Friday, 18 October 2013

ఇక జగనే దిక్కు


అంతా అయిపోయింది, ఛీ పొమ్మన్నవాడే నేడు దిక్కయ్యాడు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మిగిలింది ఒకే ఒక్కడు జగన్ అని తేలిపోయింది. వైఎస్సే అసలు కారకుడు అంటూ ఏపిఎన్జీఓలు సమైక్యఉద్యమంలో జగన్ ను పక్కనబెట్టి నేడు వారే హ్యాండివ్వడంతో సమైక్యవాదుల దిమ్మతిరిగింది. పైగా కీలక సమయంలో ఏపిఎన్జీఓలు హ్యాండిచ్చారు. సమైక్యం వినిపించిన కాంగ్రెసోళ్లు కూడా నేడు సోనియాకు దాసోహం అన్నారు. చంద్రబాబు ఇప్పటికీ నేను రెండుప్రాంతాల వాడిని అంటున్నాడు. ఇక సమైక్యవాదులకు దిక్కెవరు అంటే వైఎస్ జగన్ అన్నది అక్షర సత్యం అంటున్నారు రాజకీయ పరిశీలకులు కూడా. కాంగ్రెస్ లో ఒక్క మంత్రి శైలజానాథ్ తప్ప సమైక్యం అన్నవాడు కరవయ్యాడు. ఇన్నాళ్లు సమైక్యం కోసం పాటుపడుతున్నాం అంటున్న మంత్రులు కూడా ఇక బహిరంగంగానే అలా అనడం ప్రజలను మోసం చేసినట్టేనని, ఇంకా అలా అంటే అసలుకే ఎసరు వస్తుందని, తెలంగాణ ఇవ్వడం ఖాయమని, ఇప్పటికైనా మనకు దక్కాల్సిన వాటి కోసం పోరాడి దక్కించుకోవాలని, ఇప్పుడు కూడా సమైక్యం అంటే సీమాంద్రులు నిలువునా మునుగుతారని చెప్పేస్తున్నారు.

 ఈ సమయంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రజలకు బాసటగా ఎవరు నిలబడాలి, ఎంతకైనా తెగించి సమైక్యంగా ఉంచడానికి పోరాడాలంటే నాయకుడు కావాలి, నాయకుడు లేకుండా ప్రజల్లో ఎంత కాంక్ష ఉన్నా ముందుకుపోలేరు అన్నది నగ్నసత్యం. ఇలాంటప్పుడు వారికి నాయకుడు ఎవరు, ఏపిఎన్జీఓలు నిలువునా ముంచారు, నడి సముద్రంలోకి తీసుకువెల్లి నీళ్లలో దొబ్బేసారు. స్టార్ బ్యాట్స్ మెన్ అనుకున్న ముఖ్యమంత్రి కూడా ఆపడం తనవల్ల కాదని కుండబద్దలు కొట్టాడు. ఇలా ఏ కోణంలో చూసినా సమైక్యానికి మిగిలిన దిక్కు జగనే, ఇక ఆయనే సీమాంద్రులకు అండాదండా అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

No comments:

Post a Comment