Friday, 4 October 2013

Akkineni Nageswararao 90th Birthday Celebrations


</div>

నేటి రాజకీయ ఉద్యమాల పై సమంత కామెంట్ !!


మన ఫిలిం సెలెబ్రెటీలకు రకరకాల వర్గాల నుండి అలాగే రకరకాల ప్రాంతాల నుండి ఆఖరకు వివిధ రాజకీయ పార్టీల నుండి అభిమానులు ఉంటారు. అందుకనే వారు ప్రతి విషయం పై చాల తెలివిగా స్పందిస్తూ ఉంటారు. అద్దాల మెడ లాంటి వారి కెరియర్ పై చిన్న రాయి తగిలినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారికి తెలుసు, అందుకే వారి మనస్సులో మాట సామాన్యంగా బయట పెట్టరు. హీరోయిన్స్ ఈ విషయంలో మరీ జాగ్రత్తగా ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న రాజకీయ ఉద్యమాల పై మన సినిమా మాయలేడి సమంత అభిప్రాయం తీసుకుందామని ఒక మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి సమంతను ఈ మధ్య తెగ వెంటాడట. ఆ ప్రతినిధి నేటి రాజకీయ ఉద్యమాల పై జరుగుతున్న రగడ పై కామెంట్ చేయమని ఎన్ని సార్లు అడిగినా నవ్వుతూ తప్పించుకున్న సమంత లేటెస్ట్ గా తన అభిప్రాయాన్ని వెల్లడించింది ‘ప్రస్తుత రాజకీయ ఉద్యమాల పై చాలా మంది అడుగుతున్న ప్రశ్నలకు నాసమాధానం నో కామెంట్’ అంటూ ముగించిందట.

 ఏ సెలెబ్రెటీకి అయినా తప్పించుకోవడానికి ఇంతకన్నా తెలివైన సమాధానం ఉండదు కదా. రాజకీయనాయకులే రెండుకాళ్ళ సిద్దాంతం ఫాలో అవుతున్నప్పుడు వారి ముందు సమంత ఎంత !

పుత్తూరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం?


చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులో భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. కాల్పులు జరిపిన నివాసంలో వారు మృతి చెందినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ ను తెప్పించిన పోలీసులు ఆ మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఎన్ ఐఏ బృందం కాసేపట్లో పుత్తూరుకు చేరుకోనున్నారు. మృతులు కోయంబత్తూరు బాంబు పేలుళ్ల నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


 కాగా 1998 ఫిబ్రవరి 15న కోయంబత్తూరులో పేలుళ్లు జరిగాయి. 11 ప్రాంతాల్లో 13 పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 58మంది మృతి చెందగా, సుమారు 200మందికి పైగా గాయపడ్డారు.

పుత్తూరులో ఉగ్రవాదుల దాడి.. కానిస్టేబుల్ మృతి


చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులో అల్ ఉమా ఉగ్రవాదులు కలకలం రేపారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న విశ్వసనీయ సమాచారం అందడంతో తమిళనాడు, ఆంధ్రా పోలీసులు దాడి చేయగా.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మరణించారు. ఓ ఇన్ స్పెక్టర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భావిస్తున్న ఇంట్లో మరో నలుగురి వరకు అల్ ఉమా ఉగ్రవాదులున్నట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆక్టోపస్ బలగాలను అక్కడకు తరలించినట్లు డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. సుమారు 30 మంది ఆక్టోపస్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

 ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారనే సమాచారం అందడంతో గేటు పుత్తూరు మేదరవీధిలోని ఓ నివాసంలో తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు అక్కడకు చేరుకోగానే తొలుత అక్కడున్న అనుమానితులు ప్రతిఘటించారు. కొద్ది సేపటికే వాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మరణించగా, మరో ఇన్ స్పెక్టర్ గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

భాయ్‌ లీకేజీ!


ఏదైనా వార్తని గుప్పిట దాచి ఉంచడం కష్టం. ఓపెన్‌ చేసేయడం ఈజీ. అదే స్టార్‌హీరోల సినిమాల విషయంలో అది మరింత కష్టం. ఎందుకంటే రిలీజ్‌కు ముందే చాలా ఎగ్జయిట్‌మెంట్‌ జనాల్లో ఉంటుంది. అలాగని ఏదైనా ఓ సినిమా కథ లీకైతే అప్పటివరకూ జనాల్లో ఉన్న క్యూరియాసిటీ గాలికి కొట్టుకుపోతుంది. సినిమాపై ఆసక్తి పోతుంది. దానివల్ల సినిమాకి తీరని నష్టం జరగుతుంది. అందుకే మన దర్శకనిర్మాతలు ప్రచారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ‘భాయ్‌’ చిత్రాన్ని ఇటీవల ఓవర్‌సీస్‌ పంపిణీదారుల కోసం ప్రివ్యూ వేశారు. ఈ సినిమా చూసిన సదరు వ్యాపారులు ఉత్సాహం తట్టుకోలేక కథని లీక్‌ చేసేశారు. దాంతో వెబ్‌మీడియాలో ‘భాయ్‌’ కథపై కథనాలు వచ్చేశాయి. సింగిల్‌ లైన్‌లో చెప్పాల్సిన కథని సినిమా రీళ్లన్నీ చెప్పేసి పెద్ద తప్పిదం చేశారు సదరు పంపిణీదారులు. ఈ విషయంలో నాగ్‌ చాలా సీరియస్‌ అయ్యారని సమాచారం.

అమెరికా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చేటు


న్యూయార్క్‌ : అమెరికాలో నెలకొన్న ప్రస్తుత రుణ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) హెచ్చరించింది. అమెరికా వ్యవహారం ఇప్పుడు 'సంక్లిష్ట యాత్ర'గా దాపురిం చిందని ఐఎంఎఫ్‌ సంచాలకులు క్రిస్టిని లాగార్డే వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలు, ఇతరత్రా ప్రాబల్య అంశాలతో అక్కడ నెలకొన్న పరిస్థితితో కేవలం ఆ దేశానికే కాకుండా ప్రపంచానికి ప్రత్యే కించి ఆర్థిక రంగానికి ఇబ్బందిగా మారు తుందని ఆమె తెలిపారు. ఈ సంక్లిష్టమైన అంశాన్ని అమెరికా తేలిగ్గా కొట్టిపారే యడానికి వీల్లేదని, ఎక్కువ కాలం నాన్చి ఉంచితే, ముప్పుగా మారుతుందని, షట్‌డౌన్‌ను అడ్డుకోవాలని ఆమె అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమెరికాలో బడ్జెట్‌, రుణ పరిమితి, చెల్లింపులకు సంబంధించి ఇప్పుడు ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి, క్రియాశూన్యత చాలా చెడు పరిణామమని విమర్శించారు. రుణ పరిమితిని పెంచడంలో విఫలం కావడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కేవలం అమెరికాకే కాకుండా ఇతర దేశాలపై కూడా దీని ప్రభావం పడుతుందని తెలిపారు. అమెరి కాలో ఆర్థిక పరిణామాలపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్పందించడం ఇటీ వలి కాలంలో ఇదే తొలిసారి. సమస్యను సాగదీయడం వల్ల ప్రయోజనం ఉండదని జార్జి వాషింగ్టన్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ సభలో ఆమె స్పష్టం చేశారు. అంతా పట్టుదలకు పోకుండా నెమ్మదించాలి. అయితే సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేసుకోవాలని కోరారు. రికవరిలకు ఇబ్బంది కల్గించని రీతిలో వ్యయకోతలను ఎత్తివేయాల్సి ఉంటుందని, దీనికి తగు విధమైన మద్దతు చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వానికి మిస్‌ లాగార్డే సూచించారు.

 కేవలం అమెరికాలోనే కాకుండా జపాన్‌లోనూ ఆర్థిక చిక్కు సమస్యలు ఉన్నాయని అక్కడి రుణ భారం తగ్గించేందుకు జపాన్‌ ఆర్థిక సాయం కోరుతోందని తెలిపారు. జపాన్‌ జిడిపి విలువతో చూస్తే అక్కడ సగటు రుణభారం దాదాపు 90వేల డాలర్ల స్థాయికి చేరిందని ఐఎంఎఫ్‌ ఎండి చెప్పారు. ఆర్థిక భారాలను తగ్గించు కోవడానికి పలు దేశాలు సవ్యమైన దిశలో వ్యవహరించాల్సి ఉందన్నారు. విధానపరమైన మౌలిక సూత్రాలు సవ్యంగా లేకపోతే ఎలాంటి ప్రయోజనా లైనా శాశ్వతం కాజాలవని హెచ్చరిం చారు. సంస్కరణలు నిర్మాణాత్మకంగా ఉండాలని, ఆర్థిక, ద్రవ్య విధానాలకు చేయూత నిచ్చేవిగా నిలవాలని పిలుపు నిచ్చారు. అమెరికాలో ఇప్పుడు రాజకీయ ప్రాబల్యం కోసం సాగుతోన్న రాజకీయ అసహన ధోరణి చివరికి అక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని, ఇప్పటికే అక్కడి వేతనజీవులు దీని ఫలితాలను అనుభవిస్తున్నారని ఐఎంఎఫ్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రిపబ్లికన్లను కాదని ప్రెసిడెంట్‌ ఒబామా చేపట్టిన ఆరోగ్య పరిరక్షణ పథకం ...ఒబామా హెల్త్‌కేర్‌గా మారిందని, దీనికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు కేటాయించడం అసాధ్యమని తేల్చి చెప్పిన ప్రతిపక్షాలు తమకు పట్టున్న చట్టసభలో బిల్లును పెండింగ్‌లోకి నెడుతూ తీర్మానం చేశారు. దీనిని ఒబామా వర్గం వీటో చేయడం దరిమిలా రాజకీయ సంక్షోభం ముదిరి షట్‌డౌన్‌ పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే సంక్షోభ నివారణకు అమెరికాలోని ప్రతిపక్షాలు కానీ, అధికార పక్షం కానీ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్న దాఖలాలు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్‌ నుంచి తీవ్ర స్పందన వెలువడింది.

ఆటోనగర్‌ సూర్యకూ దెబ్బే!


అసలే ఆటుపాట్లు ఎదుర్కొంటూ ఈ మధ్యనే ముందుకు సాగిన ఆటోనగర్‌ సూర్యకు మరోసారి గండిపడేట్లు ఉంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు సినిమాకు కలిసిరావడంలేదని తెలుస్తోంది. ఫైనాన్స్‌ ప్రాబ్లంవల్ల ఆగిపోయిన సినిమాను మళ్ళీ వెంకట్‌ ముందుకు తెచ్చాడు. కొంత ప్యాచ్‌వర్క్‌ను పూర్తి చేస్తున్నాడు. మొదట అనుకున్నట్లు దీపావళికి రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. ఇప్పుడు అది కూడ అనుమానంగా ఉంది. పోస్టుప్రొడక్షన్స్‌కార్యక్రమాలు మంద కొండిగా సాగుతున్నాయి. సినిమా పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొం దింది. ఈ చిత్రంలో నాగచైతన్య ఎంత మేరకు టాలెంట్‌ నిరూపించుకుంటారో అను మానంగానే ఉంది. తడాఖాలోసునీల్‌తో కలిసినటించడంతో అది ఫర్వాలే దనిపిం చింది.సింగిల్‌ హీరోగానాగచైతన్య రాణిస్తాడా లేదాఅనేది పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ చూస్తు న్న వారు వ్యాఖ్యానించడం హాట్‌ టాపిక్‌గామారింది. ప్రస్తుత నాగచైతన్య 'మనం' సినిమాలో నటిస్తున్నాడు.ఇది కాకుండా మరో సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి.

బొత్సపై భేరి


రణరంగంగా విజయనగరం బొత్స ఇంటి ముట్టడికి పలుమార్లు యత్నం

 ఉదయం నుంచి రాత్రి వరకు రాళ్ల వర్షం

 పట్టణం నుంచి పరారైన బొత్స బంధువులు, అనుచరులు

 బిక్కుబిక్కుమంటున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

 లాఠీచార్జి, బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్ల ప్రయోగం విజయనగరం, అక్టోబర్ 4 : విజయనగరం వరుసగా రెండో రోజూ రణరంగమైంది! శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నివాసం వద్ద బీభత్సకాండ కొనసాగింది! పోలీసులు లాఠీచార్జి చేసినా.. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదినా.. బాష్పవాయు గోళాలను ప్రయోగించినా.. సమైక్యవాదులు చెక్కుచెదరకపోవడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది! అయినా సమైక్యవాదులు వెనక్కి తగ్గలేదు. సత్తిబాబును, ఆయన భార్య, ఎంపీ ఝాన్సీని 'ద్రోహులు'గా అభివర్ణిస్తూ వారి ఆస్తులపై దాడులు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన జూలై 30వ తేదీ నుంచి నేటి వరకు బొత్స, ఆయన భార్య ఝాన్సీ జిల్లాలో అడుగు పెట్టలేదు. గత 65 రోజులుగా జిల్లాలో సమైక్య ఉద్యమం వారిద్దరి చుట్టూనే తిరిగింది. అయితే, రెండు నెలలుగా సమైక్య వాదులు శాంతియుతంగానే ఉద్యమిస్తున్నారు.

పలు దఫాలు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించినా.. ఆస్తుల జోలికి వెళ్లలేదు. కానీ, తెలంగాణ నోట్ ఆగమేఘాల మీద కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడం వెనక బొత్స మంత్రాంగం ఉందని జిల్లా ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. రాత్రికి రాత్రి నోట్‌ను తయారు చేయించి కేబినెట్‌లో పెట్టేలా చేశారన్న ఆరోపణలను బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో, శుక్రవారం బొత్స, ఆయన కుటుంబ సభ్యులనే ప్రధానంగా టార్గెట్ చేశారు. బొత్స, ఆయన కుటుంబ సభ్యులపై ఉద్యమ కారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణంలోని బొత్సకు చెందిన సత్య కళాశాల, ఇతర ఆస్తులపై దాడి చేశారు. సత్య కళాశాలపై విద్యార్థులు రాళ్ల దాడులు చేశారు. కళాశాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాత్రి 8 గంటల సమయంలో మరోసారి కాలేజీపై రాళ్ల వాన కురిపించారు. పలుగులు, పారలతో వెళ్లి కూల్చి వేయడానికి ప్రయత్నించారు. పోలీసు బలగాలు ఉద్యమకారులను అక్కడి నుంచి చెదరగొట్టాయి. అంతకు ముందు ఉదయం బొత్స ఇంటి వెనుకకు చేరుకుని అటునుంచి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో భయానక వాతావరణం నెలకొంది. గరివిడిలో బొత్స క్యాంపు కార్యాలయంపైనా రాళ్లు రువ్వడంతో బయట, లోపలి అద్దాలు ధ్వంసమయ్యాయి. వీటికి కొనసాగింపుగా రాత్రి ఏడు గంటల సమయంలో బొత్సకు చెందిన సత్య విజన్ కేబుల్ నెట్‌వర్క్‌పై దాడి చేశారు. స్టూడియోకు నిప్పు పెట్టారు. స్టూడియో ముందు భాగాన్ని, లోపలి భాగాన్ని ధ్వంసం చేశారు. తర్వాత లోపలి యాంటెన్నాలు, కంప్యూటర్లు, కేబుల్ వైర్లు, ఇతర ఫర్నిచర్‌ను బయటకు విసిరేసి పెట్రోలు పోసి తగలబెట్టారు. దీంతో, స్టూడియో అగ్ని కీలల్లో పూర్తిగా తగులబడిపోయింది. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్ అధికారులపైనా సమైక్యవాదులు దాడి చేశారు. ఫైరింజన్‌ను తిప్పి పంపేశారు. మరికొంతమంది తోటపాలెంలోని సత్య జూనియర్ కళాశాలలోకి దూసుకుపోయి విధ్వంసం సృష్టించారు. లోపల ఉన్న ఫర్నిచర్‌ను, రికార్డులను, ఇతర విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. జనప్రియ బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేసి మద్యం సీసాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బొత్స ఇంటి ముట్టడికి తీవ్రంగా ప్రయత్నించారు. బొత్స పేరున్న శిలా ఫలకాలను జేఎన్‌టీయూ విద్యార్థులు ధ్వంసం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో డిగ్రీ కళాశాలను ధ్వంసం చేశారు. రాత్రి పొద్దు పోయే వరకు బొత్స ఇంటి వద్ద ఆందోళనకారులు మోహరించారు. ఆయన ఆస్తులన్నిటినీ ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలతో జిల్లావ్యాప్తంగా బొత్స కుటుంబ సభ్యులతోపాటు ఆయన అనుచరులు, బంధువులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది పట్టణాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. విజయనగరంతోపాటు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భయం భయంగా కాలం గడుపుతున్నారు. బొత్స ఆస్తులపై దాడి సమయంలో ఆందోళనకారులు ముందస్తు ప్రణాళికతో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోలీసులకు, నిఘా వర్గాలకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేల సంఖ్యలో విద్యార్థులు, యువత, సమైక్యవాదులు బృందాలుగా విడిపోయారు.