Tuesday, 1 October 2013

వ్యభిచారానికి పాల్పడుతూ అడ్డంగా బుక్కయిన నటి, మరో ప్రముఖుడు


వెండి తెరపై నటీమణుల బతుకులు నిజజీవితంలో చీకటి బతుకులే అనడాన్ని తాజా సంఘటన రుజువుచేసింది. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ కు సమీపంలోని ఆ విలాసవంతమైన భవనంలో ప్రస్తుతం టీవి సీరియళ్లలో నటిస్తున్న ఓ నటి ప్రముఖ పారిశ్రామిక వేత్త తో వ్యభిచరిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది, ఈరాకెట్ నడిపిస్తున్న సూత్రదారుడు మధుకు టివి రంగంతోనే కాకుండా టాలీవుడ్ తో కూడా మంచి సంబందాలు ఉండడంతో సినిమా రంగంలోని వారితో కూడా ఈ వ్యభిచార రాకెట్ నడిపిస్తున్నారన్న వార్తలకు బలం చేకూరుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 ఈదిశగా విచారణ ప్రారంభించామని ఓఎస్డీ కే.గోవర్దన్ రెడ్డి తెలిపారు. తాజాగా మాదాపూర్ లోని ఫార్చ్యూస్ టవర్స్ లోని 203 ఫ్లాట్ లో గుంటూరు జిల్లాకు చెందన నటితో జీడిమెట్లకు చెందిన జయరాజా స్టీల్స్ అధినేత సజ్జన్ కుమార్ గోయల్ రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయారు. అయితే ఇక్కడ టివి, సినిమాల్లోని జూనియర్ ఆర్టిస్టులతో గత కొంత కాలంగా వ్యభిచారం నడుస్తోందని పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు మధు పరారీలో ఉన్నాడు.

సమైక్యఉద్యమాన్ని గాలిలో కలిపేసిన ప్రధాని


ఎవరినోట తెలంగాణ మాట వస్తే అది నిజమని నమ్మాలని హైకోర్టు సైతం ఉద్యోగుల సమ్మె విషయంలో వాఖ్యానించిందో, అదే నోట తెలంగాణ మాట వచ్చేసింది. దీంతో ఇక తెలంగాణ ఏర్పాటు తప్పదన్న విషయం స్పష్టమైనట్టే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. విదేశీ పర్యటన ముగించుకుని ఇండియాకు వస్తూ ఆకాశంలో గాల్లో తేలుతూ విమానంలోనే నోరు విప్పి సమైక్యవాదుల ఆశలను గాల్లోనే కలిపేసారు ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్.

ఇప్పడు కేంద్రం, తన ముందు ఉన్న అంశాల్లో తెలంగాణనే ప్రధానమన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను హోమంత్రి షిండే చూస్తున్నారని, అది ఎంత దాకా వచ్చిందో తెలియదని, వెల్లిన మరుక్షణం షిండేతో మాట్లాడి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎక్కడిదాకా వచ్చిందో కనుక్కుంటానని మీడియా కు చెప్పాడు ప్రధాని. దీంతో ఇది ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటన, ఇది కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అని వాదిస్తున్న వారికి షాకిచ్చినట్టే.

ఎందుకంటే ప్రధాని ఏకంగా ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆయన ప్రధాని హోదాలో విదేశాలకు వెల్లి అదే హోదాలో తిరిగి వస్తూ మాట్లాడిన మాటలివి. అంతే కాదు ఆయన అన్నది కూడా నాముందున్న వాటిలో తెలంగాణే ప్రదానమైనది అన్నారు. అంటే ప్రభుత్వ పరంగా ఆ ప్రక్రియ మొదలయినట్టే అంటున్నారు. అందుకే సమైక్య ఉద్యమం ఎంత చేసినా సరే అది గాలిలో కలిసినట్టేనన్న సంకేతాలు జారీ అయ్యాయన్న వాదన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.

విలువలకు నిలువెత్తు అద్దం మహాత్మాగాంధీ... (స్పెషల్ ఆర్టికల్)


‘గాంధీజీ బోధనలే నాకు స్పూర్తి. ఆయన లేకపోతే నేను అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచం ముందు నిలబడి ఉండేవాణ్ణి కాదు’ అన్న మాటలు ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచాన్ని సాసిస్తున్న బరాక్ ఒబామా అన్న మాటలు. ఎటువంటి ఆకర్షణీయమైన రూపురేఖలు లేకుండా కొల్లాయి కట్టుకొని చేత కర్రతో కాలినడకన నడుస్తూ అతి సామాన్యమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి, రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించడమే కాకుండా అనేక భాషలతో, అనేక మతాలతో, ఇంకా అనేక సంస్కృతులతో అప్పటికే ముక్కలు ముక్కలు అయిపోయిన భారతదేశాన్ని ఒకతాటి పై తీసుకువచ్చి, స్వతంత్ర ఉద్యమ సారధిగా కోటానుకోట్ల భారతీయుల అభిమానాన్ని పొంది, భారతాజన హృదయాలలో జాతి పిత గా వెలుగొందిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ఈ పుణ్య భారతావని లో పుట్టి ఇప్పటికీ 144 సంవత్సరాలు గడచిపోయాయి. గాంధీ జయంతి నాడు మాత్రమే గుర్తుకు తెచ్చుకొనే గాంధీ పేరును ఆయన బొమ్మ కరెన్సీ నోట్లపై లేకుండా ఉండి ఉంటే ఈపాటికే మన 120 కోట్ల మంది భారతీయులు మన పూజ్య బాపూజీ ని మరచిపోయి ఉండేవారేమో.


 మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే సాధారణ వ్యక్తి సత్యమే మార్గంగా, సత్యమే ఆయుధంగా, సత్యమే వ్రతంగా ఆ తదుపరి మహాత్ముడిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వ్యక్తిగా మారిన గాంధీ. తను రాసి ఆత్మకధ ‘మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్’ పుస్తకం మన భారతదేసంలోని అన్ని భాషలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో అనువాదం చెయ్యబడిన పుస్తకం అంటే చాలామంది నమ్మరు. మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఈ పుస్తకాన్ని ప్రపంచం లోని అనేక బిజినెస్ మేనేజ్ మెంట్ స్కూల్స్ పరిశోధన గ్రంధంగా గుర్తిస్తున్నారు, అంటే మహాత్ముడి ఆలోచనల విలువ ఎంతటిదో మన అందరికీ అర్ధం అవుతుంది.


 భారతదేశంలోని పుస్తకాల మార్కెట్ లో ఎన్నో రకరకాలా పుస్తకాలు వస్తున్నా, ఇప్పటికీ బెస్ట్ సెల్లర్స్ జాబితాలో మహాత్ముడి ఆత్మకధ ఉంది అంటే ఆ మహానుభావుడి జీవిత కధకు ఎంత విలువ ఉందో అర్ధం అవుతుంది. ప్రతి రోజు ఉదయించే సూర్యుడిలా సాయంత్రానికి వచ్చే చంద్రుడిలా సత్యానికి కాలదోషం లేదు. అలాగే మహాత్ముడి జీవితకధ కూడా ఎప్పుడూ పాత పడదు. ప్రపంచ స్థాయి గ్లోబల్ సీయివోల సర్వేలో ప్రపంచం లోని అత్యుత్తమ నాయకులలో ఒక గొప్ప వ్యక్తిగా ఇప్పటికీ మహాత్ముడికి ప్రపంచ ప్రజలు ఓటు వేస్తున్నారు అంటే ఇది నమ్మలేని నిజం. చైనా లాంటి కమ్యునిస్ట్ దేశంలో గాంధీజీ పుస్తకాలకు, గాంధీజీ సూక్తులకు రోజురోజుకూ విలువ పెరుగుతోంది అంటే మన మహాత్ముడి స్థాయి ఏమిటో తెలుస్తోంది. మహాత్ముడి గాంధేయ సిద్ధాంతాలను ఇతివృతంగా తీసుకొని ‘సత్యాగ్రహ’, ‘లగరహో మున్నాభాయ్’ లాంటి సినిమాలు బాలీవుడ్ లో విడుదల అయి సంచలన విజయాలు సాధించాయి. సత్యాన్ని మించిన భగవంతుడు లేడు అంటారు గాంధీ. మనం సత్యానికి కట్టుబడి ఉన్నప్పుడు భగవంతుడే మనతో మాట్లాడడం మొదలు పెడతాడు అని ఆయన నమ్మకం. ఈశ్వరుడు సేవలోనే ఉంటాడు అని చెప్పే గాంధీ, ఇతరులు చేసిన ఎంతటి తప్పునైనా చిన్నదిగా చూసి మనం చేసిన తప్పును మాత్రం కొండంత తప్పుగా భావించినప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలుగుతాడు అని చెప్పారు.


 బాపూజీ గొప్ప రచయిత కాడు, గొప్ప వకీలు కూడా కాడు, అన్నింటా మించి గొప్ప ఉపన్యాసకుడు కూడా కాడు, మంచి అందగాడు కూడా కాడు, కాని ఆయన బోసి నవ్వులో ఏదో తెలియని మైకం, ఆ మైకం తోనే కోట్లాది మంది జన హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని స్వాతంత్రోద్యమ నేతగా ఎదిగి స్వతంత్ర అనంతరం అఖిల భారత కాంగ్రెస్ ను రద్దు చేద్దాం అని చెప్పిన మహోన్నత వ్యక్తి గాంధీ. స్వతంత్రం వచ్చేదాక మాత్రమే గాంధీ ని మన జాతి బాపూజీ గా చూసింది. స్వతంత్రం అనంతరం బాపూజీ ని ఎవరికీ అక్కరలేని మాటలు చెప్పే ఒక పండు, ముసలిగా గాంధీ ని భావించారని అలనాటి తరం వారు చెపుతూ ఉంటారు. తను తీసుకొచ్చిన స్వతంత్ర భారతంలో తన సిద్ధాంతాలను తన కళ్ళ ఎదురు గుండానే తాను జీవించి ఉనప్పుడే గాంధేయ వాదాన్ని అలనాటి మన నాయకులు పాతి పెడుతూ ఉంటే ఆయన మౌనంగా చివరి రోజులలో రోధించేవారు అని అంటారు. తుపాకి గుండు తగిలినప్పుడు కూడా అమ్మ అనకుండా ‘హే రామ్’ అంటూ ప్రాణాలు వదిలిన ఆధ్యాత్మిక తత్వ వేత్త మహాత్మా గాంధీ. అందుకే బాపూజీ చూపించిన అహింసా మార్గం తనకే కాదు ప్రపంచానికి ఆదర్శ ప్రాయం అంటారు. బౌద్ధుల ఆధ్యాతిమిక గురువు దలైలామా. ఎన్నో జయంతులు వస్తున్నట్లుగానే చర్విత చరణంగా మరో గాంధీ జయంతిని రాజ్ ఘాట్ సాక్షిగా మన భారతజాతి మరోసారి నేడు జరుపుకుంటోంది. ఒక్క మాటలో ఆయన జీవితం గురించి చెప్పాలి అంటే విలువలకు నిలువెత్తు అద్దం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జీవితం.

అల్లుఅర్జున్ ఆలోచనులను మారుస్తున్న పవన్ అత్తారిల్లు.



స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ అత్తారిల్లు మెగా సక్సస్ ను ఆదర్శంగా తీసుకుని తాను నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘రేసుగుర్రం’ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నాడని ఫిలింనగర్ టాక్. ఈ సినిమాను కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రమోట్ చేయాలని బన్నీ ఆలోచిస్తున్నాడట. దీనికోసం ఈసినిమా కధలో కొద్దిగా మార్పులు చేయమని దర్శకుడు సురేంద్ర రెడ్డి బన్నీ సూచనలు చేసాడు అని అంటున్నారు. ఇప్పటికే సగం పైగా చిత్రీకరణ పూర్తి చేసిన ఈసినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేద్దామనే ఆలోచనలో బన్నీ ఉన్నాడట. ఈ సినిమా కోసం బైక్ రేస్ ట్రైనింగ్ కూడా తీసుకున్న అల్లుఅర్జున్ ఈసినిమాను పూర్తిగా యాక్షన్ సినిమాగా కాకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించడానికి ప్రధాన కారణం యాక్షన్ ప్యాక్ డ్ సినిమాగా రూపొందుతూ సంక్రాంతికి రాబోతున్న మహేష్ ‘1’ నేనొక్కడినే సినిమాతో ‘రేసుగుర్రం’ పోటీ పడుతోంది కాబట్టి ఆ పోటీలో నిలవాలి అంటే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందినప్పుడు మాత్రమే తన రేసుగుర్రం నిలబడుతుందని భావిస్తూ అల్లుఅర్జున్ స్క్రిప్ట్ లో ఈ మార్పులను సుచిస్తున్నాడు అని అంటున్నారు.


 శ్రుతిహాసన్ గ్లామర్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ పాలు కూడా ఎక్కవ ఉండేలా బన్నీ చూసుకుంటున్నాడట. ఈవిధంగా పవన్ బన్నీకి గురువులా మారి తన భవిష్యత్ సినిమాల ఎంపిక విషయంలో ఆదర్శంగా మారుతున్నాడు అనుకోవాలి. అత్తారింటి సూపర్ హిట్ ఇంకా ఎంత మంది టాప్ హీరోలు నటిస్తున్న స్క్రిప్ట్ లను మారుస్తుందో చూడాలి...

కిరణ్ రాజీనామా ఖాయమే...!


'నా హయాంలో రాష్ట్ర విభజన జరగదు...' అని అంటున్నాడట కిరణ్ కుమార్ రెడ్డి. తనతో సమావేశమైన మంత్రులతో కిరణ్ ఈ మాట చెప్పాడట. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాల గురించి చర్చించడానికి తాజాగా ముఖ్యమంత్రితో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. వీరితో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది.

 అయితే ముఖ్యమంత్రి మాటలకు రెండు పార్శ్వాలున్నాయి. 'నా హయాంలో విభజన జరగదు..' అని ముఖ్యమంత్రి అంటున్నాడంటే.. విభజన ప్రక్రియ పూర్తిగా ఆగిపోనైనా ఆగిపోవాలి.. లేదా విభజనకు ముందే ఆయన రాజీనామా చేయాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి జరిగితే ముఖ్యమంత్రి స్టేట్ మెంట్ నిజమయినట్టు అవుతుంది. మరి వీటిలో ఏది జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని అనుకుంటే చేయొచ్చు.. అని ఢిల్లీ నాయకులు ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. కిరణ్ కు పొగపెట్టే ప్రక్రియ ఇది అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక విభజన విషయంలో కూడా వెనుకడుగు వేయమని ఇప్పటికే కేంద్రం నుంచి అనేక ప్రకటనలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఏమో తాను ఇప్పటికీ సమైక్యవాదేనని అంటున్నాడు. విభజనపై పునరాలోచించుకోవాలని కిరణ్ ప్రెస్ మీట్ లు పెట్టి అధిష్టానానికి హెచ్చరికలు లాంటి సూచనలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. కిరణ్ మాటలు కాస్తంత నిస్తేజంగానే ఉన్నాయి. 'నా హయాంలో రాష్ట్ర విభజన జరగదు..'అంటున్న ఆయన విభజన తప్పదని అర్థం చేసుకున్న తరుణంలో పదవికి రాజీనామా చేసి వైదొలగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.