Friday, 4 October 2013

మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రియా ఆనంద్ రొమాన్స్!


లీడర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ప్రియా ఆనంద్. పిల్ల బాగానే ఉంటుంది. చక్కగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది. దాంతో రామరామ కృష్ణకృష్ణ సినిమాలో రామ్ సరసన చోటు దక్కింది. కానీ టాలీవుడ్లో శాశ్వత స్థానం మాత్రం దక్కలేదు. అందుకే అదృష్టాన్ని వెతుక్కుంటూ బాలీవుడ్ వరకూ వెళ్లింది. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంతో మంచి మార్కులు సంపాదించి, అక్కడ కొన్ని అవకాశాలు కొట్టేసింది. మెల్లగా తమిళుల కంట్లో కూడా పడింది.

 పెదిర్ నిశ్చల్ సినిమాతో తమిళంలో హిట్ కొట్టింది ప్రియ. ఆమె నటన అక్కడి వాళ్లకు నచ్చడంతో వెంటనే వణక్కమ్ చెన్నై అనే చిత్రంలో చాన్స్ దొరికింది. దీనితో పాటు పెన్సిల్ అనే సినిమాలో కూడా బుక్కయ్యింది ప్రియ. ఇందులో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ హీరోగా నటించనున్నాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి చిత్రాల ద్వారా ప్రకాశ్ మనకు పరిచితుడే. మ్యుజీషియన్ గా ప్రూవ్ చేసుకున్న ఇతగాడు హీరోగా కూడా రాణించాలని ఆశపడుతున్నాడు. అందుకే పెన్సిల్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు.

అతడి సరసన ప్రియ అందాలు ఒలికించనుంది. ఓ మంచి మ్యూజిక్ కమ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో తన రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటోందని చెబుతోంది ప్రియ. అయితే ఈమెకి ఓ అసంతృప్తి మిగిలేవుంది. హిందీ వాళ్లకు మెచ్చారు. తమిళులు పిలిచి చాన్స్ ఇచ్చారు. కానీ తాను ఎంట్రీ ఇచ్చిన తెలుగు సీమ మాత్రం తనను పట్టించుకోవడం లేదని కాస్త ఫీలవుతోంది ప్రియ. మరి మనవాళ్లెవరైనా ఈ ముద్దుగుమ్మ బాధను తీర్చడానికి ముందుకొస్తారో లేదో!

పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..


మీడియా ముందుకురాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా కెరియర్ లో తొలిసారిగా తన ‘అత్తారింటి’ సినిమాకు థాంక్స్ మీట్ పెట్టాలనుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల అక్టోబర్ 6 ఆదివారం హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో ఈ సక్సెస్ మీట్ అత్యంత భారీ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో పరిస్ధితులు ఒక్కసారిగా మారటంతో దాన్ని కేన్సిల్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది .

 ఈ కార్యక్రమంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది అని అంటున్నారు. పూర్తి వివరాలు రేపటిరోజున తెలియనున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో విడుదలైన ఈచిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైనా సూపర్ హిట్ టాక్ సాధించి టాలీవుడ్ రికార్డులను క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కోస్తా ఆంధ్ర ప్రాంతం అట్టుడికి పోతూ ఉంటే సక్సెస్ మీట్లు పెట్టుకుని హడావిడి చేయడం తనకు మనస్కరిమ్చడం లేదని పవన్ అభిప్రాయపడుతూ ఉండటంతో ‘అత్తారింటి’ ఫిలిం యూనిట్ ఈ సక్సస్ మీట్ పై ఒకటికి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని భావిస్తోందని ఫిలింనగర్ టాక్. ఈ వార్తే నిజం అయితే ఎంతో ఆశగా చూస్తున్న పవన్ అభిమానులకు నిరాశే..

విభజన నోట్ ఆమోదంపై హైకోర్టులో పిల్


హైదరాబాద్, అక్టోబర్ 4 : రాష్ట్ర విభజన నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని న్యాయవాది పీవీ క్రిష్ణయ్య దాఖలు చేశారు. పిటిషన్‌లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ప్రధాన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) తోపాటు అన్ని రాజకీయ పార్టీలను, తెలంగాణా పొలిటికల్ జేఏసీ, టీఎన్జీవోల సంఘం, ఏపీఎన్జీవోల సంఘం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావులను ప్రతివాదులుగా చేర్చారు.

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని అనుసరించి రాష్ట్ర విభజనకు ముందుకు వెళ్లరాదని కోరారు. అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ సమావేశంలో టేబుల్ ఐటమ్ గా విభజన నోటను ఆమోదం చెల్లదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్టికల్ 3లోని పార్ట్ 3 రాజ్యాంగ మౌళిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని, 5వ రాజ్యాంగ సవరణ (1955)లో విభజన బిల్లుపై శాసనసభ అభిప్రాయానికి పంపినపుడు నిర్ణీత గడువు విధించారని, సవరణకు ముందు ఆర్టికల్ 3లో ఈ అంశం లేదని, ఈ రెండు అంశాలు రాజ్యాంగ మౌళిక సూత్రాలకు, ప్రియాంబుల్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని వీటిని కొట్టి వేయాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్టికల్ 371(డి) కింద ప్రత్యేక ఏర్పాటు ్ల ఉన్నాయని, దీనిని ప్రకారమే రాష్ట్రంలో విద్యా, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు, స్థానిక రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఆర్టికల్ 371(డి) అమలులో ఉన్నంత కాలం రాష్ట్ర విభజన చేయరాదని, దీనిని సవరించే వరకు విభజన ప్రక్రియను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ప్రస్తుత రాష్ట్రపతి గతంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారని, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాష్ట్ర అంశాలపై ఆయనకు సబందం ఉందని, ప్రస్తుతం ఆయనే రాష్ట్ర పతిగా ఉన్నందున ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి ఆయన తుది నిర్ణయం తీసుకోరాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోలు ఎవరైనా సరే రాష్ట్ర విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ధర్నాలు, బంద్‌లు చేయకుండా నిరోధించాలని పిటిషన్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

మా ఇళ్లపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు: బొత్స


హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం నిరాశ కలిగించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయ కోణంలో కాంగ్రెస్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోదని తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉంటుందని అంగీకరించారు. మినిస్టర్స్ క్వార్టర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధిష్టానం మాట వినకపోయినప్పటికీ తమ ప్రాంత ప్రజల మనోభావాలను హైకమాండ్ కు తెలియజేశామన్నారు.

సమస్య వచ్చిందని పారిపోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చంద్రబాబు ఎక్కడా అనలేదని బొత్స తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలని టీడీపీ, వైఎస్సార్ సీపీ కోరాయని చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ సమైక్యాంధ్రకే మద్దతు పలికారని అన్నారు. తమ ప్రాంత ప్రజల ఆవేదనను కేంద్రానికి తెలిపామన్నారు. హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. పదవులు పట్టుకుని వేలాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని నిర్ణయించామన్నారు.

ఫ్లాష్ .. ఫ్లాష్ .. ఫ్లాష్ ..మళ్ళీ జగన్ నిరవదిక నిరాహారదీక్ష ..


రాష్ట్ర విభజన పై కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని నిరశిస్తూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్ మోహన రెడ్డి రేపటి నుంచి హైదరాబాద్ లో తన వై.ఎస్. ఆర్. కాంగ్రెస్ ఆఫీసుకు ఎదురుగా నిరవదిక నిరాహారదీక్ష ప్రారంభిస్తున్నానని కొద్ది నిముషాల క్రితం జగన్ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఎసంబ్లీ సమావేశంలో తీర్మానం ఆమోదింప పడకుండా రాష్ట్రాన్ని విభజించిన ప్రభుత్వంగా కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు కేక్కుతుందనీ పేర్కొంటూ, పదేళ్ళలో సీమద్రులను హైద్రాబాద్ లాంటి మహా నగరాన్ని రాజధానిగా కోస్తా ప్రాంతంలో కట్టుకోండి అంటూ కేంద్ర కాంగ్రెస్ పెద్దలు అంటున్న మాటలు వింటూ ఉంటే తనకు ఒక పెద్ద జోక్ విన్నట్లు అనిపిస్తోందని అంటున్నారు.

 భవిష్యత్తులో ఈ రాష్ట్ర విభజన వల్ల కోస్తా తెలంగాణా ప్రాంతాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతాయని అంటు ప్రస్తుతపరిస్తుతులను చూస్తూ విధి లేక నిరవధిక నిరాహార దీక్షకు వెడుతున్నానని ప్రకటించిన జగన్ ప్రకటన సమైఖ్యాంధ్ర ఉద్యమానికి ఎటువంటి టర్నింగ్ ఇస్తుందో చూడాలి.

పవన్ ‘అత్తారిల్లు’ ఆశలు ఆవిరి అయిపోయాయ!!


నిన్నటితో ముగిసిన మొదటి వారంతో పవన్ ‘అత్తారిల్లు’ ప్రపంచ వ్యాప్తంగా 51 కోట్లు వసూలు చేసి రెండవ వారంలో కూడా ఇదే జోరు కొనసాగించి టాలీవుడ్ హైయస్ట్ గ్రాసర్ గా రికార్డులు క్రియేట్ చేస్తుంది అని పవన్ అభిమానులతో పాటు ఈ సినిమాను కొనుకున్న బయ్యర్ల పై నిన్నటి కేబినెట్ సమావేశంలో వచ్చిన తెలంగాణా నోట్ నీళ్ళు జల్లిందీ అని అంటున్నారు. కోస్తా, ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాలన్నీ 72 గంటల బందుతో నిప్పుల కొలిమిలా వేడెక్కిపోతు ఉంటే ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ఏ సినిమా ఆడలేని పరిస్తులలో ధియేటర్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలలోని దియేటర్లు అన్నీ కూడా ఇప్పటికే తమ షోలు అన్నీ రద్దు చేసుకున్నాయని తెలుస్తోంది.

 ఈ బందుల వేడి తగ్గి వచ్చే వారం ప్రారంభానికి కానీ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థుతులు వచ్చేలా కనిపించడంలేదు. ఉద్యమ కారులు అయితే మాత్రం ఈ బందుల కార్యక్రమాన్ని మరింత ఉదృతంగా చేసి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని ఆవేశంగా ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో ఈ ప్రాంతాలలోని ధియేటర్లు మళ్ళీ సజావుగా తమ షోలను ఎప్పుడు ప్రదర్సించ గలుగుతాయో అన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ పరిస్థుతులు ఇలాగె కొనసాగితే పవన్ అత్తారిల్లు ‘మగధీర’, ‘దూకుడు’ సినిమాల రికార్డులను క్రాస్ చేసే శక్తి ఉంది కూడా అవకాశాన్ని పొందలేకపోతుంది అనే మాటలు ఫిలింనగర్ లో విపిస్తున్నాయి ఎదిఎమైనా ఈ విషయం పై క్లారిటీ రావాలీ అంటే వచ్చే వారం వరకు ఆగాలి...

నితిన్ ఏం చేస్తున్నాడంటే ?



నితిన్ ప‌ట్టరాని ఆనందంలో ఉన్నాడు. అత్తారింటికిదారేది మూవీ క‌లెక్షన్స్ నైజాంలో విజృంభిస్తుంటే, త‌ను పెట్టిన మ‌నీ కంటే కంటే లాభాల్లో మూవీ ప‌రుగులు పెడుతుంది. దీని కార‌ణంగా నితిన్‌కు పెద్ద టెన్షన్ త‌ప్పింద‌ని టాలీవుడ్ చెబుతుంది. ఎట్‌ప్రెజెండ్ నితిన్ స్పెయిన్ షెడ్యూల్‌లో ఉన్నాడు. మొత్తం 55 రోజుల లాంగ్ షెడ్యూల్ ఇక్కడ జ‌రుగుతుంది. హార్ట్ ఎటాక్ మూవీను పూరీజ‌గ‌న్నాధ్ ప్రత్యేక శ్రధ్ధతో తెర‌కెక్కిస్తున్నాడు. పెద్ద హీరోల‌తో స‌క్సెస్ కొడితే ఆ క్రెడిట్ హీరోకు ద‌క్కుతుందో, ద‌ర్శకుడికి ద‌క్కుతుందో అర్ధంకాదు. ఈ మ‌ధ్య కాలంలో పూరీ జ‌గ‌న్నాధ్ మూవీలు అన్ని యావ‌రేజ్‌గా బాక్సాపీస్ వ‌ద్ద బండి లాగేస్తున్నాయి.

 అందుకే నితిన్‌తో బ్లాక్ బ‌స్టర్ కొట్టి ఆ స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకోవాల‌ని రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ద్వారా ఆద శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు పరిచయం కానుంది. నితిన్ గ‌త చిత్రాల కంటే ఈ మూవీలో మ‌రింత స్టైలిష్‌గా క‌నిపించ‌నున్నాడు. అందుకోసం డిజైన‌ర్ నీర‌జ కోన ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటుంది. మొత్తానికి నితిన్, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై పెట్టిన పెట్టుబ‌డి లాభాల‌ను తెచ్చిపెడుతుంటే నితిన్ ఏ టెన్షన్ లేకుండా హార్ట్ఎటాక్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

ఇంకా.. ఆడ్డుకొంటామంటున్న వాళ్లు జోకర్లే..!


" 2014 వరకు తెలంగాణ రాష్ట్రం రాదన్న వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. విభజన నిర్ణయం అమలు కాకుండా ఉండేందుకు ఏం చేయాలి ? ఎలా ముందుకు వెళ్లాలి ? అన్న విషయంలో నా వద్ద చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇక ఇప్పుడు వీటిని అమలు చేస్తా. పార్టీలో ఉంటే వీటిని అమలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచనతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశాను...'' అని అన్నాడు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

కేవలం అరుణ్ కుమార్ మాత్రమే కాదు.. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఇదే మాట మాట్లాడుతున్నారు. వీళ్లు రాష్ట్ర విభజన జరుగుతుందని ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. తెలంగాణ నోట్ ను క్యాబినెట్ ఆమోదించినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ఏర్పడదు.. రాష్ట్రం విడిపోదు. దానికి ముందు ముందు చాలా జరగాల్సి ఉంది... అంటున్నారు వీళ్లు. అయితే వీళ్లను జోకర్లుగా అభివర్ణిస్తున్నారు సీమాంధ్ర ప్రజలు. విభజన విషయంలో వీరు సీమాంధ్ర ద్రోహులుగా నిలిచిన వీళ్లు ఇప్పుడు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు అని సమైక్యవాదులు మండిపడుతున్నారు. ఓవరాల్ గా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి.