అసలే ఆటుపాట్లు ఎదుర్కొంటూ ఈ మధ్యనే ముందుకు సాగిన ఆటోనగర్ సూర్యకు మరోసారి గండిపడేట్లు ఉంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు సినిమాకు కలిసిరావడంలేదని తెలుస్తోంది. ఫైనాన్స్ ప్రాబ్లంవల్ల ఆగిపోయిన సినిమాను మళ్ళీ వెంకట్ ముందుకు తెచ్చాడు. కొంత ప్యాచ్‌వర్క్‌ను పూర్తి చేస్తున్నాడు. మొదట అనుకున్నట్లు దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు అది కూడ అనుమానంగా ఉంది. పోస్టుప్రొడక్షన్స్కార్యక్రమాలు మంద కొండిగా సాగుతున్నాయి. సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్గా రూపొం దింది. ఈ చిత్రంలో నాగచైతన్య ఎంత మేరకు టాలెంట్ నిరూపించుకుంటారో అను మానంగానే ఉంది. తడాఖాలోసునీల్తో కలిసినటించడంతో అది ఫర్వాలే దనిపిం చింది.సింగిల్ హీరోగానాగచైతన్య రాణిస్తాడా లేదాఅనేది పోస్ట్ ప్రొడక్షన్స్ చూస్తు న్న వారు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గామారింది. ప్రస్తుత నాగచైతన్య 'మనం' సినిమాలో నటిస్తున్నాడు.ఇది కాకుండా మరో సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి.
Friday, 4 October 2013
ఆటోనగర్ సూర్యకూ దెబ్బే!
అసలే ఆటుపాట్లు ఎదుర్కొంటూ ఈ మధ్యనే ముందుకు సాగిన ఆటోనగర్ సూర్యకు మరోసారి గండిపడేట్లు ఉంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు సినిమాకు కలిసిరావడంలేదని తెలుస్తోంది. ఫైనాన్స్ ప్రాబ్లంవల్ల ఆగిపోయిన సినిమాను మళ్ళీ వెంకట్ ముందుకు తెచ్చాడు. కొంత ప్యాచ్‌వర్క్‌ను పూర్తి చేస్తున్నాడు. మొదట అనుకున్నట్లు దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు అది కూడ అనుమానంగా ఉంది. పోస్టుప్రొడక్షన్స్కార్యక్రమాలు మంద కొండిగా సాగుతున్నాయి. సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్గా రూపొం దింది. ఈ చిత్రంలో నాగచైతన్య ఎంత మేరకు టాలెంట్ నిరూపించుకుంటారో అను మానంగానే ఉంది. తడాఖాలోసునీల్తో కలిసినటించడంతో అది ఫర్వాలే దనిపిం చింది.సింగిల్ హీరోగానాగచైతన్య రాణిస్తాడా లేదాఅనేది పోస్ట్ ప్రొడక్షన్స్ చూస్తు న్న వారు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గామారింది. ప్రస్తుత నాగచైతన్య 'మనం' సినిమాలో నటిస్తున్నాడు.ఇది కాకుండా మరో సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి.
బొత్సపై భేరి
రణరంగంగా విజయనగరం
బొత్స ఇంటి ముట్టడికి పలుమార్లు యత్నంఉదయం నుంచి రాత్రి వరకు రాళ్ల వర్షం
పట్టణం నుంచి పరారైన బొత్స బంధువులు, అనుచరులు
బిక్కుబిక్కుమంటున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
లాఠీచార్జి, బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్ల ప్రయోగం విజయనగరం, అక్టోబర్ 4 : విజయనగరం వరుసగా రెండో రోజూ రణరంగమైంది! శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నివాసం వద్ద బీభత్సకాండ కొనసాగింది! పోలీసులు లాఠీచార్జి చేసినా.. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదినా.. బాష్పవాయు గోళాలను ప్రయోగించినా.. సమైక్యవాదులు చెక్కుచెదరకపోవడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది! అయినా సమైక్యవాదులు వెనక్కి తగ్గలేదు. సత్తిబాబును, ఆయన భార్య, ఎంపీ ఝాన్సీని 'ద్రోహులు'గా అభివర్ణిస్తూ వారి ఆస్తులపై దాడులు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన జూలై 30వ తేదీ నుంచి నేటి వరకు బొత్స, ఆయన భార్య ఝాన్సీ జిల్లాలో అడుగు పెట్టలేదు. గత 65 రోజులుగా జిల్లాలో సమైక్య ఉద్యమం వారిద్దరి చుట్టూనే తిరిగింది. అయితే, రెండు నెలలుగా సమైక్య వాదులు శాంతియుతంగానే ఉద్యమిస్తున్నారు.
పలు దఫాలు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించినా.. ఆస్తుల జోలికి వెళ్లలేదు. కానీ, తెలంగాణ నోట్ ఆగమేఘాల మీద కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడం వెనక బొత్స మంత్రాంగం ఉందని జిల్లా ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. రాత్రికి రాత్రి నోట్‌ను తయారు చేయించి కేబినెట్లో పెట్టేలా చేశారన్న ఆరోపణలను బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో, శుక్రవారం బొత్స, ఆయన కుటుంబ సభ్యులనే ప్రధానంగా టార్గెట్ చేశారు. బొత్స, ఆయన కుటుంబ సభ్యులపై ఉద్యమ కారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణంలోని బొత్సకు చెందిన సత్య కళాశాల, ఇతర ఆస్తులపై దాడి చేశారు. సత్య కళాశాలపై విద్యార్థులు రాళ్ల దాడులు చేశారు. కళాశాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాత్రి 8 గంటల సమయంలో మరోసారి కాలేజీపై రాళ్ల వాన కురిపించారు. పలుగులు, పారలతో వెళ్లి కూల్చి వేయడానికి ప్రయత్నించారు. పోలీసు బలగాలు ఉద్యమకారులను అక్కడి నుంచి చెదరగొట్టాయి. అంతకు ముందు ఉదయం బొత్స ఇంటి వెనుకకు చేరుకుని అటునుంచి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో భయానక వాతావరణం నెలకొంది. గరివిడిలో బొత్స క్యాంపు కార్యాలయంపైనా రాళ్లు రువ్వడంతో బయట, లోపలి అద్దాలు ధ్వంసమయ్యాయి. వీటికి కొనసాగింపుగా రాత్రి ఏడు గంటల సమయంలో బొత్సకు చెందిన సత్య విజన్ కేబుల్ నెట్‌వర్క్‌పై దాడి చేశారు. స్టూడియోకు నిప్పు పెట్టారు. స్టూడియో ముందు భాగాన్ని, లోపలి భాగాన్ని ధ్వంసం చేశారు. తర్వాత లోపలి యాంటెన్నాలు, కంప్యూటర్లు, కేబుల్ వైర్లు, ఇతర ఫర్నిచర్‌ను బయటకు విసిరేసి పెట్రోలు పోసి తగలబెట్టారు. దీంతో, స్టూడియో అగ్ని కీలల్లో పూర్తిగా తగులబడిపోయింది. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్ అధికారులపైనా సమైక్యవాదులు దాడి చేశారు. ఫైరింజన్‌ను తిప్పి పంపేశారు. మరికొంతమంది తోటపాలెంలోని సత్య జూనియర్ కళాశాలలోకి దూసుకుపోయి విధ్వంసం సృష్టించారు. లోపల ఉన్న ఫర్నిచర్‌ను, రికార్డులను, ఇతర విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. జనప్రియ బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేసి మద్యం సీసాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బొత్స ఇంటి ముట్టడికి తీవ్రంగా ప్రయత్నించారు. బొత్స పేరున్న శిలా ఫలకాలను జేఎన్టీయూ విద్యార్థులు ధ్వంసం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో డిగ్రీ కళాశాలను ధ్వంసం చేశారు. రాత్రి పొద్దు పోయే వరకు బొత్స ఇంటి వద్ద ఆందోళనకారులు మోహరించారు. ఆయన ఆస్తులన్నిటినీ ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలతో జిల్లావ్యాప్తంగా బొత్స కుటుంబ సభ్యులతోపాటు ఆయన అనుచరులు, బంధువులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది పట్టణాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. విజయనగరంతోపాటు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భయం భయంగా కాలం గడుపుతున్నారు. బొత్స ఆస్తులపై దాడి సమయంలో ఆందోళనకారులు ముందస్తు ప్రణాళికతో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోలీసులకు, నిఘా వర్గాలకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేల సంఖ్యలో విద్యార్థులు, యువత, సమైక్యవాదులు బృందాలుగా విడిపోయారు.
మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రియా ఆనంద్ రొమాన్స్!
లీడర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ప్రియా ఆనంద్. పిల్ల బాగానే ఉంటుంది. చక్కగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది. దాంతో రామరామ కృష్ణకృష్ణ సినిమాలో రామ్ సరసన చోటు దక్కింది. కానీ టాలీవుడ్లో శాశ్వత స్థానం మాత్రం దక్కలేదు. అందుకే అదృష్టాన్ని వెతుక్కుంటూ బాలీవుడ్ వరకూ వెళ్లింది. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంతో మంచి మార్కులు సంపాదించి, అక్కడ కొన్ని అవకాశాలు కొట్టేసింది. మెల్లగా తమిళుల కంట్లో కూడా పడింది.పెదిర్ నిశ్చల్ సినిమాతో తమిళంలో హిట్ కొట్టింది ప్రియ. ఆమె నటన అక్కడి వాళ్లకు నచ్చడంతో వెంటనే వణక్కమ్ చెన్నై అనే చిత్రంలో చాన్స్ దొరికింది. దీనితో పాటు పెన్సిల్ అనే సినిమాలో కూడా బుక్కయ్యింది ప్రియ. ఇందులో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ హీరోగా నటించనున్నాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి చిత్రాల ద్వారా ప్రకాశ్ మనకు పరిచితుడే. మ్యుజీషియన్ గా ప్రూవ్ చేసుకున్న ఇతగాడు హీరోగా కూడా రాణించాలని ఆశపడుతున్నాడు. అందుకే పెన్సిల్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు.
అతడి సరసన ప్రియ అందాలు ఒలికించనుంది. ఓ మంచి మ్యూజిక్ కమ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో తన రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటోందని చెబుతోంది ప్రియ. అయితే ఈమెకి ఓ అసంతృప్తి మిగిలేవుంది. హిందీ వాళ్లకు మెచ్చారు. తమిళులు పిలిచి చాన్స్ ఇచ్చారు. కానీ తాను ఎంట్రీ ఇచ్చిన తెలుగు సీమ మాత్రం తనను పట్టించుకోవడం లేదని కాస్త ఫీలవుతోంది ప్రియ. మరి మనవాళ్లెవరైనా ఈ ముద్దుగుమ్మ బాధను తీర్చడానికి ముందుకొస్తారో లేదో!
పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..
మీడియా ముందుకురాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా కెరియర్ లో తొలిసారిగా తన ‘అత్తారింటి’ సినిమాకు థాంక్స్ మీట్ పెట్టాలనుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల అక్టోబర్ 6 ఆదివారం హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో ఈ సక్సెస్ మీట్ అత్యంత భారీ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో పరిస్ధితులు ఒక్కసారిగా మారటంతో దాన్ని కేన్సిల్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది .ఈ కార్యక్రమంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది అని అంటున్నారు. పూర్తి వివరాలు రేపటిరోజున తెలియనున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో విడుదలైన ఈచిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైనా సూపర్ హిట్ టాక్ సాధించి టాలీవుడ్ రికార్డులను క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కోస్తా ఆంధ్ర ప్రాంతం అట్టుడికి పోతూ ఉంటే సక్సెస్ మీట్లు పెట్టుకుని హడావిడి చేయడం తనకు మనస్కరిమ్చడం లేదని పవన్ అభిప్రాయపడుతూ ఉండటంతో ‘అత్తారింటి’ ఫిలిం యూనిట్ ఈ సక్సస్ మీట్ పై ఒకటికి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని భావిస్తోందని ఫిలింనగర్ టాక్. ఈ వార్తే నిజం అయితే ఎంతో ఆశగా చూస్తున్న పవన్ అభిమానులకు నిరాశే..
విభజన నోట్ ఆమోదంపై హైకోర్టులో పిల్
హైదరాబాద్, అక్టోబర్ 4 : రాష్ట్ర విభజన నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని న్యాయవాది పీవీ క్రిష్ణయ్య దాఖలు చేశారు. పిటిషన్లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ప్రధాన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) తోపాటు అన్ని రాజకీయ పార్టీలను, తెలంగాణా పొలిటికల్ జేఏసీ, టీఎన్జీవోల సంఘం, ఏపీఎన్జీవోల సంఘం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావులను ప్రతివాదులుగా చేర్చారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని అనుసరించి రాష్ట్ర విభజనకు ముందుకు వెళ్లరాదని కోరారు. అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ సమావేశంలో టేబుల్ ఐటమ్ గా విభజన నోటను ఆమోదం చెల్లదని పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్టికల్ 3లోని పార్ట్ 3 రాజ్యాంగ మౌళిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని, 5వ రాజ్యాంగ సవరణ (1955)లో విభజన బిల్లుపై శాసనసభ అభిప్రాయానికి పంపినపుడు నిర్ణీత గడువు విధించారని, సవరణకు ముందు ఆర్టికల్ 3లో ఈ అంశం లేదని, ఈ రెండు అంశాలు రాజ్యాంగ మౌళిక సూత్రాలకు, ప్రియాంబుల్కు వ్యతిరేకంగా ఉన్నాయని వీటిని కొట్టి వేయాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్టికల్ 371(డి) కింద ప్రత్యేక ఏర్పాటు ్ల ఉన్నాయని, దీనిని ప్రకారమే రాష్ట్రంలో విద్యా, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు, స్థానిక రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఆర్టికల్ 371(డి) అమలులో ఉన్నంత కాలం రాష్ట్ర విభజన చేయరాదని, దీనిని సవరించే వరకు విభజన ప్రక్రియను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ప్రస్తుత రాష్ట్రపతి గతంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారని, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాష్ట్ర అంశాలపై ఆయనకు సబందం ఉందని, ప్రస్తుతం ఆయనే రాష్ట్ర పతిగా ఉన్నందున ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి ఆయన తుది నిర్ణయం తీసుకోరాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోలు ఎవరైనా సరే రాష్ట్ర విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ధర్నాలు, బంద్‌లు చేయకుండా నిరోధించాలని పిటిషన్లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
మా ఇళ్లపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు: బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం నిరాశ కలిగించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయ కోణంలో కాంగ్రెస్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోదని తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉంటుందని అంగీకరించారు. మినిస్టర్స్ క్వార్టర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధిష్టానం మాట వినకపోయినప్పటికీ తమ ప్రాంత ప్రజల మనోభావాలను హైకమాండ్ కు తెలియజేశామన్నారు.సమస్య వచ్చిందని పారిపోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చంద్రబాబు ఎక్కడా అనలేదని బొత్స తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలని టీడీపీ, వైఎస్సార్ సీపీ కోరాయని చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ సమైక్యాంధ్రకే మద్దతు పలికారని అన్నారు. తమ ప్రాంత ప్రజల ఆవేదనను కేంద్రానికి తెలిపామన్నారు. హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. పదవులు పట్టుకుని వేలాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని నిర్ణయించామన్నారు.
ఫ్లాష్ .. ఫ్లాష్ .. ఫ్లాష్ ..మళ్ళీ జగన్ నిరవదిక నిరాహారదీక్ష ..
రాష్ట్ర విభజన పై కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని నిరశిస్తూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్ మోహన రెడ్డి రేపటి నుంచి హైదరాబాద్ లో తన వై.ఎస్. ఆర్. కాంగ్రెస్ ఆఫీసుకు ఎదురుగా నిరవదిక నిరాహారదీక్ష ప్రారంభిస్తున్నానని కొద్ది నిముషాల క్రితం జగన్ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఎసంబ్లీ సమావేశంలో తీర్మానం ఆమోదింప పడకుండా రాష్ట్రాన్ని విభజించిన ప్రభుత్వంగా కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు కేక్కుతుందనీ పేర్కొంటూ, పదేళ్ళలో సీమద్రులను హైద్రాబాద్ లాంటి మహా నగరాన్ని రాజధానిగా కోస్తా ప్రాంతంలో కట్టుకోండి అంటూ కేంద్ర కాంగ్రెస్ పెద్దలు అంటున్న మాటలు వింటూ ఉంటే తనకు ఒక పెద్ద జోక్ విన్నట్లు అనిపిస్తోందని అంటున్నారు.భవిష్యత్తులో ఈ రాష్ట్ర విభజన వల్ల కోస్తా తెలంగాణా ప్రాంతాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతాయని అంటు ప్రస్తుతపరిస్తుతులను చూస్తూ విధి లేక నిరవధిక నిరాహార దీక్షకు వెడుతున్నానని ప్రకటించిన జగన్ ప్రకటన సమైఖ్యాంధ్ర ఉద్యమానికి ఎటువంటి టర్నింగ్ ఇస్తుందో చూడాలి.
పవన్ ‘అత్తారిల్లు’ ఆశలు ఆవిరి అయిపోయాయ!!
నిన్నటితో ముగిసిన మొదటి వారంతో పవన్ ‘అత్తారిల్లు’ ప్రపంచ వ్యాప్తంగా 51 కోట్లు వసూలు చేసి రెండవ వారంలో కూడా ఇదే జోరు కొనసాగించి టాలీవుడ్ హైయస్ట్ గ్రాసర్ గా రికార్డులు క్రియేట్ చేస్తుంది అని పవన్ అభిమానులతో పాటు ఈ సినిమాను కొనుకున్న బయ్యర్ల పై నిన్నటి కేబినెట్ సమావేశంలో వచ్చిన తెలంగాణా నోట్ నీళ్ళు జల్లిందీ అని అంటున్నారు. కోస్తా, ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాలన్నీ 72 గంటల బందుతో నిప్పుల కొలిమిలా వేడెక్కిపోతు ఉంటే ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ఏ సినిమా ఆడలేని పరిస్తులలో ధియేటర్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలలోని దియేటర్లు అన్నీ కూడా ఇప్పటికే తమ షోలు అన్నీ రద్దు చేసుకున్నాయని తెలుస్తోంది.ఈ బందుల వేడి తగ్గి వచ్చే వారం ప్రారంభానికి కానీ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థుతులు వచ్చేలా కనిపించడంలేదు. ఉద్యమ కారులు అయితే మాత్రం ఈ బందుల కార్యక్రమాన్ని మరింత ఉదృతంగా చేసి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని ఆవేశంగా ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో ఈ ప్రాంతాలలోని ధియేటర్లు మళ్ళీ సజావుగా తమ షోలను ఎప్పుడు ప్రదర్సించ గలుగుతాయో అన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ పరిస్థుతులు ఇలాగె కొనసాగితే పవన్ అత్తారిల్లు ‘మగధీర’, ‘దూకుడు’ సినిమాల రికార్డులను క్రాస్ చేసే శక్తి ఉంది కూడా అవకాశాన్ని పొందలేకపోతుంది అనే మాటలు ఫిలింనగర్ లో విపిస్తున్నాయి ఎదిఎమైనా ఈ విషయం పై క్లారిటీ రావాలీ అంటే వచ్చే వారం వరకు ఆగాలి...
Subscribe to:
Posts (Atom)