Friday, 27 September 2013

పాపం పోలీస్ బాస్..


ఎవరైనా సరే ఆయన ముందుకు వెల్లి సార్.. గిట్టని వాళ్లు నాపై నేరం మోపారు, నేనేం చేయలేదు అని మొరపెట్టుకుంటారు కాని ఆ పరిస్థితి ఆబాస్ కే వస్తే పాపం ఆయన దయనీయస్థితిని అర్థం చేసుకోవడం కష్టం. కాని ఈ పరిస్థితి మన రాష్ట్ర పోలీస్ బాస్ డిజిపి దినేష్ రెడ్డికి వచ్చింది. ఆయన అక్రమంగా ఆస్థులు సంపాదించాడు, ఆయన ఆస్థులపై విచారణ జరిపించండి అంటూ కోర్టుకు వెల్లడంతో ఇప్పడు ఆయనపై సిబిఐ విచారణ మొదలయింది. అయితే ఈ ఫిర్యాదు మొదటిది కాదు, ఆయన డిజిపి కాకముందు కూడా చేసారు. కాని అప్పుడు వర్కవుట్ కాలేదు, రెండోసారి అది పని చేయడంతో ఇప్పడు లబోదిబో అంటున్నాడు డిజిపి దినేష్ రెడ్డి. గురువారం సిబిఐ ఆయన అక్రమాస్థులపై విచారణ ప్రారంభించింది. దీంతో డిజిపి పదవి డైలమాలో పడింది. దీంతో ఇదంతా తనపై కావాలని చేసిన కుట్ర అని, తను డిజిపి కాకూడదనే ఈ కుట్ర జరుగుతోందని అన్నాడు. తనపేరుపై ఎలాంటి ఆస్థులు లేవని చెప్పాడు. తన బార్య పేరుపై మాత్రం ఆరున్నర ఎకరాల స్థలం ఉందని చెప్పారు. తను డిజిపి కాకముందే అడ్డుకునేందుకు ఈ ఫిర్యాదులు చేసారని, సాక్ష్యాలు లేవని అప్పుడు పట్టించుకోలేదని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఎంపీ సంతకం ఫోర్జరీ చేసి ఫిర్యాదు చేసారని ఆయన వాపోయారు. ఆయనే ఇవన్నీ విని న్యాయం చేయాల్సిన బాసాయే. ఇప్పుడు ఆయనకెవరు న్యాయం చేయాలి చెప్పండి. అందుకే ఆయన మళ్లీ సర్ది చెప్పుకున్నారు, సిబిఐ విచారిస్తోందిగా, అన్ని నిజాలు తెలుస్థాయి అన్నాడు. ఇంత దానికి మీడియా ముందుకు వచ్చి బాబ్బాబు ఇవన్నీ ఆరోపణలే అని చెప్పుకోవడం ఎందుకో....

దగా స్టార్ గా మారిన మెగాస్టార్


ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాందించిన మెగాస్టార్ బిరుదును చిరంజీవి ఓ చిన్న తప్పుతో గంగలో కలుపుకున్నాడు అంటున్నారు. ఆయన కు మెగాస్టార్ బిరుదు రావడానికి కొన్నేళ్లు పడితే కొన్ని రోజుల్లోనే అది చెదిరిపోయి ఆస్థానంలో దగాస్టార్ అనే దరిద్రపు బిరుదును తెచ్చుకున్నాడు అంటున్నారు. తాజాగా సీమాంధ్రలో సమైక్య ఉద్యమం చేస్తున్న ప్రజలు చిరంజీవిని దగాస్టార్ తో పోల్చారు. మెగాస్టార్ ను ఎంత అభిమానించి భుజాలకెత్తుకుని ఊరేగించామో దగాస్టార్ ను అదే రీతిలో దమ్ముకూడా తీసుకోకుండా పాతరేస్తామని ఆవేశంగా మీడియా ముందు అభిప్రాయం వెల్లడించారు సమైక్యవాదులు. ఇదంతా కాంగ్రెస్ తీస్తున్న దరిద్రపు సినిమా గా అభివర్ణించారు. ఈ సినిమాలో దగాస్టార్ చిరంజీవి హీరో అయితే కేంద్ర హోంమంత్రి షిండే విలన్ పాత్ర పోషిస్తున్నాడని సమైక్యవాదులు అన్నారు. ఇక ఇతర పాత్రల్లో సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, తదితరులు నటిస్తున్నారని, ఈసినిమాను విడుదల కూడా కాకుండా ఆపే దమ్ము, ధైర్యం మాకుందని వారు స్పష్టం చేసారు. ఇలా రోజురోజుకు జరుగుతున్న పరిణామాల చూస్తుంటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ నేతల పరిస్థితి కంప్లీట్ ఖతమైనట్టే కనిపిస్తోందంటున్నారు. సొంత ఇంటికి కూడా రాకుండా మంత్రులను అడ్డగించి చావకొట్టినంత పని చేస్తున్నారంటే పరిస్థితి ఏమేరకు విషమించిందో అర్థం చేసుకోవచ్చు.

ఈనాడు కు జగన్ డేంజర్ సిగ్నL


ఈనాడు మీడియాకు జగన్ డేంజర్ సిగ్నల్స్ జారీ చేసాడు అంటున్నారు. ఆయన జైలు నుంచి ఇంటికి వెల్లు సమయంలో ఈ పని చేసాడు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈనాడు మీడియా జగన్ విషయంలో పూర్తిగా నెగేటివ్ వార్తలు రాస్తున్న విషయం తెలిసిందే. వైఎస్పార్ బతికున్నప్పటి నుంచి ఈనాడు ఆయనకు వ్యతిరేకంగానే కథనాలు రాస్తోంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారం పతాకశీర్షికల్లో ప్రచురించడం, తన చానల్ లో ప్రసారం చేస్తుండడం అందరికి తెలిసిందే. నిజానికి ఈనాడును బీట్ చేయడానికే జగన్ సాక్షి ని ప్రారంభించాడని కూడా అందరు భావిస్తుంటారు. జగన్ చంచల్ గూడ జైలునుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఆయన కాన్వాయ్ ఖైరతాబాద్ సర్కిల్ దాటి సోమాజిగూడ లోని ఈనాడు ప్రధానకార్యాలయం ముందుకు చేరుకుంది. అక్కడ కాసేపు కాన్యాయ్ ను ఆపడమే కాదు ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఆ మేనేజ్ మెంట్ ను హెచ్చరించే దోరణిలో వాఖ్యలు చేసారు. ఇదే... భవిష్యత్తులో తాము చేయబోయేది అన్న హెచ్చరికలే అవి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

వైఎస్సార్ సిపిలో కాంగ్రెస్ విలీnam


వైఎస్పార్ సిపిలో కాంగ్రెస్ విలీనం కాబోతోందన్నది రాష్ట్రరాజకీయాల్లో లేటెస్టు గా వినిపిస్తున్న గరంగరం వార్త. అదేంటి సోనియా తో జగన్ డీల్ అని అందరు ఆరోపిస్తున్న దానికి భిన్నంగా ఈ వార్త వినిపిస్తోంది, ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తే మాత్రం పప్పులో కాలేసినట్టే అంటున్నారు. కారణం ఇది అక్షరాల నిజం అంటున్నారు, కాని వర్షన్ లోకాస్తా తేడా ఉన్నదంతే. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ సిపిలో విలీనం కావడంలేదు కాని కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ నేతలు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్ గూటిలోకి వచ్చేస్తున్నారట. పార్టీ విలీనం కాకపోతే ఏంటి ఖాలీ అవుతోంది కదా.. అలాంటప్పుడు వైఎస్సార్ సిపిలో కాంగ్రెస్ విలీనం అవుతోంది అంటే తప్పేంటి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. టోటల్ గా జగన్ పార్టీలోకి వెల్లడం లేదు కాని, మెజార్టి సంఖ్యలో వైఎస్సార్ సిపిలోకి, జగన్ తో పొసగని కొందరు టిడిపి లోకి వెల్లాలన్న ఆలోచనలో ఉన్నారన్నది లేటెస్ట్ వార్త. ఈ మేరకు వైఎస్సార్ సిపి లోకి వెల్లే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే జాబితా కూడా మీడియాలో బయటకు వచ్చేసింది. రఘువీరారెడ్డి వంటి ప్రముఖ రాష్ట్ర మంత్రితో పాటు, అనంత వెంకట్రామిరెడ్డి వంటి ప్రముఖ ఎంపీల వరకు వైఎస్పార్ సిపి లోకి వెల్లేవారి జాబితాలో ఉన్నారట. ఇక తెలుగుదేశంలోకి వెల్లే వారి జాబితా ఖరారు కాలేదు కాని వెల్లే అవకాశం ఉన్నవారి పేర్లు మాత్రం లీకయ్యాయి. మొత్తం మీద రిజల్ట్ ఏంటంటే సీమాంద్రలో ఇక కాంగ్రెస్ పార్టీ ఉండడంలేదని, పూర్తిగా దుకాణం బంద్ చేసుకున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు.

జగన్ కు అగ్ని పరీksha


జగన్ కు బెయిల్ రావడం రాష్ట్రం అంతటా ఆయన అభిమానుల్లో సంబరాలు నింపితే జగన్ కు మాత్రం అది అగ్నిపరీక్షగా మారిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం ఆయన జైలు నుంచి బయటకు వస్తే చూసి తరించేందుకు రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి అభిమానులు తరలి వచ్చారు. రాని వారు వారి ప్రాంతాల్లో సంబరాలు జరుపుకున్నారు. ఇదంతా మంగళవారం ఉదయం నుంచి టీవీల్లో అందరం చూసాం కూడా. దీనిని చూసి జగన్ కు సంబరపడాలా, లేక ఆయన ఏనిర్ణయం తీసుకోవాలో తెలియని చిక్కు సమస్యను ఆయన అభిమానులు తెచ్చిపెట్టారు అని గాభరా పడాలా అన్నది తేల్చుకో లేని పరిస్థితి. కారణం ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు. కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయంతో రాష్ట్రం రెండు ప్రాంతాలు విడిపోయి విద్వేషాలతో అట్టుడికి పోతోంది. ఓ ప్రాంతంవైపు మొగ్గు చూపితే మరో ప్రాంతంలో శతృవులా చూస్తున్న పరిస్థితి. అయితే ముందునుంచి విజయమ్మ, జగన్ చెపుతున్న మాటల ప్రకారం వైఎస్సార్ తెలుగువారందరి మనిషి అని, అన్ని ప్రాంతాల శ్రేయస్సే మా కర్తవ్యమని అంటున్నారు. విభజన నిర్ణయంతో జగన్ పార్టీ తీసుకున్న టర్న్ తో నాయకుల్లో విబేదాలు వచ్చి తెలంగాణలో పార్టీకి గుడ్ బై చెప్పారు కాని జనాల్లో మాత్రం జగన్ పై అభిమానం పోలేదని ఇంకా ఆయనను తెలంగాణలో దేవునిలా చూస్తున్నారని ఆయన బెయిల్ పై బయటకు వచ్చే ఘట్టం రుజువు చేసింది. దీంతో రేపటి నుంచి జగన్ ఏంచేయాలి, సమైక్య రాష్ట్రంగా ఉండాలి అని ఇప్పుడు అంటున్నారు, కాని వన్ సైడ్ అయి తెలంగాణ విడిపోతే సీమాంధ్రకు నష్టమని డైరెక్టుగా షర్మిలతో పాటు విజయమ్మ కూడా బహిరంగ సభల్లో చెపుతున్నారు. అంతే కాదు సమన్యాయం అంటే కూడా సీమాంద్రలో జనం ఒప్పుకోవడం లేదు. అలాంటప్పుడు ఇప్పుడు జగన్ ఏంచేయాలి, వన్ సైడ్ అయి మాట్లాడితే తెలంగాణలో కూడా ఆయనను గుండెల్లో నింపుకున్న వారు నిప్పులు కురిపిస్తారు, అలా కాక అందరు నావారే అందరికి న్యాయం కావాలి అంటే అసలుకే ఎసరు వస్తుంది, అందుకే ఇప్పుడు జగన్ కు అసలు అగ్ని పరీక్ష ఎదురవుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

సీమాంద్ర కాంగ్రెస్ లో ఎంపీల ప్రకంపన


సీమాంద్ర కాంగ్రెస్ లో ఎంపీల ప్రకంపనలు మొదలయ్యాయి. ఏడుగురు ఎంపీలు ఈ నెల 24న పదవులకు రాజీనామా చేసి ఆమోదింప చేసుకుంటామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇది ముఖ్యమంత్రితో సహా సీమాంద్ర కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రుల్లో దడ పుట్టించిందంటున్నారు. ఎలాగైనా ఎన్నికలు వచ్చేదాకా పదవుల్లో ఉండాలనే కదా ఎవరెంత గోల పెట్టినా రాజీనామాలు చేయకుండా నెట్టుకు వస్తోంది. ఇప్పుడు వీరు రాజీనామాలు చేస్తే సిఎం తో సహా సీమాంద్ర కేంద్ర,రాష్ట్రమంత్రులు రాజీనామాలు చేయకపోతే ఇక వారిని తిట్టడం మాట అటుంచి ఉన్న చోటికి వచ్చి రాళ్లతో కొట్టడం ఖాయం అన్న ఆందోళన వారిలో కలిగింది. అందుకే వారిని రాజీనామాలు చేయకుండా ఆపేందుకు ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఒకరిద్దరు కేంద్రమంత్రులు రంగంలోకి దిగారని వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఇప్పడు కేంద్రం తెలంగాణ ఇచ్చేందుకు సిద్దమయింది, దానిని ఆపడం కుదరదని కూడా అందరికి తెలిసిపోయింది. అంతే కాదు ఇప్పుడు ఎవరు రాజీనామా చేసినా సరే వెంటనే ఆమోదించేందుకు కూడా అధిష్టానం సిద్దంగా ఉందట. కారణం ఇక కథ క్లయిమాక్స్ కు వచ్చింది కాబట్టి. అలా చేస్తే పరిస్థితి ఏంటి తెలంగాణ బిల్లును అసెంబ్లీలో, అటు పార్లమెంట్ లో అడ్డుకునే ప్రయత్నం చేసి సీమాంధ్రలో పోయిన పరువును తిరిగి కాపాడుకొనే అవకాశం కూడా కోల్పోతామన్న ఆందోలన కూడా వారిలో కలిగిందట. ఇంతకీ ఏంజరుగుతుందో చూడాలి మరి.

కేసిఆర్ లో గుబులు పుట్టించిన జగన్ విడుదla


జగన్ జైలు నుంచి విడుదలయిన ఘట్టం కేసిఆర్ గుండెల్లో గుబులు పుట్టించింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం ఆయనకు జైలు నుంచి స్వాగతం పలకాడానికి వచ్చిన వారిలో తెలంగాణ లోని అన్ని జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి రావడమే. పోని నేతలు డబ్బులిచ్చి జనాన్ని పోగు చేసారనడానికి వీలు కూడా లేదు, ఎందుకంటే రాత్రికి రాత్రి ఇంత జనాన్ని పోగుచేయడం అసాధ్యం. తెలంగాణలో వైఎస్సార్ సిపి నాయకులు దాదాపుగా రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరారు. అంటే నాయకులు తరలించారనడానికి అవకాశం లేదు. తెలంగాణవారు రాలేదు, కేవలం ప్రచారమే అనడానికి కూడా అవకాశం లేదు, టీవీల్లో ప్రత్యక్షప్రసారాల్లో తెలంగాణ నుంచి వచ్చిన వారు ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు. వారి గుండెల్లో వైఎస్సార్ పథకాలు ఎలా నిలిచిపోయాయో చెప్పారు. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులయితే ఈ రోజు తాము చదువుకుంటున్నామంటే వైఎస్సారే కారణమని, ఇంకా మాలాంటి వాళ్లు చదువుకోవాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని అనడం గమనార్హం. తెలంగాణకు చెందిన మరి కొందరు మానాన్న బతికున్నాడంటే వైఎస్సార్ చలువేనన్నారు, మా ఇంట్లో అమ్మ ఆరోగ్యంగా ఉందంటే ఆరోగ్యశ్రీనే కారణమన్నారు. అంతే కాదు తెలంగాణలో వైఎస్సార్ సిపి లేదని ఎవరన్నారు, కొందరు రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం కుప్పిగంతులు వేసారని జనం గుండెల్లో వైఎస్సార్, జగన్ ఇంకా గూడు కట్టుకుని ఉన్నారని స్పష్టం చేసారు. దీంతో తెలంగాణలోను జగన్ ప్రభంజనం ఉందని తేలిపోయిందని, ఇది కేసిఆర్ కు గుబులు పుట్టించిందని, అందుకే ఆయన జగన్ కు ఫేవర్ గా మాట్లాడుతున్నాడన్న వాదనలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి.

ఉద‌యం 2 గంట‌ల‌కే ట్రాఫిక్ జాంలు..!


అత్తారింటికిదారేది మూవీ లేటుగా వచ్చినా, స‌క్సెస్‌ను చూసింది. అయితే ఈ మూవీ కోసం హైద‌రాబాద్‌,వైజాగ్‌,విజ‌య‌వాడ‌,గుంటూరు,తిరుప‌తి వంటి ఏరియాల్లో ప్రత్యేక‌మైన బెన్ఫిట్‌షోల‌ను ఏర్పాలు చేశారు. బెన్ఫిట్ షో టిక్సెట్స్ తీసుకున్న అభిమానులు రెండు గంట‌ల ముందే థియోట‌ర్స్ వ‌ద్దకు చేరుకొని ప‌వ‌నిజం నినాదాల‌తో రోడ్లపై చిందులేస్తున్నారు. హైద‌రాబాద్ కొన్ని ధియోట‌ర్లలో బెన్ఫిట్ షోను ఉద‌యం 2 గంట‌ల‌కే ఆడించారు. గుంటూరులోనూ ఉద‌యం 2 గంట‌ల‌కే ధియోట‌ర్స్‌లో షోను ప్లే చేశారు. త‌రువాత సెకండ్ షోను వెంట‌నే 5 గంట‌ల‌కు వేశారు. దీంతో థియోట‌ర్ల వ‌ద్ద అభిమానుల తాకిడితో హైద‌రాబాద్‌లో కొన్నిచోట్ల ట్రాఫిక్‌జాం అయి, మిల్క్ ట్రాన్స్‌పోర్ట్‌ల‌కు ఇబ్బంది ఎదుర‌యింది. బెన్ఫిట్ షోకి టికెట్స్ లేని వాళ్ళు కూడ వ‌చ్చి, టికెట్ కౌంట‌ర్ వ‌ద్దే గొడ‌వ‌కు దిగారు. టికెట్లు లేవ‌ని థియోట‌ర్ య‌జ‌మానులు చెప్పినా, మాట విన‌కుండా టికెట్స్ ఇచ్చేవర‌కు అక్కడే ఉండిపోయారు. వారంద‌ర‌కి ఉద‌యం 9 గంట‌ల‌కు షోకి టికెట్లు ఇచ్చేవ‌ర‌కూ అక్కడే ఉండిపోయారు. ఈ విధంగా ప‌వ‌న్ మూవీ రీలీజ్‌ను ప‌క్కన పెడితే, ఈ రోజు హైద‌రాబాద్ రోడ్లపై ఎర్లీ మార్నింగ్ అంతా ప‌వ‌న్ అభిమానుల‌తో సంద‌డి చేస్తూ క‌నిపించింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వ‌చ్చి ట్రాఫిక్ క్లియ‌ర్ చేసిన సంద‌ర్భాలు క‌నిపించాయి.