..అది కూడా సమైక్య ఉద్యమానికి సంబంధించిన సభ కాబట్టి.. మరింత గ్రాండ్ గా ఉండాలి. జగన్ కు సీమాంధ్రలో ప్రస్తుతం రన్ ఇస్తున్న సబ్జెక్ట్ సమైక్యాంధ్ర మాత్రమే! సానుభూతి, కడప విజయాలు, ఉప ఎన్నికల విజయాలు.. ఇవన్నీ కాదు..ఇప్పుడు సమైక్యవాదమే జగన్ ను ముంచినా తేల్చినా..
జగన్ మోహన్ రెడ్డి ఈ సమైక్య శంఖారావాన్ని సీమాంధ్రలో వేరే ఎక్కడైనా నిర్వహించి ఉంటే... ఆ కథ వేరే రకంగా ఉండేది. జనాలు రావడం లేదా తరలించడం పెద్ద సమస్య అయ్యేది కాదు. ఇప్పుడు సమైక్య సభ జరుగుతున్నది హైదరాబాద్ లో...! ఇది జగన్ ఒక రకంగా పాజిటివ్ మరో రకంగా నెగిటివ్. తెలంగాణ ప్రాంతంలో భాగమైన, తెలంగాణ వాదులు తమదిఅంటున్న.. హైదరాబాద్ లో జగన్ మోహన్ రెడ్డి ఈ సభ నిర్వహిస్తుండటం సీమాంధ్ర ప్రజల్లో ఉద్వేగాలను రగిలిస్తుంది!తమ వాడు తెలంగాణ ప్రాంతంలో సమైక్యవాదాన్ని చాటుతున్నాడనే ఉత్సాహం వస్తుంది అక్కడి ప్రజల్లో.. అయితే జన సమీకరణ అంత ఈజీ కాదు. ఈ సభ విషయంలో జన సంఖ్య ఏ మాత్రం తగ్గినా..జగన్ పై విరుచుకుపడటానికి ప్రత్యర్థులు రెడీగాఉంటారు. ఈ సభకు జనాలు ఏ స్థాయిలో వచ్చినా.. కొన్ని మీడియా వర్గాలు తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తాయి. ఈ నేపథ్యంలో జన సమీకరణ జగన్ కు కత్తిమీద సామే! తెలంగాణ ప్రాంతం నుంచి ఈ సభకు జనాలు వచ్చే అవకాశాలు బాగా తక్కువ.. మరి దీని కోసం సీమాంధ్ర ప్రాంతం మీదనే ఆధారపడ్డాడు జగన్ రెడ్డి. వివిధ ప్రాంతాల నుంచి ఎనిమిది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసుకొని.. జగన్ పార్టీ జనసమీకరణ చేపట్టినట్టు సమాచారం. ఇక హైదరాబాద్ పరిధిలోని పార్టీ నాయకుల పై జన సమీకరణ బాధ్యతలు మోపాడట జగన్ మోహన్ రెడ్డి. మరి వీరి పనితనం ఏ స్థాయిలో ఉంటుందో!
No comments:
Post a Comment