తమిళ్ హీరో అజిత్ ఆరంభం సినిమాతో ఆడియెన్స్ ను అలరించడానికి సిద్దమవుతున్నాడనే విషయం తెలిసిందే కదా…? అయితే ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ వర్క్ పూర్తి కావడం అంటే సినిమా విడుదలకు సిద్దమైనట్లే. అన్నట్లుగానే ఈ నెల 31న తమిళ నాట విడుదల చేయడానికి డేట్ టెంటటీవ్ గా ఫిక్స్ చేశారు. అయితే విశేషం ఏమిటంటే.. తాజాగా అజిత్ చేసిన ఆరంభం సినిమా కు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు . ఒక యాక్షన్ హీరో సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ రావడం అంటే..ఇది చిన్న పిల్లలతో చూడతగ్గ చిత్రమని చెప్పకనే చెబుతుంది.అయితే గతంలో అజిత్ నటించిన అసల్.. మంగత్తా.. బిల్లా సినిమాలకు మాత్రం ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మంగత్తాకు ఎ యు ఇవ్వగా.. బిల్లా కు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మరి తాజాగా ఆరంభం మాత్రం క్లీన్ యు కొట్టి.. ట్యాక్స్ మినహాయింపు కొట్టెసింది. ఈ చిత్రంలో అజిత్ కి జోడిగా నయనతార హీరోయిన్ గా చేస్తుండగా.. ఆర్యా సరసన తాప్సీ చేస్తుంది. చూడబోతే ఇది మన ఎన్టీఆర్ నటించిన బృందావనం తరహా సినిమా మాదిరి ఉందంటున్నారు టాలీవుడ్ పరిశీలకులు. క్లీన్ యు వచ్చిందంటే దాదాపు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావోచ్చు .అయితే తెలుగులో విడుదల చేసే ప్రయత్నాలు ఏవి లేకపోవడం విశేషం. బహుశా అక్కడ సక్సెస్ అయితే మాత్రం వెంటనే తెలుగు లో కూడా విడుదల చేస్తారంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
No comments:
Post a Comment