ఉప ఎన్నికల విజయాలు.. ఇవన్నీ కాదు..ఇప్పుడు సమైక్యవాదమే జగన్ ను ముంచినా తేల్చినా.. జగన్ మోహన్ రెడ్డి ఈ సమైక్య శంఖారావాన్ని సీమాంధ్రలో వేరే ఎక్కడైనా నిర్వహించి ఉంటే... ఆ కథ వేరే రకంగా ఉండేది. జనాలు రావడం లేదా తరలించడం పెద్ద సమస్య అయ్యేది కాదు. ఇప్పుడు సమైక్య సభ జరుగుతున్నది హైదరాబాద్ లో...! ఇది జగన్ ఒక రకంగా పాజిటివ్ మరో రకంగా నెగిటివ్. తెలంగాణ ప్రాంతంలో భాగమైన, తెలంగాణ వాదులు తమదిఅంటున్న.. హైదరాబాద్ లో జగన్ మోహన్ రెడ్డి ఈ సభ నిర్వహిస్తుండటం సీమాంధ్ర ప్రజల్లో ఉద్వేగాలను రగిలిస్తుంది!

 తమ వాడు తెలంగాణ ప్రాంతంలో సమైక్యవాదాన్ని చాటుతున్నాడనే ఉత్సాహం వస్తుంది అక్కడి ప్రజల్లో.. అయితే జన సమీకరణ అంత ఈజీ కాదు. ఈ సభ విషయంలో జన సంఖ్య ఏ మాత్రం తగ్గినా..జగన్ పై విరుచుకుపడటానికి ప్రత్యర్థులు రెడీగాఉంటారు. ఈ సభకు జనాలు ఏ స్థాయిలో వచ్చినా.. కొన్ని మీడియా వర్గాలు తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తాయి. ఈ నేపథ్యంలో జన సమీకరణ జగన్ కు కత్తిమీద సామే! తెలంగాణ ప్రాంతం నుంచి ఈ సభకు జనాలు వచ్చే అవకాశాలు బాగా తక్కువ.. మరి దీని కోసం సీమాంధ్ర ప్రాంతం మీదనే ఆధారపడ్డాడు జగన్ రెడ్డి. వివిధ ప్రాంతాల నుంచి ఎనిమిది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసుకొని.. జగన్ పార్టీ జనసమీకరణ చేపట్టినట్టు సమాచారం. ఇక హైదరాబాద్ పరిధిలోని పార్టీ నాయకుల పై జన సమీకరణ బాధ్యతలు మోపాడట జగన్ మోహన్ రెడ్డి. మరి వీరి పనితనం ఏ స్థాయిలో ఉంటుందో!

ముఖ్యమంత్రిని నమ్ముకుంటే ముండమోసుడే


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నమ్ముకుంటే ముండమోసుడే అని క్లియర్ అయ్యింది. ఇప్పటికి ఆయన సమైక్యాంద్రకోసం కట్టుబడి ఉన్నాడు, ఆయన తెలంగాణను అడ్డుకుంటాడు అని నమ్మితే దానంత మూర్ఖత్వం మరోటి ఉండదని తనకు తానే తేల్చిచెప్పాడు అంటున్నారు. సీమాంద్రుని ముసుగులో నిజమైన తెలంగాణ ఏర్పాటు వాదిగా పని చేస్తున్నది నేనే అంటూ కుండబద్దలు కొట్టి మరీ నిరూపించుకున్నాడు అన్న భావం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇలా తన అసలు రూపం బయటపెట్టుకోవడం ఇదేమి మొదటిసారి కాదు, ఇప్పటికే ఎన్నో సార్లు బయటపెట్టుకున్నాడు, ఇప్పుడు మరోసారి చూపించాడు అంటున్నారు.

 శుక్రవారం ఆయనను వైఎస్సార్ సిపి ఎమ్మెల్యేలు సచివాలయంలో ఆయనను కలిసారు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అసెంబ్లీలో తీర్మానించాలి, దీని కోసం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి అన్నారు. నిజంగా ఆయన సమైక్యమే కోరుకుంటే ఇలా చేయడానికి ఆయనకు అభ్యంతరం ఉండదు. పైగా ప్రతిపక్షమే కలిసి వస్తున్నందున తన కాంక్ష నెరవేర్చుకోవడం కోసం బంగారం లాంటి అవకాశం వచ్చింది అంటూ ఎగిరి గంతేయాలి. కాని ఆయనేం చేసాడు, అది కుదరదు అంటూ చెప్పేసి అసలు బాగోతాన్ని బయటపెట్టుకున్నాడు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే రాష్ట్రం విడిపోకుండా ఎంతకైనా తెగిస్తాను, అంటూ ఏకంగా తనకు ముఖ్యమంత్రి పదవినిచ్చిన సోనియా గాందీనే ధిక్కరిస్తే వారెవ్వా... శభాష్ అనుకున్నారు. ముఖ్యమంత్రి ఎదురుతిరిగాక ఇక సోనియా ఏం సాహసం చేస్తుంది అంటూ ఆయనను ఏకంగా సమైక్యాంద్ర స్టార్ బ్యాట్స్ మెన్ తో పోల్చారు.

 కాని ఏమయింది, తెలంగాణ ప్రక్రియ ఆగలేదు కదా... వేగంగా ముందుకు కదిలి చివరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది. ఆయన నడిపిస్తున్నాడు అన్న ఏపిఎన్జీఓలు కూడా రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే రాష్ట్రం విభజన ఆగుతుంది అంటే వద్దు, అలా చేస్తే పార్లమెంటులో, అసెంబ్లీలో బిల్లును అడ్డుకోలేం అంటూ బయటక నమ్మ బలికి రాజీనామాలకు సిద్దమైన ఎంపీలను కూడా ఢిల్లీ వెల్లి నివారించాడు ముఖ్యమంత్రి. అంతెందుకు సమైక్యం తప్ప మరో డిమాండ్ లేదు, ఎంత వరకైనా సమ్మె చేస్తాం అని భీష్మించుకు కూర్చున్న ఉద్యోగులకు ఎలాంటి హామి ఇవ్వకుండానే సమ్మెనుంచి తప్పించేసాడు. పైగా వారితో చర్చల సంధర్బంగా తెలంగాణ ఏర్పాటు ఆపడం, ఆపకపోవడం కేంద్రానిది, అందుకే ఆ హామి ఇవ్వలేను, కాని ఎన్నికల దాకా తెలంగాణ ఏర్పాటు కాదని హామి ఇస్తున్నాను అన్నాడు,

 అంటే దానర్థం ఏంటి తెలంగాణ ఏర్పాటు ఖాయమే అన్నట్టు కదా. అంతెందుకు నిన్న కాక మొన్న దిగ్విజయ్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ తెలంగాణ ఏర్పాటుకు సహకరించడానికే ఉన్నాడని చెప్పాడు ఇవన్నీ చాలు సమైక్య ముసుగులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా ఆదేశాల ప్రకారం తెలంగాణ ఏర్పాటుకు ఎలా ముందుకు కదులుతున్నాడో చెప్పాడానికి. ఇవన్నీ పక్కనే బెడితే వైఎస్సార్ సిపి అడిగిందేమిటి, అసెంబ్లీ సమావేశం పెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని తీర్మాణం చేసి కేంద్రానికి పంపించమన్నారు, సమైక్యాన్ని కోరుకుంటున్న ఆయన దీనికి ఎందుకు అభ్యంతరం చెప్పాడు, తీర్మాణం ప్రవేశపెడితే ఆయన కూడా మద్దతివ్వాల్సి వచ్చి సోనియా ఆదేశాలను బేఖాతరు చేసిన వాడవుతాడన్నది ఓ భయమైతే, ఇది తెలంగాణ ఏర్పాటుకు ఎక్కడ బ్రేకులు వేస్తుందోనన్న భయం కూడా ఆయనలో ఉన్నదన్నది స్పష్టమవుతోంది కదా అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందుకే ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి తన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు అన్న వాదనలకు బలం చేకూరుతోంది.

టాప్ హీరోయిన్స్ గొడ‌వ‌, ప్రొడ్యూజ‌ర్‌కి భారీ న‌ష్టం


ఇద్దరు టాప్ హీరోయిన్స్ బ‌హిరంగంగానే గొడ‌వకు దిగారు. దీంతో ఆ మూవీ ప్రొడ్యూజ‌ర్, హీరోల‌కు ఏం చేయాలో అర్ధం కావ‌డంలేదు. ఇదంతా ఫిల్మ్ ఇండ‌స్ట్రీ సాక్షిగా జ‌రుగుతుంది. బాలీవుడ్‌లో కంగ‌నార‌నౌట్‌, ప్రియాంక చోప్ర ఇద్దరూ టాప్ హీరోయిన్స్‌. వీరిద్దరికి ఇప్పుడు ఒక‌రంటే ఒక‌రు ప‌డ‌టం లేదు. ఇద్దరూ చెరో దారి ప‌డుతున్నారు. వీరిద్దరూ క‌లిసి న‌టించిన లేటెస్ట్ చిత్రం క్రిష్‌3. ఈ మూవీ దీపావ‌ళి సంద‌ర్భంగా నంబ‌ర్‌1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీకు ప్రమోష‌న్‌ని కూడ భారీగానే చేస్తున్నారు.

 క్రిష్‌3లో హృతిక్‌రోష‌న్ స‌ర‌స‌న ప్రియాంక‌చోప్ర హీరోయిన్‌గా చేస్తే, ఓ ముఖ్యమైన పాత్రలో కంగ‌నార‌నౌట్ చేసింది. అయితే క్రిష్‌3 ప్రమోష‌న్ కోసం ఈ ఇద్దరి హీరోయిన్స్ స‌హ‌క‌రించ‌డంలేదు. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌క‌పోవ‌డంతో కంగ‌నా ప్రమోష‌న్‌కి వ‌స్తే ప్రియాంక చోప్ర రావ‌డంలేదు. ప్రియాంక వ‌స్తే కంగాన రావ‌డంలేదు. మూవీ మొద‌టిలోనే వీరిద్దరూ క‌లిసి ప్రమోష‌న్‌కి రావాల‌ని అగ్రిమెంట్ ఉన్నా, ఇప్పుడు ఆ బాండ్‌ను కూడ లెక్కచేయ‌డంలేదు. దీంతో క్రిష్‌3 మూవీ ప్రమోష‌న్ కోసం కోట్లు ఖ‌ర్చు పెడుతున్న ప్రొడ్యూజ‌ర్‌కి, వీరిద్దరి వ్యవ‌హారంతో అంతా న‌ష్టం వ‌స్తుంద‌ట‌. అందుకే వీరిద్దరిని ఏదోక విధంగా న‌చ్చచెప్పి ప్రమోష‌న్స్‌లో క‌లిసి రావాల‌ని హృతిక్‌రోష‌న్ రంగంలోకి దిగాడు.

ఇక జగనే దిక్కు


అంతా అయిపోయింది, ఛీ పొమ్మన్నవాడే నేడు దిక్కయ్యాడు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మిగిలింది ఒకే ఒక్కడు జగన్ అని తేలిపోయింది. వైఎస్సే అసలు కారకుడు అంటూ ఏపిఎన్జీఓలు సమైక్యఉద్యమంలో జగన్ ను పక్కనబెట్టి నేడు వారే హ్యాండివ్వడంతో సమైక్యవాదుల దిమ్మతిరిగింది. పైగా కీలక సమయంలో ఏపిఎన్జీఓలు హ్యాండిచ్చారు. సమైక్యం వినిపించిన కాంగ్రెసోళ్లు కూడా నేడు సోనియాకు దాసోహం అన్నారు. చంద్రబాబు ఇప్పటికీ నేను రెండుప్రాంతాల వాడిని అంటున్నాడు. ఇక సమైక్యవాదులకు దిక్కెవరు అంటే వైఎస్ జగన్ అన్నది అక్షర సత్యం అంటున్నారు రాజకీయ పరిశీలకులు కూడా. కాంగ్రెస్ లో ఒక్క మంత్రి శైలజానాథ్ తప్ప సమైక్యం అన్నవాడు కరవయ్యాడు. ఇన్నాళ్లు సమైక్యం కోసం పాటుపడుతున్నాం అంటున్న మంత్రులు కూడా ఇక బహిరంగంగానే అలా అనడం ప్రజలను మోసం చేసినట్టేనని, ఇంకా అలా అంటే అసలుకే ఎసరు వస్తుందని, తెలంగాణ ఇవ్వడం ఖాయమని, ఇప్పటికైనా మనకు దక్కాల్సిన వాటి కోసం పోరాడి దక్కించుకోవాలని, ఇప్పుడు కూడా సమైక్యం అంటే సీమాంద్రులు నిలువునా మునుగుతారని చెప్పేస్తున్నారు.

 ఈ సమయంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రజలకు బాసటగా ఎవరు నిలబడాలి, ఎంతకైనా తెగించి సమైక్యంగా ఉంచడానికి పోరాడాలంటే నాయకుడు కావాలి, నాయకుడు లేకుండా ప్రజల్లో ఎంత కాంక్ష ఉన్నా ముందుకుపోలేరు అన్నది నగ్నసత్యం. ఇలాంటప్పుడు వారికి నాయకుడు ఎవరు, ఏపిఎన్జీఓలు నిలువునా ముంచారు, నడి సముద్రంలోకి తీసుకువెల్లి నీళ్లలో దొబ్బేసారు. స్టార్ బ్యాట్స్ మెన్ అనుకున్న ముఖ్యమంత్రి కూడా ఆపడం తనవల్ల కాదని కుండబద్దలు కొట్టాడు. ఇలా ఏ కోణంలో చూసినా సమైక్యానికి మిగిలిన దిక్కు జగనే, ఇక ఆయనే సీమాంద్రులకు అండాదండా అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.