
ఏపి విభజన విషయంలో సోనియా ప్లాన్ వర్కవుట్ అయ్యేలా చేసుకునే పనిలో భాగంగా పిసిసి అద్యక్షుడు ఇక అవుట్ అవుతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజామా.. కాదా.. అన్నది కాసేపు పక్కన బెడితే అసలు విషయం కూడా ఓ సారి పరిశీలిద్దాం. ఇన్నాళ్లు అటు తెలంగాణ, ఇటు సమైక్యాంద్ర అంటూ రెండు నాల్కల దోరణిని ప్రదర్శిస్తూనే వ్యక్తిగతంగా మాత్రం తాను సమైక్యవాదినని పబ్బం గడుపుతూ వచ్చాడు పిసిసి అద్యక్షుడు. సరే ఆయన రాష్ట్రకాంగ్రెస్ కంతటికి అద్యక్షున్ని కాబట్టి అలా ఉన్నాను అంటే సరే అనుకున్నారు సమైక్యవాదులు కూడా, అయితే ఇప్పుడు ఆయనకు అసలు చిక్కు వచ్చిపడింది. దీంతో ఇక తప్పదని భావించి తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
కారణం సమైక్యవాదులు, ఏపిఎన్జీఓలు తాజాగా ఎంపీలందరిని రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసారు. ఆయన బార్య ఝాన్సీ ఎంపీ, ఆమె ఇప్పటివరకు అటూఇటూ కాకుండా చాటుగానే ఉంటున్నారు. ఇక మరో ఇద్దరు దగ్గరి బందువులు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బొత్స కుటుంబంపై జిల్లాలో తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడం మొదలయింది. అందుకే తను రాజీనామా చేస్తే తన వారు బతికి పోతారు అన్న నిర్ణయానికి వచ్చాడు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
అయితే ఆయన రాజీనామా రాష్ట్ర కాంగ్రెస్ పై తీవ్రప్రభావం పడుతుంది. మిగిలిన మంత్రులు కూడా రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, పొరపాటున బొత్స ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తే కాంగ్రెస్ సీమాంద్ర ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాల్సి వస్తుంది. అంటే ఇది సోనియా గాంధీ బొత్సతో ఆడిస్తున్న నాటకం కాదుకదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఓ వైపు ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేయవద్దు, అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వీగిపోయేలా చేయడమొక్కటే మనముందున్న ఏకైక మార్గం అంటున్నాడు, మరి బొత్స దీనికి వ్యతిరేక మార్గంలో పోతున్నాడని తెలుస్తోంది. అంటే ఇందులో ఏదో గేమ్ ఉందన్నమాటే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.