పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టేదిశగా దూసుకుపోతోంది. అయితే, తమ సినిమాను ఆదరించినందుకుగానూ, కృతజ్ఞతలు తెలిపేందుకు చిత్ర బృందం హైదరాబాదు శిల్ప కళా వేదికలో థాంక్స్ గివింగ్ ఫంక్షన్ నిర్వహిస్తోంది. ఈ మూవీకి తివిక్రమ్ దర్శకత్వం వహించగా.. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. దీనిలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన తన అభిమానులకు అభినందనలు చెప్పడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.... ఈ పైరసీని ఇండస్ట్రీ పెద్దలే ప్రోత్సహిస్తున్నారు...ఎన్ని సినిమాలు చేశానో గుర్తుపెట్టుకోలేదు. సినిమాలు చేయడమే కానీ ఇలా సక్సెస్ మీట్ లు ఏర్పాటు చేసుకోవడం ఆసక్తి ఉండదు. కానీ ఈ సినిమాకు పంక్షన్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాను. నేను సినిమాలకు రావడానికి ప్రేక్షకులు చూపే ప్రేమే కారణం. జయాలకు ఎప్పుడూ పొంగిపోలేదు. అపజయాలు ఎప్పుడూ.. లొంగిపోలేదు. ఈ సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈ మీట్ ఏర్పాటు చేశాం.
No comments:
Post a Comment