Monday, 14 October 2013

సీమాంధ్ర ఎంపీల రాజీనామా తిరస్కరణ


న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర ఎంపీలు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ కార్యాలయం తిరస్కరించింది. రాజీనామలు చేసిన సీమాంధ్ర ఎంపీలు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. ఎంపీలు రాయపాటి,బాపిరాజు,మాగుంట, హర్షకుమార్, కొనకళ్ల, జగన్‌లు, మరికొంత మంది ఎంపీలు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. ఎంపీల రాజీనామాలపై ఒత్తిడులు ఉన్నాయా అని స్పీకర్ కార్యాలయం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

 ఎంపీలు రాజీనామా చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యల సీడీని కార్యాలయం పరిశీలిస్తోంది. రాజీనామలు ఇచ్చిన వెంటనే ఆమోదించాల్సిన అవసరం లేదని, ఆర్టికల్ 101(3బి) ప్రకారం పూర్తి స్థాయి విచారణ జరపొచ్చని, సమాచార సేకరణ కూడా చేయొచ్చని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. గతంలోనే స్పీకర్ మీరాకుమార్‌ను ఎంపీలు ఎస్పీవైరెడ్డి, సాయిప్రతాప్,లగడపాటి,అనంత,సబ్బంహరి,మేకపాటి, ఉండవల్లి కలిసిని విషయం తెలిసిందే.

No comments:

Post a Comment