‘‘తెలుగు పరిశ్రమలో నాకున్న బ్యాక్‌గ్రౌండ్‌కి ఇక్కడ సినిమా నిర్మిస్తే చాలా సులువుగా ఉంటుంది. అయితే పుణెతో నాకున్న అనుబంధం, మరాఠీ సినిమాల మీద ఉన్న మక్కువతో తొలి ప్రయత్నంగా ఓ మరాఠీ సినిమా నిర్మిస్తున్నా’’ అన్నారు రేణుదేశాయ్. ‘బద్రి’ ద్వారా తెలుగు తెరపై మెరిసిన ఆమె పవన్‌కళ్యాణ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క ‘జానీ’లో నటించి, ఆ తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.ఇప్పుడు నిర్మాతగా మారి, మరాఠీలో ‘మంగళాష్టక్ వన్స్ మోర్’ అనే చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రేణు మాట్లాడుతూ - ‘‘గత పది, పన్నెండేళ్లల్లో సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నింట్లోనూ పాల్గొన్నాను. దాని వల్ల సినిమా మేకింగ్ మీద ఓ అవగాహన వచ్చింది. అందుకు కళ్యాణ్ (పవన్‌కళ్యాణ్)కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ పన్నెండేళ్లల్లో సాధించిన అనుభవంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా’’ అన్నారు. ఈ షూటింగ్ లొకేషన్‌లో మీరు కొంతమంది దగ్గర దురుసుగా ప్రవర్తించారనే టాక్ ఉంది? అనే ప్రశ్నకు సమాధానంగా- ‘‘ఎక్కడైనాసరే మగవాళ్లు అరిస్తే అది తప్పుగా అనిపించదు.
No comments:
Post a Comment