
‘నేను అండర్ వరల్డ్ కాన్సెప్ట్ తో చేస్తున్న చివరి సినిమా ఈ సత్య 2. ఇక నుంచి అండర్ వరల్డ్ కాన్సెప్ట్ తో ఎటువంటి సినిమాలు చెయ్యను. త్వరలో రొమాంటిక్ సినిమాలు తియ్యాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం రెండు లవ్ స్టొరీలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి మార్షల్ ఆర్ట్స్ కి సంబందించిన మూవీ, అది ఈ డిసెంబర్లో మొదలవుతుందని’ ఓ ఆడియో ఫంక్షన్‌కు అటెండ్ అయిన సందర్భంలో వివరించాడు. వర్మ ఏంటి, ప్రేమ కథలేంటి అని ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, ప్రేక్షకులు కూడ భయపడిపోతున్నారు. వర్మ లవ్ స్టోరీను తీస్తే అది లవ్ ఫెయిల్యూర్ స్టోరీనా లేక సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీనా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఏదేమైనా వర్మ లవ్‌స్టోరీలను తీసి, ఓ ట్రెండ్ సెట్ చేయాలని వర్మ అభిమానులు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment